September 17th: తగ్గేదేలే.. కాంగ్రెస్ vs బీజేపీ.. సెప్టెంబర్ 17పై రాజకీయ రచ్చ..
విలీనమా..? విమోచనమా.. వీటన్నింటి మధ్య సెప్టెంబర్ 17పై రాజకీయ రచ్చ కొనసాగుతోంది. ఇది కచ్చితంగా తెలంగాణ విమోచన దినోత్సవమే అని బీజేపీ.. దీన్ని ప్రజాపాలన దినోత్సవంగా జరుపుతామని కాంగ్రెస్.. ఇలా సెప్టెంబర్ 17పై కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
విలీనమా..? విమోచనమా.. వీటన్నింటి మధ్య సెప్టెంబర్ 17పై రాజకీయ రచ్చ కొనసాగుతోంది. ఇది కచ్చితంగా తెలంగాణ విమోచన దినోత్సవమే అని బీజేపీ.. దీన్ని ప్రజాపాలన దినోత్సవంగా జరుపుతామని కాంగ్రెస్.. ఇలా సెప్టెంబర్ 17పై కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సెప్టెంబర్ 17న వేడుకలు జరిపేందుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్, బీజేపీ.. ఈ అంశంపై పొలిటికల్ ఫైట్‌ను కొనసాగిస్తున్నాయి. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని బీజేపీ పట్టుబడుతుండగా.. ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశంలో ఇరుపార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు.
సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించడాన్ని తాము అంగీకరించబోమన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. తెలంగాణ విమోచన దినోత్సవంగానే జరపాలని డిమాండ్ చేశారు. మజ్లిస్‌కు భయపడే కాంగ్రెస్ ఇలా చేస్తోందంటూ బండి సంజయ్ ఆరోపించారు.
అయితే హైదరాబాద్ స్టేట్‌ను దేశంలో విలీనం చేసిన రోజు రాజుల పాలన పోయి ప్రజా పరిపాలన మొదలైందన్నారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. అందుకే సెప్టెంబర్ 17న ప్రజా పాలన దినోత్సవం జరపాలని నిర్ణయించామన్నారు. దేశంలో హైదరాబాద్ స్టేట్ విలీనంలో బీజేపీ పాత్ర లేదంటూ మల్లు రవి కౌంటర్ ఇచ్చారు.
పరేడ్ గ్రౌండ్స్‌లో వేడుకలు.. జెండా ఎగరేయనున్న అమిత్ షా
ఇక సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహిస్తామన్న బీజేపీ.. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఎగరేయనున్నారు.
ప్రజాపాలన దినోత్సవం..
మరోవైపు తెలంగాణవ్యాప్తంగా ప్రజాపాలన దినోత్సవంగా జరపాలని నిర్ణయించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇందుకోసం ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండా ఎగరవేయనున్నారు. జిల్లాల్లో జెండా ఎగరేసే బాధ్యతలను మంత్రులు, జెడ్పీ చైర్మన్లకు అప్పగించారు. అయితే ఈసారి సెప్టెంబర్ 17పై జరుగుతున్న రాజకీయ రచ్చకు బీఆర్ఎస్ కాస్త దూరంగా ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి