Pawan Kalyan: కొండగట్టు అంజన్న సన్నిధిలో వారాహికి పూజలు.. ఎన్నికల బరిలోకి పవన్ ప్రచార రథం

ట్రాఫిక్ సమస్య వల్ల పవన్ పర్యటన ఆలస్యం అయింది. కొండగట్టు చేరుకున్న తర్వాత ఆంజనేయస్వామి ఆలయంలో వారాహి ప్రచార రథానికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.

Pawan Kalyan: కొండగట్టు అంజన్న సన్నిధిలో వారాహికి పూజలు.. ఎన్నికల బరిలోకి పవన్ ప్రచార రథం
Pawan Puja At Kondagattu
Follow us

|

Updated on: Jan 24, 2023 | 2:06 PM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శించుకున్నారు. ఆంజనేయస్వామి ఆలయంలో వారాహి ప్రచార రథానికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ కి ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారి దర్శన అనంతరం పార్టీ ప్రచార రథం వారాహికి వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య జనసేనాని శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు జరిపించారు. పవన్ కళ్యాణ్ తో వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు దగ్గరుండి చేయించిన వేద పండితులు వాహనం ఎదుట సంకల్పసిద్ధి చేయించారు. వారాహి వాహనానికి పండితులు ప్రత్యేకంగా స్వామివారి యంత్రాన్ని కట్టి, సింధూరంతో శ్రీరామదూత్ అని రాశారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలు అనంతరం విఘ్నాలు తొలగిపోయేలా, విజయాలు సిద్ధించేలా గుమ్మడికాయ కొట్టి వారాహిని ప్రారంభించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనం అందుకున్నారు పవన్ కళ్యాణ్. అనంతరం జనసేనాని ప్రారంభసూచకంగా వారాహి ఎక్కి వాహనాన్ని పరిశీలించారు. వారాహి ప్రారంభించిన అనంతరం నాచుపల్లి సమీపంలోని కోడీమ్యాల మండలం పరిధిలోని బృందావన్ రిసార్ట్‌లో తెలంగాణ జనసేన నేతలతో సమావేశం కానున్నారు.

వారాహి వాహనానికి పూజల చేయడానికి నిమిత్తం జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న ఆలయానికి పవన్ కళ్యాణ్ ఉదయమే హైదరాబాద్ నుంచి బయలు దేరారు. జనసేనానితో పాటు నేతలు, కార్యకర్తలు భారీగా కాన్వాయ్ తో కలిసి వెళ్లారు. ఉదయం 11 గంటలకు కొండగట్టు ఆంజనేయ ఆలయానికి చేరుకోవాల్సి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ కాన్వాయ్ భారీ ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుకోవడంతో అనుకున్న సమయం కంటే కొంచెం ఆలస్యంగా కొండగట్టుకు చేరుకున్నారు జనసేనాని. ట్రాఫిక్ సమస్య వల్ల పవన్ పర్యటన ఆలస్యం అయింది.

హైదరాబాద్ నుంచి కొండగట్టు చేరుకునే మార్గ మధ్యలో పవన్ కు అడుగడుగునా అభిమానులు ఘన స్వాగతం లభించింది. పవన్ కళ్యాణ్ కు గజమాలలతో సత్కారం చేసహ్రు. పూలు జల్లి  ఆనందోత్సాహాలను తెలిపారు.

