AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అన్న కోసం 130 కిలోమీటర్లు.. ఈ తమ్ముడు చేసిన పనికి అంతా ఫిదా అవ్వాల్సిందే..

ఆస్తి తగాదాలతో బంధాలు తెగిపోతున్న ఈ రోజుల్లో అన్న గెలుపు కోసం తమ్ముడు వెంకటేష్ ఏకంగా 130 కి.మీ పాదయాత్ర చేశాడు. సదాశివపేట నుండి కొమురవెల్లి మల్లన్న క్షేత్రానికి నడిచి, అన్న శ్రీనివాస్ సర్పంచ్ ఎన్నికలో గెలవాలని మొక్కిన మొక్కును తీర్చుకున్నాడు.

Telangana: అన్న కోసం 130 కిలోమీటర్లు.. ఈ తమ్ముడు చేసిన పనికి అంతా ఫిదా అవ్వాల్సిందే..
Brother Completes 130 Km Padayatra
P Shivteja
| Edited By: |

Updated on: Dec 24, 2025 | 5:55 PM

Share

ప్రస్తుత కాలంలో ఆస్తిపాస్తులు, చిన్న చిన్న గొడవలతో తోడబుట్టిన అన్నదమ్ములే శత్రువులుగా మారుతున్న రోజులివి. కానీ ఆ రక్త సంబంధం గొప్పతనాన్ని చాటిచెప్పాడు ఓ తమ్ముడు. తన అన్న సర్పంచ్‌గా గెలవాలని మొక్కుకుని ఆ మొక్కు తీర్చుకోవడానికి ఏకంగా 130 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఒగ్గు శ్రీనివాస్, ఒగ్గు వెంకటేష్లు ఇద్దరు అన్నదమ్ములు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అన్న శ్రీనివాస్ సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అన్న గెలుపును తన గెలుపుగా భావించిన తమ్ముడు వెంకటేష్.. తన అన్న ఎలాగైనా విజయం సాధించాలని ఆ కొమురవెల్లి మల్లన్నను వేడుకున్నాడు.

మొక్కే కదా అని వదిలేయలేదు..

“అన్న గెలిస్తే నీ దగ్గరికి నడుచుకుంటూ వస్తాను స్వామీ” అని వెంకటేష్ మొక్కుకున్నాడు. ఎన్నికల ఫలితాల్లో అన్న శ్రీనివాస్ ఘన విజయం సాధించడంతో ఆ తమ్ముడి ఆనందానికి అవధులు లేవు. అన్న విజయం సాధించిన వెంటనే, తన మొక్కును తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. సదాశివపేట నుంచి కొమురవెల్లి మల్లన్న క్షేత్రం వరకు సుమారు 130 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఎండను సైతం లెక్కచేయకుండా తన అన్న మీద ఉన్న ప్రేమతో వెంకటేష్ పాదయాత్ర ప్రారంభించాడు. అలుపెరగని ఉత్సాహంతో నడుస్తూ కొమురవెల్లి చేరుకున్నాడు. అక్కడ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నాడు. అన్న గెలుపు కోసం ఇంత కష్టపడిన తమ్ముడిని చూసి వెంకటాపూర్ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కాలంలో ఇలాంటి తమ్ముడు దొరకడం అన్న అదృష్టం అని కొనియాడుతున్నారు.

వీడియో చూడండి..

అన్న కోసం 130 కిలోమీటర్లు.. ఈ తమ్ముడు చేసిన పనికి అంతా ఫిదా..
అన్న కోసం 130 కిలోమీటర్లు.. ఈ తమ్ముడు చేసిన పనికి అంతా ఫిదా..
విజయవాడ GGH 'ఆకలి రాజ్యం'లో ఎలుకల స్వైర విహారం.. వీడియో
విజయవాడ GGH 'ఆకలి రాజ్యం'లో ఎలుకల స్వైర విహారం.. వీడియో
గత పదేళ్లలో ప్రఖ్యాత IITల్లో భారీగా బీటెక్‌ సీట్ల కోత.. కారణం ఇదే
గత పదేళ్లలో ప్రఖ్యాత IITల్లో భారీగా బీటెక్‌ సీట్ల కోత.. కారణం ఇదే
ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే.. అసలేం..
ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే.. అసలేం..
క్రిస్మస్ ఈ టేస్టీ డెజర్ట్స్ ట్రై చేస్తే ఫిదా అవ్వాల్సిందే!
క్రిస్మస్ ఈ టేస్టీ డెజర్ట్స్ ట్రై చేస్తే ఫిదా అవ్వాల్సిందే!
33 బంతుల్లో సెంచరీ.. కావ్యపాప పాకెట్ డైనమైట్ బీభత్సం
33 బంతుల్లో సెంచరీ.. కావ్యపాప పాకెట్ డైనమైట్ బీభత్సం
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు..
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు..
ఎవర్రా రోకో అన్నారు.. సెంచరీలతో గంభీర్‌కు దిమ్మతిరిగే షాక్
ఎవర్రా రోకో అన్నారు.. సెంచరీలతో గంభీర్‌కు దిమ్మతిరిగే షాక్
తెలంగాణ శకుంతల మరాఠి మహిళ అంటే మీరు నమ్ముతారా..?
తెలంగాణ శకుంతల మరాఠి మహిళ అంటే మీరు నమ్ముతారా..?
వృద్ధురాలికి ఇచ్చిన మాట నిబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌
వృద్ధురాలికి ఇచ్చిన మాట నిబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