AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bobbili Yuddham: పౌరుషాగ్నికి ప్రతీకగా నిలిచిన బొబ్బిలి యుద్ధానికి 266 ఏళ్లు.. ఆ రోజున ఏం జరిగిందో తెలుసా?

నాడు విజయనగరం గజపతిరాజులకు, బొబ్బిలి రాజులకు మధ్య హోరాహోరీగా జరిగిన యుద్ధ చరిత్ర నేటికీ ఆ విషాదఛాయలు, యుద్ధ వీరుల త్యాగాలు అందరికి గుర్తుండిపోయాయి. బొబ్బిలి యుద్ధాన్ని స్మరించుకుంటూ ఏటా జనవరి 24న కోటలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు

Bobbili Yuddham: పౌరుషాగ్నికి ప్రతీకగా నిలిచిన బొబ్బిలి యుద్ధానికి 266 ఏళ్లు.. ఆ రోజున ఏం జరిగిందో తెలుసా?
Battle Of Bobbili
Surya Kala
|

Updated on: Jan 24, 2023 | 12:19 PM

Share

తెలుగు నేలపై ఎన్నో యుద్ధాలు జరిగాయి.. అయినప్పటికీ చరిత్రలో బొబ్బిలి యుద్ధానికి ప్రత్యేక స్థానం ఉంది. పౌరుషాగ్నికి ప్రతీక గా లీచింది బొబ్బిలి యుద్ధం. వీర పరాక్రమం, వెన్నుపోటు, పగ, ప్రతీకారానికి ప్రతీక అయిన బొబ్బిలి యుద్ధం ఒకరోజుతోముగియడం విశేషం. 1757 జనవరి 24 జరిగిన ఈ యుద్ధానికి నేటితో 266 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ చారిత్రక బొబ్బిలి యుద్ధం జరిగి రెండున్నర శతాబ్దాలు దాటుతున్నా ఆ యుద్ధ గాధ తెలుగునోట ఎక్కడో ఓ చోట వినిపిస్తునే ఉంటుంది.  బొబ్బిలి యుద్దం జరిగిన చోట, బొబ్బిలి కోట నెలమట్టమైన చోట స్మారక స్థూపం కూడా ఏర్పాటు చేశారు. నాటి బొబ్బిలి యుద్ధాన్ని స్మరించుకుంటూ ఏటా జనవరి 24న కోటలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. ఈ సందర్భంగా బొబ్బిలి యుద్ధస్తూపం వద్ద యుద్ధ వీరులకు ఘనంగా నివాళులర్పిస్తారు బొబ్బిలి రాజ వంశీయులు. నాడు యుద్ధంలో వాడిన కత్తులు, బల్లేలు, కవచాలు, తుపాకుల్లాంటివన్నింటినీ కోటలో సందర్శనకు ఏర్పాటు చేశారు.  సింహాసనం సహా అనేక వస్తువులతో కలిపి మ్యూజియంగా ఉంచి వారసత్వ సంపదను సంరక్షిస్తున్నారు.

నాడు విజయనగరం గజపతిరాజులకు, బొబ్బిలి రాజులకు మధ్య హోరాహోరీగా జరిగిన యుద్ధ చరిత్ర నేటికీ ఆ విషాదఛాయలు, యుద్ధ వీరుల త్యాగాలు అందరికి గుర్తుండిపోయాయి. యుద్ధకారణంగా ఇటు బొబ్బిలి రాజులు, బొబ్బిలి సేన హతమైతే తమ వారి పై జరిగిన దాడికి ప్రతిదాడిగా అదే రోజు గుడారం లో సేద తీరుతున్న విజయనగరం గజపతిరాజు అయిన పెదవిజయరామరాజును హతమార్చాడు తాండ్రపాపారాయుడు.. ఆ యుద్ధం కారణంగా ఇరు సామ్రాజ్యాలు రాజులని కోల్పోయి.. తీవ్రంగా నష్టపోయాయి.. బొబ్బిలి కోటలో మరింత విషాదం నెలకొంది.. యుద్ధం తరువాత మహిళల పై దాడులు జరుగుతాయన్న కారణంగా మహిళలు, చిన్నారులు ఆగ్నిలో దూకి ఆత్మార్పణ చేసుకున్నారు.. ఈ ఘటనలు ఇప్పటికీ జిల్లావాసులను కలిచివేస్తుంటాయి.

Battle Of Bobbili 1

Battle Of Bobbili 1

రెండున్నర శతాబ్దాలు దాటుతున్నా ఆ యుద్ధ గాధ తెలుగునోట ఎక్కడో ఓ చోట వినిపిస్తునే ఉంది. వీర మరణం పొందిన యోధుల గాధ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. నాటి యుద్ధ పర్యవసానాలు, రాజుల అకాల మరణాలతో రాజవంశానికి చెందిన మహిళల ఆత్మబలిదానాలు ఇప్పటికీ కళ్లెదుటే సాక్షాత్కరిస్తుంటాయి.

ఇవి కూడా చదవండి

Reporter: Koteswara Rao

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..