ఇవి కూడా చదవండి

జనసేనాని పర్యటన నేపథ్యంలో జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు భారీగా ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. తమ అధినేత పర్యటనలో పాల్గొనేందనుకు ఇతర జిల్లాల నుంచి కూడా అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
అతిగా తింటే విషమే..! జీడిపప్పును ఎక్కువగా తింటే ఇలా అవుతుందా..?
అతిగా తింటే విషమే..! జీడిపప్పును ఎక్కువగా తింటే ఇలా అవుతుందా..?
రాణించిన ఆర్సీబీ బౌలర్లు.. గుజరాత్ ఆలౌట్.. టార్గెట్ ఎంతంటే?
రాణించిన ఆర్సీబీ బౌలర్లు.. గుజరాత్ ఆలౌట్.. టార్గెట్ ఎంతంటే?
తక్కువ ధరలో అదిరిపోయే స్మార్ట్‌ ఫోన్‌.. ఫీచర్స్‌ ఎలా ఉన్నాయంటే
తక్కువ ధరలో అదిరిపోయే స్మార్ట్‌ ఫోన్‌.. ఫీచర్స్‌ ఎలా ఉన్నాయంటే
పుష్ప ఫస్ట్ సాంగ్ రికార్డ్ బద్దలు.| మంచి గోస్ట్ తో వెన్నెల కిషోర్
పుష్ప ఫస్ట్ సాంగ్ రికార్డ్ బద్దలు.| మంచి గోస్ట్ తో వెన్నెల కిషోర్
ఊహకందని డిస్కౌంట్‌.. రూ. 38 వేలకే ఫోల్డబుల్ ఫోన్‌
ఊహకందని డిస్కౌంట్‌.. రూ. 38 వేలకే ఫోల్డబుల్ ఫోన్‌
తెలంగాణలో పెరిగిన డేటింగ్ యాప్ నేరాలు.. ఎక్కువ బాధితులు వీరే
తెలంగాణలో పెరిగిన డేటింగ్ యాప్ నేరాలు.. ఎక్కువ బాధితులు వీరే
బాబోయ్‌.. బిర్యానీలో పిల్లి మాంసం వాడుతున్నారా..? వీడియో చూస్తే
బాబోయ్‌.. బిర్యానీలో పిల్లి మాంసం వాడుతున్నారా..? వీడియో చూస్తే
చాలా ఈజీ.. వార్నర్‌ కు పుష్పరాజ్ టిప్స్.! | బాహుబలి ఆగమనం..
చాలా ఈజీ.. వార్నర్‌ కు పుష్పరాజ్ టిప్స్.! | బాహుబలి ఆగమనం..
న్యూఢిల్లీలో శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు..
న్యూఢిల్లీలో శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు..
ఆ స్పెషల్ పర్సన్ బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన ఎంఎస్ ధోని
ఆ స్పెషల్ పర్సన్ బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన ఎంఎస్ ధోని
సాయంకాలం సదా సీదాగా మాజీ మంత్రి.. రోడ్‎పై టిఫిన్ చేసిన హరీష్ రావు
సాయంకాలం సదా సీదాగా మాజీ మంత్రి.. రోడ్‎పై టిఫిన్ చేసిన హరీష్ రావు
రోడ్డుపై మందుబాబుల వీరంగం.. సహనం కోల్పోయి చెయ్యి చేసుకున్న పోలీస్
రోడ్డుపై మందుబాబుల వీరంగం.. సహనం కోల్పోయి చెయ్యి చేసుకున్న పోలీస్
ప్రభుత్వ ఆస్పత్రిలో ఇదేం పని.. సీసీ టీవీకి చిక్కాడు..
ప్రభుత్వ ఆస్పత్రిలో ఇదేం పని.. సీసీ టీవీకి చిక్కాడు..
'ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‎పై దుష్ప్రచారాన్ని నమ్మోద్దు'.. జగన్
'ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‎పై దుష్ప్రచారాన్ని నమ్మోద్దు'.. జగన్
పైకి చూస్తే అదొక ఏటీఎం వ్యాన్.. లోపలున్న పార్శిళ్లు తెరిచి చూడగా
పైకి చూస్తే అదొక ఏటీఎం వ్యాన్.. లోపలున్న పార్శిళ్లు తెరిచి చూడగా
కృష్ణ బిలాలు సరే.. మరి ఈ బ్లూ హోల్స్‌ సంగతి ఏంటి ??
కృష్ణ బిలాలు సరే.. మరి ఈ బ్లూ హోల్స్‌ సంగతి ఏంటి ??
పాకిస్తాన్ లో 5 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌.. ఎందుకో తెలుసా ??
పాకిస్తాన్ లో 5 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌.. ఎందుకో తెలుసా ??
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10 వేల కోట్లు
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10 వేల కోట్లు
వందే భారత్‌ మెట్రో ఫస్ట్‌ లుక్‌.. ఎలా ఉందంటే ??
వందే భారత్‌ మెట్రో ఫస్ట్‌ లుక్‌.. ఎలా ఉందంటే ??
బుద్ధిమంతులకే బ్రాండ్‌ అంబాసిడర్‌.. అతని షర్ట్‌లోనే ఉంది ట్విస్ట్
బుద్ధిమంతులకే బ్రాండ్‌ అంబాసిడర్‌.. అతని షర్ట్‌లోనే ఉంది ట్విస్ట్