AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Crime: మరి కొన్ని గంటల్లో పెళ్లి.. శుభలేఖలు పంచడానికి వెళ్లిన వరుడు చెట్టుకు విగతజీవిగా వేలాడుతూ.. ఏం జరిగిందో?

సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రాజేందర్ (29) చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్ది రోజుల క్రితం రాంపూర్ గ్రామానికి చెందిన ఓ యువతితో పెళ్లి కూడా నిశ్చయం అయ్యింది. పెళ్లి కార్డులు బంధువులకు పంచుతూ ఈనెల 3వ తారీఖున ఇంటి నుంచి బయటకు వెళ్లిన రాజేందర్..

Telangana Crime: మరి కొన్ని గంటల్లో పెళ్లి.. శుభలేఖలు పంచడానికి వెళ్లిన వరుడు చెట్టుకు విగతజీవిగా వేలాడుతూ.. ఏం జరిగిందో?
Man Committed Suicide In Sadashivanagar
Prabhakar M
| Edited By: |

Updated on: Sep 08, 2023 | 11:39 AM

Share

కామారెడ్డి, సెప్టెంబర్ 8: సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రాజేందర్ (29) చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్ది రోజుల క్రితం రాంపూర్ గ్రామానికి చెందిన ఓ యువతితో పెళ్లి కూడా నిశ్చయం అయ్యింది. పెళ్లి కార్డులు బంధువులకు పంచుతూ ఈనెల 3వ తారీఖున ఇంటి నుంచి బయటకు వెళ్లిన రాజేందర్ తిరిగి ఇంటికి రాకపోవడంతో బంధువులు, స్నేహితుల ఇంటి వద్ద ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. నిన్న పెళ్లి జరగాల్సిన రోజే లింగంపేట మండలం ఎల్లారం గేటు సమీపంలో చెట్టుకు ఉరేసుకొని విగత జీవిగా కనిపించాడు. ఆత్మహత్య చేసుకున్న రాజేందర్‌ మృతదేహం బంధువులకు లభ్యం అయ్యింది. దీంతో పెళ్లి ఇంట్లో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న లింగంపేట పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..

పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు పెళ్లి జరగాల్సిన రోజే ఆత్మహత్య చేసుకున్న సంఘటన కామారెడ్డి జిల్లా అడ్లూర్ ఎల్లారెడ్డిలో చోటుచేసుకుంది.ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పోలీసులు, మృతుని కుటుంబ సభ్యుల కథనం ప్రకారం సదాశివనగర్ మండలం అడ్డూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రాజేందర్ రెడ్డి29 అనే యువకునికి రాంపూర్ గ్రామానికి చెందిన ఓ యువతితో ఈ నెల ఏడవ తారీఖున పెళ్లి నిశ్చయమైంది. ఈనెల మూడవ తారీఖున బంధువులకు పెళ్లి పత్రికలు పంచి వస్తానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన రాజేందర్ రెడ్డి తిరిగి ఇంటికి రాకపోవడంతో స్నేహితులు, బంధువులు, చుట్టుపక్కల ఎంత వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు.

నిన్న సాయంత్రం రాజేందర్ రెడ్డి లింగంపేట మండలం ఎల్లారం గేటు సమీపంలో ఓ చెట్టుకు ఉరివేసుకున్న మృతదేహం లభ్యమైంది . దీంతో స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కిందికి దింపారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేయడంతో సంఘటనా స్థలానికి కుటుంబ సభ్యులు, బంధువులు చేరుకొని కన్నీరు మున్నీరు గా విలపించారు. పెళ్లి జరగాల్సిన రోజే మృతి చెందడం పట్ల కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కాగా ఆత్మహత్యకు గత కారణాలు ఇంకా తెలియ రాలేదు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు లింగంపేట పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

కొవ్వు కరగాల్సిందే.. కండరాలు పెంచాల్సిందే.. లేకపోతే మెదడు..
కొవ్వు కరగాల్సిందే.. కండరాలు పెంచాల్సిందే.. లేకపోతే మెదడు..
ఓలా, ఉబర్‌కు పోటీగా ఏపీ ప్రభుత్వం కొత్త యాప్.. తక్కువ ధరకే..
ఓలా, ఉబర్‌కు పోటీగా ఏపీ ప్రభుత్వం కొత్త యాప్.. తక్కువ ధరకే..
భయపెట్టే ఘోర యాక్సిడెంట్.. చూస్తే షాకే
భయపెట్టే ఘోర యాక్సిడెంట్.. చూస్తే షాకే
వరల్డ్ కప్ జట్టు నుంచి గిల్ అవుట్ వెనుక ఉన్న నమ్మలేని నిజాలివే
వరల్డ్ కప్ జట్టు నుంచి గిల్ అవుట్ వెనుక ఉన్న నమ్మలేని నిజాలివే
విన్నర్ అవ్వాల్సినోడు టాప్-3లోనూ లేకుండా..ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్
విన్నర్ అవ్వాల్సినోడు టాప్-3లోనూ లేకుండా..ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్
వామ్మో.. ఒక్క వారంలోనే రూ.16వేలు పెరిగిన వెండి.. అసలు కారణాలు..
వామ్మో.. ఒక్క వారంలోనే రూ.16వేలు పెరిగిన వెండి.. అసలు కారణాలు..
పొలంలోకి వెళ్లి కళ్లు తేలేసిన పోలీసులు.. వీడియో చూశారా
పొలంలోకి వెళ్లి కళ్లు తేలేసిన పోలీసులు.. వీడియో చూశారా
తెలంగాణలో మరో ఎన్నికలు.. త్వరలోనే షెడ్యూల్..!
తెలంగాణలో మరో ఎన్నికలు.. త్వరలోనే షెడ్యూల్..!
శ్రీలంక అమ్మాయిలకు వైజాగ్‎లో చుక్కలు చూపించడం పక్కా భయ్యా
శ్రీలంక అమ్మాయిలకు వైజాగ్‎లో చుక్కలు చూపించడం పక్కా భయ్యా
సిబిల్ స్కోర్ తక్కువుందా.. 500 నుంచి 750కి పెరగాలంటే ఇలా చేస్తే.
సిబిల్ స్కోర్ తక్కువుందా.. 500 నుంచి 750కి పెరగాలంటే ఇలా చేస్తే.