AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్.. తరలివస్తున్న జాతీయ నేతలు..

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించిన కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి డేట్‌ ఫిక్స్ అయింది. ఈ వేడుకకు జాతీయ నేతలను ఆహ్వానిస్తున్నారు.

Telangana: తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్.. తరలివస్తున్న జాతీయ నేతలు..
Telangana New Secretariat
Sanjay Kasula
|

Updated on: Jan 24, 2023 | 1:22 PM

Share

తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ వేడుకకు జాతీయ నేతలను ఆహ్వానిస్తున్నారు. ఫిబ్రవరి 17న ఉ.11:30కి సచివాలయం ప్రారంభోత్సవ తేదీని ఖరారు చేశారు. ఆ రోజు మొదట వాస్తుపూజ, చండీయాగం, సుదర్శనయాగం ఉంటుందని తెలిపారు. ప్రారంభోత్సవానికి పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో హాజరుకానున్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, జార్ఖండ్‌ సీఎం సొరేన్ పాల్గొంటున్నారు. హాజరుకానున్న అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ కూడా స్పెషల్ గెస్ట్‌గా హాజరవుతున్నారు.

డా.బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగనుంది. వేదపండితులు సూచించిన ముహూర్తం మేరకు ఫిబ్రవరి 17 వ తేదీ శుక్రవారం ఉదయం 11.30 నుంచి 12.30 గం.ల నడుమ నిర్వహించనున్నట్టు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ తెలిపింది.

ప్రారంభోత్సవానికి ముందు, ఉదయం.. వేద పండితుల ఆధ్వర్యంలో వాస్తు పూజ, చండీ యాగం, సుదర్శన యాగం తదితర పూజాకార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ప్రారంభోత్సవ  కార్యక్రమంలో… తమిళనాడు ముఖ్యమంత్రి డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, ఝార్కండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వినీ యాదవ్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తరఫున ఆయన ప్రతినిధిగా జెడియు జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్, డా. బిఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ తదితర ముఖ్యులు పాల్గొంటారు.

సచివాలయ ప్రారంభోత్సవం తర్వాత.. మధ్యాహ్నం, సికింద్రాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ జరుగుతుంది. ఈ బహిరంగ సభలో సచివాలయ ప్రారంభోత్సవం లో పాల్గొన్న పైన పేర్కొన్న ముఖ్య అతిథులందరూ పాల్గొంటారు.

రూ.617 కోట్లతో సచివాలయ భవనాన్ని గ్రీన్‌ బిల్డింగ్‌ కాన్సెప్ట్‌ పద్ధతిలో నిర్మించారు. భవనంలోకి సహజమైన గాలి, వెలుతురు వచ్చేలా ప్లాన్‌ చేశారు. కొత్త సచివాలయానికి ఇప్పటికే డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ పేరుని ఖరారు చేశారు. సచివాలయం లోపలే టెంపుల్‌, మజీద్‌ కూడా నిర్మిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం