Telangana: మండే ఎండల్లో బుల్లెట్ బైక్ ఎక్కిన మంత్రి.. ఏం చేశాడంటే..
ఆయనో రాష్ట్ర మంత్రి. ప్రస్తుత రాజకీయాల్లో ఆ మంత్రి ఏం చేసినా.. సెన్సేషనే. నిత్యం హాట్ కామెంట్స్ చేస్తూ రాజకీయాలను మరింత వేడెక్కిస్తుంటారు. ఆయన రూటే సపరేటు. ప్రతిరోజు జనంతో మమేకమయ్యే ఆ మంత్రి.. గన్ మెన్లు, కాన్వాయ్‌ని వదిలేసి మండుతున్న ఎండను లెక్క చేయకుండా ఏం చేశాడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

ప్రచండ భానుడి ప్రతాపంతో జనం అల్లాడుతున్నారు. రాష్ట్రంలోని అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో44 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఎండలు మండుతున్నాయి. మండుతున్న ఎండలను సైతం లెక్కచేయకుండా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బుల్లెట్‌పై చక్కర్లు కొట్టారు. సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం అడివెంలలో ముత్యాలమ్మ గుడి ప్రతిష్టాపన కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి పాల్గొన్నారు. ఇందుకోసం అర్వపల్లి మండల కేంద్రం నుంచి 28 కిలోమీటర్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా బుల్లెట్ నడుపుతూ స్థానికులను పలకరిస్తూ, కార్యకర్తలతో కలసి అడివెంల గ్రామానికి చేరుకున్నారు.
కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీగా వెళ్తున్న మంత్రి బుల్లెట్‌పై వెనుక భువనగిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి కూర్చొని కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. దీంతో కార్యకర్తలు జోష్‌లో మునిగి తేలారు. గన్ మెన్లు, కాన్వాయ్‌ని వదిలేసి బుల్లెట్‌పై రోడ్డు వెంట మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సందడి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి అడివెంల గ్రామస్తులకు వివరించారు. పథకాలు తీసుకున్న లబ్ధిదారులు కాంగ్రెస్ పాలన గురించి మంత్రి కోమటిరెడ్డికి తెలియజేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని ఆయన కోరారు. ఇలా ప్రజల్లో ప్రచారం చేసుకుంటూ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…