AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఆదిపత్య పోరులో ఆడపులి మృతి.. కాగజ్‌నగర్ అభయారణ్యంలో తొలి ఘటన

అడవుల జిల్లా కొమురంభీం ఆసిపాబాద్.. కాగజ్ నగర్ కారిడార్ లో పులి మృతి కలకలం రేపింది. మెడపై తీవ్రగాయాలతో చనిపోయిన పులి.. ఆదిపత్యం కోసం సాగిన పోరాటంలో బలైనట్టుగా అటవిశాఖ గుర్తించింది. రెండు పులుల మధ్య ఆదిపత్యం కోసం జరిగిన ఘర్షణలో రెండేళ్ల ఆడపులి అసువులు బాసింది. మహారాష్ట్ర సరిహద్దు కొమురంభీం జిల్లాలోని కాగజ్ నగర్ అటవీ డివిజన్ పరిదిలోని దరిగాం అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Telangana: ఆదిపత్య పోరులో ఆడపులి మృతి.. కాగజ్‌నగర్ అభయారణ్యంలో తొలి ఘటన
Tigers Fighting
Naresh Gollana
| Edited By: Surya Kala|

Updated on: Jan 07, 2024 | 9:58 AM

Share

మహారాష్ట్ర సరిహద్దు‌ నుండి వలస వస్తున్న పులులు కాగజ్ నగర్ కారిడార్ లో ఆదిపత్యం కోసం అన్నంత పని చేశాయి. కొత్త పులి రాకను ఒప్పుకోని బెబ్బులి తమ సామ్రాజ్యాన్ని కాపాడుకునేందుకు ఆదిపత్య పోరు సలిపి తమ జాతి వర్గాన్నే అంతం చేసింది. ఈ ఘటన కొమురంభీం జిల్లా కాగజ్ నగర్ అటవి ప్రాంతంలో కలకలం రేపింది. పులుల సంఖ్య పెరిగితే ఆదిపత్య పోరు తప్పదన్న హెచ్చరికలను నిజం చేస్తూ సరిహద్దు మహారాష్ట్ర తరహా ఘటన కాగజ్‌నగర్‌ కారిడార్ లో చోటు చేసుకోడం ఇదే తొలిసారి టెరిటోరియల్ ఫైట్ లో పులి మృతి చెందడం అటు అటవిశాఖను సైతం కలవరానికి గురి చేసింది. చనిపోయిన పులిని ఆడపులిగా గుర్తించిన అటవిశాఖ అదికారులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఫోస్ట్ మార్టంకు తరలించారు. మూడు రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకుందని.. అడ మగ పులుల మధ్య సాగిన భీకర దాడిలో.. రెండేళ్ల ఆడపులి మృతి చెందినట్టు కొమురంభీం జిల్లా అటవీ అధికారి నీరజ్ కుమార్ టిబ్రెవాల్ తెలిపారు.

ప్రాంతాల మీద ఆధిపత్యం కోసం మనుషులే కాదు, కృూరమృగాలు కూడా కొట్టుకుంటాయనే ఘటన మరోసారి రుజువైంది. ఆ దాడిలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరు సలుపుతాయని తేలింది. కాగజ్ నగర్ అభయారణ్యాల్లో పులుల మధ్య ఆధిపత్య కోసం తొలిసారి జరిగిన పోరులో ఓ ఆడపులి హతమైంది.

మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా మాలిని అటవి ప్రాంతం సమీపంలోని గోంది – కొమురంభీం జిల్లా కాగజ్ నగర్ దరిగాం అటవి ప్రాంతం మద్య కొమురంభీం ప్రాజెక్ట్ కాలువ సమీపంలో రెండు పులుల ఎదురెదురుగా తారస పడ్డాయి. దాహం తీర్చుకునేందుకు అటు వైపుగా వచ్చిన పులులు ఒకదానితో ఒకటి తలపడగా.. ఈ దాడి లో తీవ్రగాయాల పాలైన రెండేళ్ల ఆడపులి మృతి చెందినట్టుగా సమాచారం. మృతి చెందిన పులికి తల, మెడ ప్రాంతంలో తీవ్రగాయాలున్నాయని.. శనివారం ఓ పశువుల కాపరి ఆ ప్రాంతానికి వెళ్లగా పులి మృతిచెంది ఉన్నట్లు గుర్తించాడని… ఈ సమాచారం అటవీ అధికారులకు అందించడం కాగజ్ నగర్ డివిజన్ అధికారి వేణుబాబు, కాగజ్ నగర్ రేంజ్ పారెస్ట్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని పులి మృతి చెందినట్టుగా గుర్తించారని.. పశువైద్యాధికారులు విజయ్, శ్రీకాంత్ కలిసి ఘటనా స్థలాన్ని సందర్శించిన డీఎప్వో నీరజ్ కుమార్ టిబ్రివాల్ తెలిపారు. పశువైద్యాధికారులు పంచనామా చేసి రెండు పులుల పరస్పర దాడిలోనే గాయాలతో ఆడ పులి మృతి చెందినట్లు నిర్ధారించారని తెలిపారు కొమురంభీం జిల్లా డీఎప్వో. ఈ ఘర్షణ మూడు రోజు క్రితం జరిగిందని తెలిపారు. కొమురంభీం జిల్లా కాగజ్ నగర్ అడవుల్లో తొలి టెరిటోరియల్ టైగర్ డెత్ గా గుర్తించామని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మహారాష్ట్ర లోని చంద్రాపూర్ జిల్లాలో ఈ రకమైన పులుల మృతి ఘటనలు కనిపిస్తాయని.. తొలిసారి కాగజ్‌నగర్ కారిడార్ పరిదిలో ఒక పులి పై మరో పులి దాడి చేసి హతమార్చడం కనిపించిందని తెలిపారు డీఎప్వో. కాగజ్ నగర్ అటవి‌ప్రాంతంలో పులుల సంఖ్య పెరగడంతో ఆదిపత్యం కోసం మరిన్ని దాడులు జరిగే ప్రమాదం కూడా లేకపోలేదని నిపుణులు చెప్తున్నారు.

సరిహద్దు మహారాష్ట్ర లోని చంద్రపూర్ జిల్లా అడవుల్లో గత నెల రోజుల కాలంలో మొత్తం 7 పులులు చనిపోగా.. ఇవన్నీ ఆదిపత్య పోరులో భాగంగా జరిగిన దాడుల్లోనే హతమైనట్టు అక్కడి అటవి అదికారులు చెప్తున్నారు. గత ఏడాది నవంబర్ 14న చంద్రపూర్ జిల్లా చీమూరు అటవీ ప్రాంతంలో రెండు పులుల మధ్య జరిగిన పోరులో ఓ పులి మృతి చెందగా… నవంబర్ 18న తడోబాలో ఓ పులి మరణించింది.. డిసెంబరు 10న వరోరా అటవీ రేంజ్‌లో ప్రమాదంలో ఓ పులి చనిపోగా, డిసెంబరు 14న పలాస్‌గావ్‌లో ఒక పులి సహజంగా చనిపోయింది.. డిసెంబర్ 21న సిందేవాహి రేంజ్‌లో విద్యుత్ షాక్‌తో ఓ పులి మరణించింది. కొమురంభీం జిల్లా చంద్రపూర్ జిల్లాల సరిహద్దు లో 60 కిమీల అటవి ప్రాంత పరిదిలోనే నెలన్నర కాలంలో పదికి పైగా పులులు మృతి చెందడం కలవర పెడుతున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..