Telangana: ఈ నియోజకవర్గ నాయకుల్లో మొదలైన కౌంటింగ్ టెన్షన్..
స్వల్ప విరామం తర్వాత పాలమూరు పాలిటిక్స్ మళ్లీ హిటెక్కుతున్నాయి. మొన్నటి వరకు పార్లమెంట్ ఎన్నికల హీట్ కొనసాగగా పోలింగ్ అనంతరం లీడర్ల అంతా రిలాక్స్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. ఇక కౌంటింగ్‌కు సమయం దగ్గర పడుతుండడంతో మరోమారు నేతల్లో అలజడి మొదలైంది. ఎంపీ ఎన్నికల ఫలితాల కంటే ముందు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఫలితం రానుండడంతో అన్ని పార్టీలు అలెర్ట్ అయ్యాయి.

స్వల్ప విరామం తర్వాత పాలమూరు పాలిటిక్స్ మళ్లీ హిటెక్కుతున్నాయి. మొన్నటి వరకు పార్లమెంట్ ఎన్నికల హీట్ కొనసాగగా పోలింగ్ అనంతరం లీడర్ల అంతా రిలాక్స్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. ఇక కౌంటింగ్‌కు సమయం దగ్గర పడుతుండడంతో మరోమారు నేతల్లో అలజడి మొదలైంది. ఎంపీ ఎన్నికల ఫలితాల కంటే ముందు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఫలితం రానుండడంతో అన్ని పార్టీలు అలెర్ట్ అయ్యాయి.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, అనంతరం ఒక్కరోజు తేడాతో ఎంపీ ఎన్నికల కౌంటింగ్ కౌంట్ డౌన్ మొదలైంది. వరుస ఎన్నికలతో బీజీబీజీగా గడుపుతున్న నేతలకు పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ తర్వాత స్వల్ప విరామం దొరికింది. దీంతో కొద్ది రోజులు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నేతలు రెస్ట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. ఇక కౌంటింగ్‌కు సమయం అసన్నం కావడంతో తిరిగి యాక్టివ్ మోడ్‌లోకి వస్తున్నారు. జూన్ 2వ తేదీన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు, జూన్ 4వ తేదీన ఎంపీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పార్లమెంట్ ఎన్నికలకు ముందు జరిగినప్పటికీ ఓట్ల లెక్కింపు ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. అప్పటికే పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఫలితాల ప్రభావం ఎంపీ ఎన్నికలపై ఉంటుందన్న ఉద్దేశ్యంతో లెక్కింపును జూన్ 2వ తేదీకి వాయిదా వేశారు. ఈ ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో మెజారీటీ సభ్యులున్న బీఆర్ఎస్ సైతం అదే స్థాయిలో సిట్టింగ్ సీటును కాపాడుకోవాలని పనిచేసింది. దీంతో రెండు పార్టీలకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఫలితం కీలకం కానుంది.
పాలమూరు పార్లమెంట్ ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ..
ఇక పార్లమెంట్ ఎన్నికల విషయంలోనూ ఉమ్మడి పాలమూరు జిల్లా రాష్ట్రంలోనే ప్రత్యేక దృష్టిని ఆకర్షించింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గం కొడంగల్ మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో ఉండటమే దీనికి ప్రధాన కారణం. అందరి కళ్లు జూన్ 4వ తేదీన జరిగే కౌంటింగ్‌పై పడింది. సీఎం రేవంత్ రెడ్డి సైతం సుమారు 8సార్లు పాలమూరు పర్యటనకు రావడంతో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా చల్లా వంశీచంద్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా డీకే అరుణ, బీఆర్ఎస్ అభ్యర్థిగా మన్నే శ్రీనివాస్ రెడ్డి బరిలో నిలిచారు. అయినప్పటికీ రేవంత్ రెడ్డి మాత్రమే ప్రధానంగా ఈ ఎన్నికలో ఫోకస్ అయ్యారు. ఇక పోలింగ్ సరళిపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విజయంపై ధీమాగా ఉన్నా.. కౌంటింగ్ రోజున ఫలితం ఎవరికి అనుకూలంగా వస్తుందోనన్న ఆందోళనలో ఉన్నారు నేతలు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




