FD Rates: ఇప్పుడు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే వడ్డీ ఎంత ఎక్కువగా వస్తుందో తెలుసా?

బ్యాంక్ ఆఫ్ బరోడా తన స్వల్పకాలిక ఎఫ్‌డీ రేట్లను కూడా సవరించింది. ఇది 7 నుండి 14 రోజులకు వడ్డీ రేట్లను 3% నుండి 4.25%కి పెంచింది. 15 నుండి 45 రోజుల ఎఫ్‌డీలకు 1% నుండి 4.5% వరకు పెంచింది. 2023 డిసెంబర్ 26 నుండి అమలులోకి వచ్చే 2 కోట్ల రూపాయల కంటే తక్కువ డిపాజిట్ల కోసం యాక్సిస్ బ్యాంక్ ఎఫ్‌డీ వడ్డీ రేట్లలో కూడా మార్పులు చేసింది. ఇటీవలి మార్పుల తర్వాత యాక్సిస్ బ్యాంక్..

FD Rates: ఇప్పుడు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే వడ్డీ ఎంత ఎక్కువగా వస్తుందో తెలుసా?
Fd Rate
Follow us
Subhash Goud

|

Updated on: Jan 06, 2024 | 7:03 PM

ఫిక్స్‌డ్ డిపాజిట్ల విషయానికి వస్తే కొత్త సంవత్సరం లాభదాయకంగా ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును 6.5% వద్ద యథాతథంగా ఉంచినా ఈ మేలు జరిగింది. SBI సహా పలు బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను 8-9% వరకు పెంచాయి. ఎస్‌బీఐ, మరో ఏడు బ్యాంకులతో కలిసి ఎఫ్‌డీ వడ్డీ రేట్లను పెంచింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (ఎఫ్‌డీ) వడ్డీ రేట్లు 8-9 శాతానికి చేరుకున్నాయి. ఏయే బ్యాంకులు తమ వడ్డీ రేట్లను పెంచాయో, ఎంత మేర పెంచాయో తెలుసుకుందాం.

ముఖ్యంగా ఎస్‌బీఐ గణనీయమైన వడ్డీరేటును పెంచింది. ఇది 7 రోజుల నుండి 10 సంవత్సరాల కాలవ్యవధికి 3.50% నుండి 7% వరకు ఎఫ్‌డీ రేట్లను అందిస్తుంది. 2 కోట్ల రూపాయల కంటే తక్కువ ఎఫ్‌డీలకు రేట్లు వర్తిస్తాయి. అదనంగా ఎస్‌బీఐ తన ప్రత్యేక అమృత్ కలాష్ ఎఫ్‌డీ పథకం కోసం చివరి తేదీని మార్చి 31, 2024 వరకు పొడిగించింది. ఈ పథకం కింద సాధారణ పౌరులకు 7.10%, సీనియర్ సిటిజన్లకు 7.60% వడ్డీ రేట్లు 400 రోజుల FDపై ఇస్తుంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా తన స్వల్పకాలిక ఎఫ్‌డీ రేట్లను కూడా సవరించింది. ఇది 7 నుండి 14 రోజులకు వడ్డీ రేట్లను 3% నుండి 4.25%కి పెంచింది. 15 నుండి 45 రోజుల ఎఫ్‌డీలకు 1% నుండి 4.5% వరకు పెంచింది. 2023 డిసెంబర్ 26 నుండి అమలులోకి వచ్చే 2 కోట్ల రూపాయల కంటే తక్కువ డిపాజిట్ల కోసం యాక్సిస్ బ్యాంక్ ఎఫ్‌డీ వడ్డీ రేట్లలో కూడా మార్పులు చేసింది. ఇటీవలి మార్పుల తర్వాత యాక్సిస్ బ్యాంక్ ఎఫ్‌డీలపై 7 రోజుల నుండి 10 సంవత్సరాల కాలవ్యవధికి 3% నుండి 7.10% వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది.

