AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Budget 2023: తెలంగాణలో ఎన్నికల బడ్జెట్‌.. ఏ శాఖకు ఎలా కేటాయించనున్నారు..!

తెలంగాణలో ఎన్నికల బడ్జెట్‌ రాబోతోంది. నవంబర్‌-డిసెంబర్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని శాఖలకు నిధులు కేటాయింపులు జరిగే ఛాన్స్‌ కనిపిస్తోంది.

Telangana Budget 2023: తెలంగాణలో ఎన్నికల బడ్జెట్‌.. ఏ శాఖకు ఎలా కేటాయించనున్నారు..!
Telangana Budget 2023
Shiva Prajapati
|

Updated on: Jan 22, 2023 | 10:10 AM

Share

తెలంగాణలో ఎన్నికల బడ్జెట్‌ రాబోతోంది. నవంబర్‌-డిసెంబర్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని శాఖలకు నిధులు కేటాయింపులు జరిగే ఛాన్స్‌ కనిపిస్తోంది. కొత్తగా ప్రజాకర్షక స్కీమ్‌లు కూడా తేనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో కేటాయింపులు, వనరుల నిర్వహణపై సీఎం కేసీఆర్‌ హై లెవల్‌ సమీక్ష చేశారు.

తెలంగాణ రాష్ట్ర బ‌డ్జెట్ 2023-24 ప్రిపరేషన్స్‌పై సీఎం కేసీఆర్‌ హై లెవల్‌ స‌మీక్ష చేశారు. ఆర్థిక శాఖ మంత్రి హ‌రీశ్‌తో పాటు.. ఆ శాఖ అధికారులు హాజ‌ర‌య్యారు. ఫిబ్రవ‌రి 3 లేదా 5 నుంచి బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశం ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్‌ 3 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని అంచనా.

రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంపైనే ఎక్కువ దృష్టి పెట్టాలని సీఎం అధికారులకు సూచించారు. కేంద్రం ప్రవేశ పెట్టే బడ్జెట్‌లో రాష్ట్రానికి ఎంత మేరకు నిధులు వస్తాయి? ఏ ఏ శాఖలకు కేటాయింపులు ఉంటాయి? అన్న అంశాలపై క్లారిటీ వస్త్తుంది. ఆ తర్వాత రాష్ట్ర బడ్జెట్‌ను ఖరారు చేయనున్నారు. ఇప్పటికే ప్రతిపాదనలు పంపాలంటూ అన్ని శాఖలకు ఆదేశాలు వెళ్లాయి.

ఇవి కూడా చదవండి

2022-23లో ప్రభుత్వ వ్యయం ఇప్పటికే 2 లక్షల కోట్లు దాటినట్టు అంచనా. ఇంకా రెండు నెలలు మిగిలి ఉండడంతో.. బడ్జెట్‌ 2.10 లక్షల కోట్ల నుంచి 2.15 లక్షల కోట్ల వరకు వెళ్లే ఛాన్స్‌ ఉంది. రాష్ట్ర సొంత ఆదాయ వృద్ధిలో తెలంగాణ దేశ చరిత్రలోనే రికార్డు సృష్టించినట్టు సమాచారం. రాష్ట్ర సొంత ఆదాయం 19 నుంచి 20 శాతం వృద్ధి నమోదు చేసినట్టు తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్