బీఆర్ఎస్‎పై మంత్రి సీతక్క ఫైర్.. కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు..

మంచిర్యాల‌ జిల్లాలో మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క పర్యటించారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అధ్యక్షతన పెద్దపల్లి పార్లమెంట్ ముఖ్య కార్యకర్తల‌ సమావేశంలో పాల్గొన్న మంత్రులు బీఆర్ఎస్, బీజేపీల‎పై నిప్పులు చెరిగారు.

బీఆర్ఎస్‎పై మంత్రి సీతక్క ఫైర్.. కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు..
Congress Meeting
Follow us

| Edited By: Srikar T

Updated on: Apr 07, 2024 | 7:59 PM

మంచిర్యాల‌ జిల్లాలో మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క పర్యటించారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అధ్యక్షతన పెద్దపల్లి పార్లమెంట్ ముఖ్య కార్యకర్తల‌ సమావేశంలో పాల్గొన్న మంత్రులు బీఆర్ఎస్, బీజేపీల‎పై నిప్పులు చెరిగారు. పదేళ్లు రైతులను నట్టెట్ట ముంచిన‌ బీఆర్ఎస్, బీజేపీలు మొసలి కన్నీరు కారుస్తూ రైతు దీక్షలంటూ కొత్త డ్రామాలకు తెరలేపారంటూ మంత్రి సీతక్క ఆరోపించారు. కరువు తెచ్చిందే బీఆర్ఎస్ అని.. ప్రాజెక్ట్‎లు పేరుతో రాష్ట్ర ప్రజలను ఇన్నాళ్లు నమ్మించారని.. తీరా ప్రభుత్వం‌ మారగానే అసలు నిజాలు ప్రకృతే కళ్లకు కట్టినట్టు చూపిందని సీతక్క ఆరోపించారు. హామీలు అమలు చేయడం లేదని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయని.. పార్లమెంట్ ఎన్నికల కోడ్ ముగియగానే అన్ని హామీలు పక్కాగా అమలు చేస్తామని మంత్రి‌ శ్రీధర్ బాబు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత జోష్‎తో పని చేశారో అంతకు మించిన జోష్‎తో పని చేసి పార్లమెంట్ ఎన్నికల్లో భారీ విజయాన్ని కట్టబెట్టాలని కార్యకర్తలను కోరారు. పెద్దపల్లి పార్లమెంట్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‎సాగర్ రావు, చెన్నూర్ ఎమ్మెల్యే వినోద్, వివేక్, ఎంపి అభ్యర్థి వంశీకృష్ణ పాల్గొన్నారు.

పార్లమెంట్ ఎన్నికలలో అభ్యర్థులను చూసి ఓటు వేయండని.. పెద్దపల్లిలో యువకుడు వంశీని ముందుంచామని.. యువతకు పట్టం కట్టాలని మంత్రి శ్రీధర్ బాబు కోరారు. కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన ప్రతీ మాటను నిలబెట్టుకుంటుందని పేర్కొన్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నామని.. ఎన్నికల కోడ్ వల్ల ఆటంకం కలిగిందని తెలిపారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో బంగారు తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చారని ఆరోపించారు. గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను దారిలో పెడుతున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. 2 వందల యూనిట్ల ఫ్రీ కరెంట్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామన్నారు. ఇవి బీఆర్ఎస్ పార్టీ వాళ్లు సైతం పొందుతున్నారన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో ఆర్థిక వ్యవస్థను ఆగం చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంపై 7 లక్షల కోట్ల అప్పుల భారం మోపారని మంత్రి తెలిపారు.

బీఆర్ఎస్ ఇన్నాళ్లు రైతులను లూటీ చేసిందని.. రైతు‌దీక్షలంటే ఇప్పుడు దొంగ నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు మంత్రి సీతక్క. రాహుల్ గాంధీ పీఎం అయితేనే మన కష్టాలు పోతాయని.. దేశ అభివృద్దికి యువ నాయకత్వం కావాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి అభ్యర్థిగా వంశీని గెలిపించండని కోరారు మంత్రి సీతక్క‌. రాష్ట్రాన్ని కేసీఆర్.. దేశాన్ని మోడీ లూటీ చేశారని ఆరోపించారు సీతక్క. ఉమ్మడి ఆదిలాబాద్‎లో విమానాశ్రయం, సీసీఐ పునరద్దరిస్తామంటూ ఇదే మోడీ ప్రభుత్వం హామీ ఇచ్చిందని.. సింగరేణిని ప్రైవేటీకరణ చేసి ఈ ప్రాంతాన్ని నిండా ముంచిన చరిత్ర బీజేపీదేనని దుయ్యబట్టారు సీతక్క. ఆదివాసీ ప్రాంతాల్లోని ఖనిజ సంపదను అదానీ, అంబానీలకు కట్టబెడుతూ ఆదివాసీల పొట్టకొట్టిన చరిత్ర బీజేపీదేనని అన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులు వాళ్ల దోస్తులకు కట్టబెట్టేందుకే మోడీ ప్రభుత్వం పాలన చేస్తుందని ఆరోపించారు‌ సీతక్క. ఇటు రాష్ట్రంలో అధికారం పోగానే కేసీఆర్ రైతుల క్షేమమంటూ బయలుదేరారని.. రైతులకు క్షామాన్ని మిగిల్చిందే కేసీఆర్ అని తెలిపారు సీతక్క. ఫోన్ ట్యాపింగ్‎లు, లిక్కర్ స్కాం కేసులను డైవర్ట్ చేయడానికే ఈ దొంగ రైతు‌దీక్షల రాజకీయమంటూ కేసీఆర్, బీఆర్ఎస్ దీక్షలపై భగ్గుమన్నారు సీతక్క. కేసీఆర్ ట్రాప్‎లో పడినా.. పరివార్ పరివార్ అంటున్న మోడీ ట్రాప్‎లో పడినా నిండా మునుగుతాం జాగ్రత్తా అంటూ ప్రజలను హెచ్చరించారు. ప్రజలు కాంగ్రెస్‎ను ఆశీర్వదించి రాష్ట్రంలో ప్రభుత్వాన్నిచ్చారని.. కేంద్రంలోను అదే తీరున ఆశీర్వదించాలని కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

భార్యకు సూపర్ విషెస్‌ చెప్పిన రాక్ స్టార్ మంచు మనోజ్.!
భార్యకు సూపర్ విషెస్‌ చెప్పిన రాక్ స్టార్ మంచు మనోజ్.!
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.
బాబోయ్‌.. విమానం ల్యాండ్ అవుతుండగా చెలరేగిన మంటలు.. వీడియో వైరల్
బాబోయ్‌.. విమానం ల్యాండ్ అవుతుండగా చెలరేగిన మంటలు.. వీడియో వైరల్
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!