Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: బల్లార్‌పూర్ అటవీ ప్రాంతంలో 2 పులి పిల్లలు మృతి.. మరో పులి పిల్ల ఆరోగ్యం విషమం! కనిపించని తల్లి జాడ

తూర్పు మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా సెంట్రల్ చందా డివిజన్‌లోని బల్లార్‌పూర్ అటవీ రేంజ్ పరిధిలో గురువారం రెండు పులి పిల్లల మృతదేహాలు కలకలం రేపాయి. అదే అటవి‌ప్రాంతంలో పారెస్ట్ గార్డ్ లతో కిలో మీటర్ దూరంలో ఓ పులి‌పిల్ల నీరసించి కనిపించింది. వెంటనే అలర్ట్ అయిన‌ గార్డ్ లు‌ ఉన్నతాదికారులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి‌ దిగిన బల్లార్‌పూర్ అటవీ రేంజ్ అదికారిణి శ్వేత.. తల్లి‌పులి..

Telangana: బల్లార్‌పూర్ అటవీ ప్రాంతంలో 2 పులి పిల్లలు మృతి.. మరో పులి పిల్ల ఆరోగ్యం విషమం! కనిపించని తల్లి జాడ
Two Tiger Cubs Died In Ballarpur Forest
Follow us
Naresh Gollana

| Edited By: Srilakshmi C

Updated on: Sep 08, 2023 | 11:11 AM

బల్లార్‌పూర్, సెప్టెంబర్ 8: అటవీ ప్రాంతంలో రెండు పులి పిల్లలు అనుమానాస్పద రీతిలో మృతి చెందాయి. మరో పులి పిల్ల ఆరోగ్యం విషమంగా ఉంది. ఐతే సమీప ప్రాంతంలో ఎక్కడ తల్లి జాడ కనిపంచకపోవడంతో ఈ విషయం కలకలంగా మారింది.

తూర్పు మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా సెంట్రల్ చందా డివిజన్‌లోని బల్లార్‌పూర్ అటవీ రేంజ్ పరిధిలో గురువారం రెండు పులి పిల్లల మృతదేహాలు కలకలం రేపాయి. అదే అటవి‌ప్రాంతంలో పారెస్ట్ గార్డ్ లతో కిలో మీటర్ దూరంలో ఓ పులి‌పిల్ల నీరసించి కనిపించింది. వెంటనే అలర్ట్ అయిన‌ గార్డ్ లు‌ ఉన్నతాదికారులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి‌ దిగిన బల్లార్‌పూర్ అటవీ రేంజ్ అదికారిణి శ్వేత.. తల్లి‌పులి జాడ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నీరసించిన పులి పిల్లను రెస్క్యూ చేసి సమీపంలో తడోబా ట్రాన్సిట్ ట్రీట్‌మెంట్ సెంటర్‌కు తరలించారు. ఐదు నెలల ‌వయసున్న ఆడపులి‌పిల్లగా గుర్తించిన అదికారులు.. దాని‌ రక్షణ చర్యలు చేపట్టారు. చనిపోయిన రెండు పులి పిల్లల్లో ఒకటి నాలుగు నెలలు , మరొకటి ఐదు‌నెలలు ఉన్నట్టుగా గుర్తించారు. రెండు మగ పులి పిల్లలుగా గుర్తించారు బల్లార్‌పూర్ అటవీ రేంజ్ అదికారులు.

బల్లార్‌పూర్ అటవీ ప్రాంతంలో గురువారం రెండు పులి పిల్లల కళేబరాలు కనిపించగా, మరో పిల్లను రక్షించినట్లు డీఎప్వో శ్వేత వెల్లడించారు. NH-253/B సమీపంలోని కలమన బీట్‌లో రెండు పులి పిల్లల మృతదేహాలు లభ్యమయ్యాయని తెలిపారు‌ అదికారిణి‌ శ్వేత. పులి బహుశా వేటకు వెళ్లి ఉండవచ్చు లేదా అడవిలో తప్పిపోయి ఉండవచ్చు ఆ కారణంగానే ఒంటరైన పులి‌పిల్లలు ఆకలితో అలమటించి చనిపోయి ఉండవచ్చని‌ తెలిపారు. పోస్టుమార్టం నిర్వహించామని తుది నివేదిక‌ వచ్చాక పులి పిల్లలు ఎలా మృతి‌ చెందాయో తెలిసే అవకాశం ఉందన్నారు బలగలార్ పూర్ పారెస్ట్ అదికారులు.

ఇవి కూడా చదవండి

తప్పిపోయిన తల్లి పులిని గుర్తించేందుకు ఐదు బృందాలను రంగంలోకి‌ దింపారు. తల్లి‌పులి కోసం 24 గంటలుగా పారెస్డ్ గార్డ్స్, స్పెషల్ పారెస్ట్ పోర్స్ , టైగర్ ట్రాకర్స్ రంగంలోకి దిగి సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. పాద ముద్రల ఆదారంగా పులిని కనిపెట్టే పనిలో పడ్డారు. ప్రస్తుతం కాపాడిన పులి పిల్ల ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.