Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: 17 ఏళ్ల తర్వాత తెలంగాణ వాసికి దుబాయ్ జైలు నుంచి విముక్తి..

17 ఏళ్ల క్రితం కరీంనగర్ జిల్లాకు చెందిన శివరాత్రి రవి, మల్లేశం, నాంపల్లి, హనుమాన్లు, లక్ష్మణ్ లకు ఒక హత్య కేసులో దుబాయ్ కోర్టు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. వీరి విడుదల కొసం రాష్ట్ర ప్రభుత్వం సుదీర్ఘకాలంగా ప్రయత్నాలు చేసింది . ఈ నేరంలో ప్రాణాలు కోల్పోయిన నేపాల్‎కు చెందిన బహుదూర్ సింగ్ అనే బాధిత కుటుంబానికి మంత్రి కేటీఆర్ స్వయంగా వెళ్లి షరియా చట్టం ప్రకారం15 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని దియ్యా సొమ్ము (బ్లడ్ మనీ) అందించారు.

Telangana: 17 ఏళ్ల తర్వాత తెలంగాణ వాసికి దుబాయ్ జైలు నుంచి విముక్తి..
Laxman
Follow us
G Sampath Kumar

| Edited By: Aravind B

Updated on: Oct 07, 2023 | 7:48 PM

రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన శివరాత్రి రవి, మల్లేశం, నాంపల్లి, హనుమాన్లు, లక్ష్మణ్ లకు 17 ఏళ్ల క్రితం ఒక హత్య కేసులో దుబాయ్ కోర్టు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. వీరి విడుదల కొసం రాష్ట్ర ప్రభుత్వం సుదీర్ఘకాలంగా ప్రయత్నాలు చేసింది . ఈ నేరంలో ప్రాణాలు కోల్పోయిన నేపాల్‎కు చెందిన బహుదూర్ సింగ్ అనే బాధిత కుటుంబానికి మంత్రి కేటీఆర్ స్వయంగా వెళ్లి షరియా చట్టం ప్రకారం15 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని దియ్యా సొమ్ము (బ్లడ్ మనీ) అందించారు. ఆ తరువాత ఆ కుటుంబం క్షమాభిక్ష పత్రాన్ని దుబాయ్ ప్రభుత్వానికి సమర్పించి క్షమాభిక్ష కూడా కోరారు. అయితే కొన్ని కారణాలతో నేర తీవ్రతను దృష్టిలో ఉంచుకొని దుబాయ్ ప్రభుత్వం క్షమాభిక్షను ప్రస్తావించలేదు. గత నెలలో మంత్రి కేటీఆర్ దుబాయ్ పర్యటనలో కరీంనగర్ జిల్లాకు చెందిన ఖైదీల విడుదల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసి, విడుదల అంశాన్ని దుబాయ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

రాజ కుటుంబానికి అత్యంత దగ్గర ఉన్న పలువురు వ్యాపారవేత్తలతో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించి, మానవ దృక్పథంతో తెలంగాణ ఎన్నారైల క్షమాభిక్ష కోసం సహకరించాలని కోరారు. దాంతో మంత్రి కేటీఆర్ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించి దుబాయ్ ప్రభుత్వంతో ఈ విషయాన్ని స్థానిక చట్టాల మేరకు చర్చించేందుకు పంపిస్తామని మంత్రి కేటీఆర్‎కు హామీ ఇచ్చారు. ఈ క్రమంలో జిల్లాలోని కోనరావుపేట మండలానికి చెందిన దండుగుల లక్ష్మణ్ కు దుబాయ్ కోర్టు క్షమాభిక్ష పెట్టింది. కాగా శుక్రవారం తెల్లవారు జామున హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకొని మధ్యాహ్నం తన స్వగ్రామానికి చేరుకున్నాడు.17 సంవత్సరాల తరువాత లక్ష్మణ్ కుటుంబ సభ్యులను కలుసుకొని, కుటుంబ సభ్యులతో కలిసి సిరిసిల్ల బస్టాండ్ లో తనకు కావలసిన బట్టలు, ఇతర సామాగ్రి కోసం షాపింగ్ చేశాడు. చాలా రోజులు జైలు జీవితం గడిపి బయటకు రావడంతో లక్ష్మణ్ మానసికంగా బాగాలేడని తన అన్న రాజు తెలిపారు. తమ్ముడు విడుదలకు సహకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‎కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే మిగతా వారి విడుదల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేయాలని బాధిత కుటుంబాలు, జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

దేశంలో క్రిప్టో నిబంధనలు..2025లో పెట్టుబడిదారులు తెలుసుకోవలసినవి!
దేశంలో క్రిప్టో నిబంధనలు..2025లో పెట్టుబడిదారులు తెలుసుకోవలసినవి!
అప్పుడు తెలుగులో తోపు హీరోయిన్.. ఇప్పుడు ఐపీఎల్‏లో కోట్లు..
అప్పుడు తెలుగులో తోపు హీరోయిన్.. ఇప్పుడు ఐపీఎల్‏లో కోట్లు..
ఆర్బీఐ ఎంపీసీ సమావేశంలో కీలక నిర్ణయం.. కోట్లాది మందికి ఉపశమనం!
ఆర్బీఐ ఎంపీసీ సమావేశంలో కీలక నిర్ణయం.. కోట్లాది మందికి ఉపశమనం!
అక్కాచెల్లెళ్లతో పెళ్లి.. వరుడి కొంపముంచిన పెళ్లి కార్డు..
అక్కాచెల్లెళ్లతో పెళ్లి.. వరుడి కొంపముంచిన పెళ్లి కార్డు..
మహేశ్వరయ్య అంటే మామూలోడనుకొంటిరా..అంతకు మించి!
మహేశ్వరయ్య అంటే మామూలోడనుకొంటిరా..అంతకు మించి!
వెంటాడుతున్న ట్రంప్‌ సుంకాల భయాలు.. నష్టాల్లో స్టాక్‌ మార్కెట్స్‌
వెంటాడుతున్న ట్రంప్‌ సుంకాల భయాలు.. నష్టాల్లో స్టాక్‌ మార్కెట్స్‌
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కరిగిపోవాలంటే తప్పక తినాల్సిన ఆహారాలు.!
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కరిగిపోవాలంటే తప్పక తినాల్సిన ఆహారాలు.!
తెలుగు కమెడియన్ ఇంట్లో విషాదం..
తెలుగు కమెడియన్ ఇంట్లో విషాదం..
ఈ పండు ప్రత్యేకతలేంటో తెలుసా.?లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు
ఈ పండు ప్రత్యేకతలేంటో తెలుసా.?లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు
వైసీపీ అధినేత జగన్‌ సెక్యూరిటీపై రాజుకున్న రచ్చ..
వైసీపీ అధినేత జగన్‌ సెక్యూరిటీపై రాజుకున్న రచ్చ..