5 ఫోర్లు, 9 సిక్సర్లు..189 స్ట్రైక్‌రేట్‌తో 125 రన్స్‌.. 3 రోజుల గ్యాప్‌లో రెండో సెంచరీతో టీమిండియాకు వార్నింగ్‌

స్టీవ్‌ స్మిత్‌.. టెస్టులు, వన్డేలకు తప్ప టీ20 ఫార్మాట్‌కు సరిపోడని ఈ ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌పై ముద్ర ఉంది. అందుకు తగ్గట్లే పొట్టి ఫార్మాట్‌లో పెద్దగా రాణించలేకపోయారు స్మిత్‌. ఆచితూచి ఆడే అతనికి టీ20 ఫార్మాట్‌ సరిపోదని పలువురు మాజీ క్రికెటర్లు కూడా విమర్శలు గుప్పించారు.

5 ఫోర్లు, 9 సిక్సర్లు..189 స్ట్రైక్‌రేట్‌తో 125 రన్స్‌.. 3 రోజుల గ్యాప్‌లో రెండో సెంచరీతో టీమిండియాకు వార్నింగ్‌
Steve Smith
Follow us

|

Updated on: Jan 22, 2023 | 6:18 AM

స్టీవ్‌ స్మిత్‌.. టెస్టులు, వన్డేలకు తప్ప టీ20 ఫార్మాట్‌కు సరిపోడని ఈ ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌పై ముద్ర ఉంది. అందుకు తగ్గట్లే పొట్టి ఫార్మాట్‌లో పెద్దగా రాణించలేకపోయారు స్మిత్‌. ఆచితూచి ఆడే అతనికి టీ20 ఫార్మాట్‌ సరిపోదని పలువురు మాజీ క్రికెటర్లు కూడా విమర్శలు గుప్పించారు. అయితే వీటన్నింటికీ తనదైన శైలిలో సమాధానమిస్తున్నాడు స్టీవ్‌. బిగ్‌బాస్‌ టీ20 లీగ్‌లో సిడ్నీ సిక్సర్స్‌ తరఫను ఆడుతున్న అతను సెంచరీల మీద సెంచరీలు బాదుతున్నాడు. తద్వారా తనను విమర్శించిన వారి నోళ్లు మూయిస్తున్నాడు. బిగ్‌బాస్‌ 12 వ సీజన్‌లో భాగంగా తాజాగా సిడ్నీ థండ‌ర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగాడు స్మిత్‌. మొత్తం 66 బంతుల్లోనే 5 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 125 పరుగులు చేశాడు. ఈ లీగ్‌లో స్మిత్‌కు ఇది మూడో మ్యాచ్ కాగా, అందులో రెండో సెంచరీలు బాదటం విశేషం. గత మ్యాచ్‌లో అడిలైడ్ స్ట్రైకర్‌పై సునామీ ఇన్నింగ్స్ ఆడిన స్మిత్‌ 5 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 56 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. కాగా బిగ్ బాష్ లీగ్ లో గత 11 సీజన్లలో ఒక్క సెంచరీ కూడా చేయలేదు స్మిత్. ఇప్పుడు మాత్రం వరుసగా 2 సెంచరీలు చేసి చెలరేగడం విశేషం. స్మిత్ మెరుపు ఇన్నింగ్స్‌తో సిడ్నీ సిక్సర్స్‌ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 2 వికెట్ల న‌ష్టానికి 187 పరుగులు చేసింది. అనంతరం 188 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన సిడ్నీ థండ‌ర్స్ 62 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. దీంతో సిడ్నీ సిక్సర్స్‌ 125 ప‌రుగుల తేడాతో విజయం సాధించింది.

కాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఫిబ్రవరి 9 నుంచి టీమిండియా – ఆస్ట్రేలియా మధ్య నాలుగు మ్యాచుల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. భారత్‌లో జరిగే ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టుకు స్టీవ్ స్మిత్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఐపీఎల్‌ అనుభవం కూడా ఉంది కాబట్టి భారత్‌ పిచ్‌లతో పాటు టీమిండియా స్పిన్‌ బౌలింగ్‌ విభాగంపై అతనికి మంచి పట్టు ఉంది. అందుకు తగ్గట్లే టీమిండియాపై స్మిత్ కు ఘనమైన రికార్డులున్నాయి. ఈ నేపథ్యంలో బిగ్‌బాష్ లీగ్‌లో చెలరేగి ఆడుతున్న స్మిత్‌కు మూకుతాడు వేయాలంటే టీమిండియా బౌలర్లు ప్రత్యేక ప్రణాళికలు రచించుకోవాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం.. క్లిక్ చేయండి