Stray Dogs: నిజాంపేటలో తండ్రి కూతురిపై వీధి కుక్కల దాడి.. హడలెత్తిపోతున్న స్థానికులు

నగరంలో కుక్కల దాడులు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐదు నెలల బాబు కుక్కల దాడిలో మృతి చెందిన ఘటన మరువకముందే నిజాంపేటలో మరొక ఘటన చోటు చేసుకుంది. నగరంలో కుక్కల బెడదకు ప్రజలు బింబెలెత్తిపోతున్నారు. ఒంటరిగా ఉన్న వృద్ధులు చిన్నపిల్లలపై కుక్కలు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. కుక్కల దాడిలో చిన్నారులు మృతి చెందుతున్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా..

Follow us

| Edited By: Srilakshmi C

Updated on: Jan 07, 2024 | 9:16 AM

సిద్దిపేట, జనవరి 7: నగరంలో కుక్కల దాడులు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐదు నెలల బాబు కుక్కల దాడిలో మృతి చెందిన ఘటన మరువకముందే నిజాంపేటలో మరొక ఘటన చోటు చేసుకుంది. నగరంలో కుక్కల బెడదకు ప్రజలు బింబెలెత్తిపోతున్నారు. ఒంటరిగా ఉన్న వృద్ధులు చిన్నపిల్లలపై కుక్కలు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. కుక్కల దాడిలో చిన్నారులు మృతి చెందుతున్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. కట్టిన జరిగిన రోజు తప్ప మళ్ళీ యధావిధిగా అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు నెలల బాబుని పడుకోబెట్టి తాళం చెవి ఇచ్చేందుకు పక్కింటికి వెళ్లింది ఓ తల్లి. ఇంటికొచ్చి చూసేసరికి కుక్కల దాడిలో చిన్నారి తీవ్రంగా గాయపడి కనిపించాడు.

ఆ బాబును చూసిన ఆ తల్లి హుటాహుటిన హాస్పిటల్‌కి తీసుకువెళ్లింది. రెండు రోజుల చికిత్స అనంతరం చిన్నారి మృతి చెందాడు. ఈ విధంగా చిన్న పిల్లల్లో కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోతూ ఉంటే తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. అయితే తాజాగా నిజాంపేటలో తండ్రీకూతురులపై వీధి కుక్క దాడి చేసింది. బండారి లేఅవుట్ కు చెందిన నరేష్ కుమార్ తన కూతురితో బయటకు వెళ్లగా కుక్క ఒక్కసారిగా ఇద్దరిపై దాడి చేసింది. ఈ ఘటనలో నరేష్ కుమార్‌ కాలికి తీవ్ర గాయం కాగా ఐదేళ్ల కూతురికి గాయాలు అయ్యాయి. గత నెలలో ఇదే కాలనీలో పార్కు వద్ద ఆడుకుంటున్న రెండేళ్ల చిన్నారిని వీధి కుక్క లాక్కెళ్ళింది. తీవ్రగాయాలైన చిన్నారి ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడింది. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిజాంపేట్ రోడ్ లోని హోలిస్టిక్ హాస్పిటల్‌లో తండ్రి కూతుర్లకు చికిత్స అందిస్తున్నారు. ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలంటూ కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న పిల్లలను ఆడుకునేందుకు బయటకు పంపించాలన్న, అత్యవసరంగా కిరాణా షాపులకు వెళ్లి ఏమైనా తెచ్చుకోవాలన్న భయపడాల్సి వస్తొదంటూ ఆందోళన చెందుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

అంబానీ ఇంట మిన్నంటిన గణేష్ చతుర్థి వేడుకలు.. వీడియో చూడండి
అంబానీ ఇంట మిన్నంటిన గణేష్ చతుర్థి వేడుకలు.. వీడియో చూడండి
ఇదేంది రాజా.. ఇలా జరుగుతోంది.? రాజ్ తరుణ్ కి బిగ్ షాక్.!
ఇదేంది రాజా.. ఇలా జరుగుతోంది.? రాజ్ తరుణ్ కి బిగ్ షాక్.!
మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..
మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..
ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | జూనియర్ నటసింహం.
ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | జూనియర్ నటసింహం.
ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’
ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!
కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు..
కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు..
నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌.. కొత్త పంచాయతీ.!
నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌.. కొత్త పంచాయతీ.!
అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.
అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.
మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో పుర్రె, శరీర ఎముకలు
మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో పుర్రె, శరీర ఎముకలు