Sunday Puja Tips: ఆర్ధిక ఇబ్బందులా.. ఆదివారం సాయత్రం ఇలా చేసి చూడండి..
ఆరోగ్యాన్ని ఇచ్చే సూర్యభగవానుడిని సూర్యోదయ సమయంలో పూజించడం అత్యంత ఫలవంతం. అదే విధంగా ఆదివారం సాయంత్రం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం ద్వారా జీవితంలో డబ్బుకి కొరత ఉండదు. త్రేతాయుగం, సత్యయుగం, ద్వాపరయుగం, కలియుగంలో ఇలా నాలుగు యుగాల్లో భాస్కరుడు విశిష్టత కలిగి ఉన్నాడని పురాణాల కథనం. ఎవరైనా ఆరోగ్యకరమైన శరీరం, సంపద, ఆనందం, శాంతిని కోరుకుంటే ఆదివారం సాయంత్రం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఈ రోజు అవి ఏమిటో తెలుసుకుందాం..
హిందూ గ్రంధాల ప్రకారం ఆదివారం భాస్కరునికి అంకితం చేయబడింది. ఈ రోజున సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం ద్వారా జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోతాయి. సూర్యదేవుడు మనకు ప్రత్యక్షంగా కనిపించే దేవుడు అని .. ప్రతి యుగంలో భాస్కరుడు ఉన్నాడని చెబుతారు. ఆరోగ్యాన్ని ఇచ్చే సూర్యభగవానుడిని సూర్యోదయ సమయంలో పూజించడం అత్యంత ఫలవంతం. అదే విధంగా ఆదివారం సాయంత్రం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం ద్వారా జీవితంలో డబ్బుకి కొరత ఉండదు. త్రేతాయుగం, సత్యయుగం, ద్వాపరయుగం, కలియుగంలో ఇలా నాలుగు యుగాల్లో భాస్కరుడు విశిష్టత కలిగి ఉన్నాడని పురాణాల కథనం.
ఎవరైనా ఆరోగ్యకరమైన శరీరం, సంపద, ఆనందం, శాంతిని కోరుకుంటే ఆదివారం సాయంత్రం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఈ రోజు అవి ఏమిటో తెలుసుకుందాం..
ఆదివారం సాయంత్రం పాటించాల్సిన నివారణ చర్యలు
- ఆదివారం సాయంత్రం రావి చెట్టు కింద దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు లభిస్తాయని విశ్వాసం. అంతేకాదు ఇలా చేయడం వలన ఒక వ్యక్తి ప్రాపంచిక సుఖాన్ని పొందుతాడని నమ్ముతారు.
- ఆదివారం నాడు రావిచెట్టు కింద వెలిగించే దీపానికి నాలుగు ముఖాలుగా ఉండాలని గుర్తుంచుకోండి. ఇది వ్యక్తి గౌరవాన్ని పెంచుతుంది. పనిలో పురోగతికి అనేక అవకాశాలను అందిస్తుంది.
- ఎవరైనా వ్యాపారంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. ఆదివారం శనీశ్వరుడని ఆరాధించడం వల్ల వ్యాపారంలో లాభం చేకూరుతుందని విశ్వాసం.
- హిందూ ధర్మంలో దానిని విశిష్ట స్థానం ఉంది. అయితే ఆదివారం సాయంత్రం నల్ల నువ్వులు, నల్ల బట్టలు, మినప పప్పు లేదా ఎండుమిర్చి దానం చేయాలి. ఇలా చేయడం వలన జీవితంలో ఆనందం కలుగుతుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు