MLC Elections: రెండు ఎమ్మెల్సీ స్థానాలకు వేరువేరుగా ఎన్నికల నిర్వహణపై ఈసీకి బీఆర్‌ఎస్ లేఖ
ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. 2021 నవంబర్‌లో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి పదవీ కాలం 2027 నవంబర్ వరకు ఉంది. కానీ ఎమ్మెల్యేలుగా గెలిచిన వెంటనే ఇద్దరు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఇప్పుడు ఈ రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నిక కోసం వేరువేరుగా షెడ్యూల్ జారీ చేసింది..

తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు వేరువేరుగా ఎన్నికల నిర్వహణపై ECకి లేఖ రాయలని బీఆర్ఎస్ నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీకి లబ్ది చేకూరేలా అధికారుల తీరు ఉందని.. షెడ్యూల్ వేర్వేరుగా ఇవ్వడం ఎందుకని గులాబీ నేతలు ప్రశ్నిస్తున్నారు. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు వేరువేరుగా షెడ్యూల్ ఇవ్వడంపై ECకి లేఖ రాయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ, హైకోర్టు న్యాయవాది భరత్, ఇతర లీగల్ సెల్ సభ్యులతో కలిసి చర్చించి ఎన్నికల అధికారులకు లేఖ సమర్పించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. 2021 నవంబర్‌లో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి పదవీ కాలం 2027 నవంబర్ వరకు ఉంది. కానీ ఎమ్మెల్యేలుగా గెలిచిన వెంటనే ఇద్దరు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఇప్పుడు ఈ రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నిక కోసం వేరువేరుగా షెడ్యూల్ జారీ చేసింది ఎన్నికల కమిషన్. ఇదే అంశం ఇప్పుడు వివాదంగా మారింది.
ఒకే ఎన్నిక నిర్వహించకుండా రెండు ఎన్నికలు నిర్వహించడంలో అంతర్యమేంటని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేత బోయినపల్లి వినోద్ కుమార్. గతంలో ఒకే రోజున ఒకే నోటిఫికేషన్ ద్వారా కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి MLCలుగా ఎన్నికైయ్యారని.. కానీ ఈ ఇద్దరి స్థానంలో కొత్త వారిని ఎన్నుకునేందుకు EC వేర్వేరుగా షెడ్యూల్ ఇవ్వడం ఎందుకన్నారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులు రెండు ఎన్నికలు నిర్వహించడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి లబ్ది చేకూరేలా ఉందన్నారు. గతంలో ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లో ఇలాంటి సందర్భాలు ఉన్నాయని, తమ లేఖపై ఎన్నికల కమిషన్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి