Watch Video: విఐపి ఇఫ్తార్ విందులో చోరీ.. నిందితుని జేబులో చెక్ చేయగా..
పెద్దపెద్ద విఐపీలు పాల్గొనే ఇఫ్తార్ విందులో చోరీ జరిగింది. ఈ విందులో దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ శివరాం పల్లి ఎస్ఎంసి కన్వెన్షన్లో ఇఫ్తార్ విందు నిర్వహించారు.
పెద్దపెద్ద విఐపీలు పాల్గొనే ఇఫ్తార్ విందులో చోరీ జరిగింది. ఈ విందులో దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ శివరాం పల్లి ఎస్ఎంసి కన్వెన్షన్లో ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్లే ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈయనతోపాటు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, మైనారిటీ బోర్డు చైర్మన్ పైముద్దీన్, వర్క్ బోర్డ్ చైర్మన్లతోపాటు పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
విఐపి సెక్షన్లోని ఇఫ్తార్ డైనింగ్ హాలులో ఒక గుర్తు తెలియని వ్యక్తి చోరీకి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న కార్యకర్తలు నాయకులు నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పచెప్పారు. చోరీకి పాల్పడిన నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని జేబులో చెక్ చేశారు. ఒక మొబైల్ కనిపించడంతో వెంటనే తిరిగి ఇచ్చేశాడు. అలాగే తనిఖీ చేసే క్రమంలో అతని వద్ద రూ.50 వేల నుండి లక్ష రూపాయల వరకు నగదు ఉండడాన్ని గుర్తించారు పోలీసులు. దీంతో అతనిపై వెంటనే అత్తాపూర్ పోలీసులకు సమాచారం అందజేశారు సెక్యూరిటీ సిబ్బంది. ఫంక్షన్ హాలుకు చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

