Weekend Hour: కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టబోతున్నారా? ఎవరు డకౌట్.. ఎవరు హిట్..!
Weekend Hour With Murali Krishna : తెలంగాణలో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలవుతోంది. ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ వచ్చే ఛాన్స్ ఉండటంతో పార్టీలన్నీ బలం, బలగాలతో సిద్ధమయ్యాయి. అధికారం నిలబెట్టుకోవడానికి బీఆర్ఎస్ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీ చావారేవో అంటూ కదనరంగంలో దిగుతోంది. విజయమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం కూడా రంగంలో దిగింది.
Weekend Hour With Murali Krishna : తెలంగాణలో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలవుతోంది. ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ వచ్చే ఛాన్స్ ఉండటంతో పార్టీలన్నీ బలం, బలగాలతో సిద్ధమయ్యాయి. అధికారం నిలబెట్టుకోవడానికి బీఆర్ఎస్ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీ చావారేవో అంటూ కదనరంగంలో దిగుతోంది. విజయమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం కూడా రంగంలో దిగింది.
- హ్యాట్రిక్ ఖాయమంటోంది బీఆర్ఎస్..
- కాంగ్రెస్ వేవ్ బలంగా ఉందంటున్నారు హస్తం నేతలు..
- హంగ్‌తో అయినా అధికారం తమదేనంటోంది బీజేపీ..
తెలంగాణలో ఎన్నికల యుద్ధం అధికారికం కానుంది. ఇప్పటికే రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ను విడుదల చేయటానికి రంగం సిద్ధం చేస్తోంది. ఇక ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉండటంతో పార్టీలు కూడా దూకుడు ప్రదర్శిస్తున్నాయి. ప్రచారంలోనూ నేతలు గేరు మార్చి స్పీడు పెంచుతున్నారు. అటు పథకాలు… ఇటు ప్రచారంలో దూకుడుగా వెళుతోంది అధికారపార్టీ. అక్టోబర్16 నుంచి కేసీఆర్ ప్రచారక్షేత్రంలో దిగుతుండగా ఇప్పటికే మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్‌లు సుడిగాలి పర్యటనలతో స్పీడు పెంచారు. పబ్లిక్ మీటింగుల్లో ప్రత్యర్ధులపై విమర్శలతో విరుచుకుపడుతున్నాయి. పదేళ్ల ప్రస్థానం తెలియజేస్తూ, పథకాలను గుర్తుచేస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. కాంగ్రెస్ రనౌట్ కాగా.. బీజేపీ డకౌట్ అవుతుందని ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ సెంచురీ ఖాయమంటున్నారు మంత్రులు.
తెలంగాణలో కాంగ్రెస్ గాలి బలంగా వీస్తుందని.. సర్వేలన్నీ తమకు అనుకూలంగా ఉన్నాయంటున్నారు ఆ పార్టీ నేతలు. అటు ప్రచారం కంటే కూడా కాంగ్రెస్ టికెట్లపై ఫోకస్ పెట్టింది. సామాజికసమీకరణాల్లో భాగంగా ఆయ వర్గాల ఓట్లు ఆకట్టుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.
అటు బీజేపీ జాతీయనాయకత్వం తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. అగ్రనేతలు రంగంలో దిగి మరీ కేడర్‌కు దిశానిర్దేశం చేస్తున్నారు. కర్నాటక పరాజయం తర్వాత ప్రతిష్టాత్మకంగా మారిన తెలంగానలో విజయమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. 14 కమిటీలు వేసి మరీ సీనియర్లకు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే మోదీ, నడ్డా, అమిత్‌షా రాష్ట్రంలో పర్యటించగా… త్వరలో మరిన్ని సభలు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని… బీజేపీ వైపు చూస్తున్నారని ఆ పార్టీ నేతలంటున్నారు.
అక్టోబరు 16వ తేదీన మేనిఫెస్టోతో బీఆర్ఎస్ వస్తోంది. ఆరు గ్యారెంటీ హామీలతో కాంగ్రెస్ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదంతో బీజేపీ జనాల్లోకి వస్తోంది. టాప్ గేర్ లో వస్తున్న పార్టీల్లో హిట్ కొట్టేదెవరు? హిట్ వికెట్ ఎవరు? మధ్యలో రనౌట్ ఎవరు?
వీకెండ్ అవర్ లైవ్ వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..