Telangana: సిట్టింగ్ ఎంపీ సీట్‌కు ఫిట్టింగ్ పెడుతున్న సీనియర్లు.? రసవత్తరంగా మారిన రాజకీయం
నిజామాబాద్ జిల్లా కాషాయ పార్టీలో పార్లమెంట్ సీటు కమల దళం నేతల్లో చిచ్చు పెడుతోంది. సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మరో సారి పోటీకి వెనకముందు అవుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయనకు టికెట్టు ఇవ్వొద్దంటూ ఆయన వ్యతిరేక వర్గం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఆ సిట్టింగ్ స్దానానికి తమ పేర్లను పరిశీలించాలంటూ కొందరు నేతలు అధిష్ఠానానికి దరఖాస్తులు చేసుకుంటున్నారని...

ఆ జిల్లాలో సిట్టింగ్ ఎంపీ సీటుకు సీనియర్లు ఫిట్టింగ్ పెడుతున్నారట. ఆ సీటు పై కన్నేసిన కొందరు సీనియర్లు వరుస పెట్టి ఒక్క ఛాన్స్ అంటూ పార్టీ పెద్దలకు అర్జీలు పెట్టుకున్నారట. ఇంతకీ ఎవరా సిట్టింగ్ ఎంపీ, ఆయన సీటుకు ఎసరు పెడుతోన్న నేతలు ఎవరు.? లాంటి ఆసక్తికర విషయాలు తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
నిజామాబాద్ జిల్లా కాషాయ పార్టీలో పార్లమెంట్ సీటు కమల దళం నేతల్లో చిచ్చు పెడుతోంది. సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మరో సారి పోటీకి వెనకముందు అవుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయనకు టికెట్టు ఇవ్వొద్దంటూ ఆయన వ్యతిరేక వర్గం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఆ సిట్టింగ్ స్దానానికి తమ పేర్లను పరిశీలించాలంటూ కొందరు నేతలు అధిష్ఠానానికి దరఖాస్తులు చేసుకుంటున్నారని టాక్ నడుస్తోంది.
ఈ క్రమంలో ఇటీవల బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సిట్టింగులకు సీటు గ్యారెంటీ లేదంటూ చేసిన వాఖ్యలతో.. సిట్టింగ్ స్థానంపై కన్నేసిన సీనియర్లలో ఆశలు చిగురిస్తున్నాయి. పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండల లక్ష్మినారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మి నర్సయ్యలు నిజామాబాద్ లోక్ సభ టికెట్టు ఆశిస్తున్నారని టాక్. టికెట్టు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని తెలుస్తోంది. ఈ పాటికే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జాతీయ నాయకత్వానికి తమ మనస్సులో మాట చెప్పేశారని తెలుస్తోంది.
ఎంపీ అర్వింద్ వ్యవహార శైలి పై గుర్రుగా ఉన్న సదరు నేతలు ఆయన సీటుకు ఫిట్టింగ్ పెట్టారని చర్చించుకుంటున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న కోరుట్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఎంపీ అర్వింద్ ఓటమి పాలైన విషయం తెలిసిందే దీంతో ఆయన అభ్యర్థిత్వంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇక తాను పోటీ చేయడం సేఫ్ కాదు అనుకుంటున్న అర్వీంద్ మోదీ రాగం ఎత్తుకున్నారని పలువురు నేతలు ఆరోపిస్తున్నాయి. మోదీ వస్తే తాను పాదయాత్ర చేస్తాను అంటూ అటేన్షన్ డైవర్షన్ చేస్తున్నారు అనే టాక్ బిజేపి ఇంటర్నల్ వర్గాల్లో జోరుగా నడుస్తోంది.
పావులు కదుపుతున్న అర్వీంద్ వ్యతిరేఖ వర్గం..
నిజామాబాద్ జిల్లా కమలం పార్టీ.. ఎంపీ అర్వింద్ అనుకూల వర్గం వ్యతిరేక వర్గంగా రెండుగా చీలిపోయానని చర్చ నడుస్తోంది. జిల్లా పై పట్టు సాధించేందుకు ఎంపీ అర్వింద్.. పార్టీలో తన టీం ఏర్పాటు చేసుకున్నారని, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తాను అనుకున్న వారికి టికెట్లు ఇప్పించుకున్నారని చర్చ నడుస్తోంది. పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా రెండు చోట్ల ఆ పార్టీ అభ్యర్ధులు విజయం సాధించారు. పార్టీలో చేరికల విషయంలోనూ తన మాటే నెగ్గాలి అనే తరహాలో వ్యవహరించారని టాక్. జిల్లా అధ్యక్షున్ని మార్చేందుకు తన మార్క్ రాజకీయం చేసి ఫెయిల్ అవడాన్ని కూడా అర్వీంద్ జీర్ణించుకోలేకపోతున్నారని గుసగుసలాడుతున్నారు.
అర్వీంద్‌కు పోటీగా మారిన జిల్లా అధ్యక్షుడు.?
ఇక జిల్లా అధ్యక్షుడిగా ఉన్న బస్వ లక్ష్మినర్సయ్య కు జాతీయ పార్టీ కోద్ది రోజులుగా అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రెండు అసెంబ్లీ స్థానాలు గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు బస్వ.. అంతే కాకుండా మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో 28 మంది కార్పోరేటర్లను గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. దీంతో రాష్ట్ర పార్టీతో పాటు, జాతీయ నాయకత్వం కూడ బస్వ వైపు చూస్తుందని టాక్. ఇక కోరుట్లలో ఓటమి పాలవడంతో అర్వీంద్ వెనుకడుగు వేస్తున్నారని తెలుస్తోంది. ఎంపీ స్థానానికి కూడా ఓడిపోతే పార్టీ ప్రాధాన్యత తగ్గిపోతుందని ఆలోచించే అర్వీంద్.. పార్లమెంట్ స్థానానికి పోటీ చేయకుండా రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ పడొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ నిజమాబాద్ ఎంపీ స్థానం ఎవరికి తక్కుతుందో చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..
