Telangana: ఉప్పల్‌ ఫ్లై ఓవర్‌ దుస్థితిపై టీవీ9 వరుస కథనాలు.. స్పందించిన తెలంగాణ సర్కార్..

ఉప్పల్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ దుస్థితిపై టీవీ9 ప్రసారం చేసిన వరుస కథనాలకు తెలంగాణ సర్కార్‌ స్పందించింది. రోడ్డుకు మరమ్మతులు చేసుందుకు ముందుకు రావడమే కాకుండా..

Telangana: ఉప్పల్‌ ఫ్లై ఓవర్‌ దుస్థితిపై టీవీ9 వరుస కథనాలు.. స్పందించిన తెలంగాణ సర్కార్..
Uppal Flyover
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 22, 2023 | 10:08 AM

ఉప్పల్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ దుస్థితిపై టీవీ9 ప్రసారం చేసిన వరుస కథనాలకు తెలంగాణ సర్కార్‌ స్పందించింది. రోడ్డుకు మరమ్మతులు చేసుందుకు ముందుకు రావడమే కాకుండా.. కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. హైదరాబాద్‌ నుంచి వరంగల్‌ వెళ్లాలంటే వాహనదారులు నరకం చూస్తున్నారు. ఉప్పల్‌ రింగ్‌ రోడ్డు నుంచి కొత్తగా నిర్మిస్తున్న ఫైఓవర్‌ నిర్మాణం పూర్తి కాక వాహనదారులు అటు వైపు వెళ్లాలంటేనే జంకుతున్నారు. పైన పనికిరాదు.. కింద నడవరాదు. ప్రయాణానికి అసలే పనికిరాదు అన్నట్లుగా తయారైంది పరిస్థితి. పైన ఫ్లైవోవర్‌, కింద ఆరు లైన్ల రహదారి. ప్లాన్‌లో తప్ప రోడ్డు మీద కనిపించని వైనంతో జనం నరకం చూస్తున్నారు.

ఉప్పల్‌ టు ఘట్‌కేసర్‌.. 8 కిలో మీటర్లు.. ఆరు లైన్ల నిర్మాణం.. సెకండ్‌ లార్జెస్ట్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌లో 500 మీటర్లు పూర్తి చేయడానికి ఐదేళ్లు పట్టింది. రోడ్డు మొత్తం పూర్తి కావాలంటే ఇంకెన్నేళ్లు పడుతుంది. 2018లో ప్రారంభమై 2020 జూన్‌లో పూర్తి కావాల్సి ఉంది. ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది పరిస్థితి.

ప్రయాణికులకు నరకం చూపిస్తున్న.. ఈ ఫ్లైఓవర్‌ పరిస్థితి, వాహనదారుల కష్టాలపై.. టీవీ9 స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. టీవీ9 వరుస కథనాలపై తెలంగాణ సర్కార్‌ స్పందించింది. పనులు త్వరగా పూర్తి చేయమని గతంలోనే నోటీసులు పంపినప్పటికీ.. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టును కాంట్రాక్టర్ సరిగ్గా హ్యాండిల్ చేయడం లేదనే ఆరోపణ వినిపిస్తోంది. అందుకే గాయత్రీ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీపై చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి.

ఇవి కూడా చదవండి

అయితే.. రాష్ట్ర ప్రభుత్వంలో శాఖల మధ్య సమన్వయ లోపం వల్లే.. ఈ ఫ్లైర్‌ ఓవర్‌కు ఈ దుస్థితి వచ్చిందంటున్నారు ఉప్పల్‌ మాజీ ఎమ్మెల్యే. ఇప్పటికైనా.. రాష్ట్రప్రభుత్వం చొరవ తీసుకుని త్వరితగతిన రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు ప్రయాణికులు. మరి ఎప్పుడు పనులు మొదలవుతాయో.. ఎప్పటిలోగా పూర్తవుతాయో చూడాలి మరి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..