ఇవి కూడా చదవండి

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను 0.25% వరకు పెంచింది. 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు ఉండే ఎఫ్‌డీలకు రేట్లు 3%, 7.25% మధ్య ఉంటాయి. 399 రోజుల కాలపరిమితి కలిగిన ఎఫ్‌డీలపై అత్యధికంగా 7.25 శాతం వడ్డీని ఆఫర్ చేసింది. పబ్లిక్ లెండర్ అయితే సీనియర్ సిటిజన్‌లకు 0.50% అధిక వడ్డీ రేటును, సూపర్ సీనియర్ సిటిజన్‌లకు అదనంగా 0.75% వడ్డీ రేటును అందిస్తుంది.

డీసీబీ బ్యాంక్ కూడా ఎఫ్‌డీ రేట్లను సవరించింది. ప్రస్తుతం ఇది సాధారణ వినియోగదారులకు 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3.75% నుండి 8% వడ్డీని అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 4.25% నుంచి 8.60% వరకు వడ్డీని ఇస్తుంది.

ఫెడరల్ బ్యాంక్ డిసెంబర్ 5, 2023 నుండి వడ్డీ రేట్లను పెంచింది. పెడరల్ బ్యాంక్ సాధారణ కస్టమర్లకు వడ్డీ రేట్లను 3% నుంచి 7.50%కి పెంచింది. ఇది సీనియర్ సిటిజన్లకు 500 రోజుల ఎఫ్‌డీపై 8% వడ్డీని అందిస్తుంది. సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తన రేట్లను డిసెంబర్ 22 నుండి మార్చింది. సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు వివిధ రకాల కాల వ్యవధితో ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను సవరించింది. ఇది 4% నుండి 8.65% వరకు వడ్డీ రేట్లు అందిస్తుంది. సాధారణ కస్టమర్‌లు 2 సంవత్సరాల 2 రోజుల ఎఫ్‌డీపై 8.65% వార్షిక వడ్డీని పొందవచ్చు. సీనియర్ సిటిజన్‌లు 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల వరకు ఉన్న ఎఫ్‌డీలపై 9.10% వార్షిక వడ్డీని పొందుతారు.

రిజర్వ్ బ్యాంక్ నివేదిక ప్రకారం.. టర్మ్ డిపాజిట్ రేట్లు, ప్రత్యేకంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు, గత 5 సంవత్సరాలలో అత్యధిక స్థాయిలో ఉన్నాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా డేటా ప్రకారం, ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలపరిమితి కలిగిన టర్మ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు అక్టోబర్ 6, 2023న 6% నుండి 7.25% పరిధిలో ఉన్నాయి. ఇది అక్టోబర్ 7, 2022 నాటికి 5.45 నుండి 6.10%. ఇక ఒక సంవత్సరం కాలంలో రేట్లు 0.55% నుండి 1.15% వరకు పెరిగాయి. చాలా బ్యాంకులు 1 నుండి 3 సంవత్సరాల మధ్య కాలపరిమితి కలిగిన ఎఫ్‌డీలపై అధిక వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. 1 నుండి 3 సంవత్సరాల పదవీకాలం మీ ఇన్వెస్ట్‌మెంట్ కు అనుగుణంగా ఉంటే మీడియం-టర్మ్ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ మీకు మరింత అనుకూలంగా ఉండవచ్చు.

మీరు ఇప్పటికే తక్కువ వడ్డీ రేటుతో దీర్ఘకాలిక ఎఫ్‌డిని తెరిచి ఉంటే, మీడియం-టర్మ్ ఎఫ్‌డిలో పెట్టుబడి పెట్టడానికి వీలుగా దానిని క్లోజ్ చేయచ్చేమో చూడండి. అయితే, మీరు మీ ఎఫ్‌డీని క్లోజ్ చేసే ముందు ఏవైనా పెనాల్టీలు ఉంటాయేమో కనుక్కోండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