ఆ ఇద్దరూ కలిస్తే కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం!
Narayankhed, September 30: వాళ్ళు ఇద్దరు సీనియర్ లీడర్లే.. ఉండేది ఓకే పార్టీలో కానీ కలిసి ఉండడం అనేది వాళ్లకు అలవాటు లేదట.. హస్తం పార్టీలో ఉన్న ఇద్దరు నేతలు ఎప్పుడు చూసిన ఉప్పు, నిప్పులా ఉండడంతో, వీరి గొడవలు అక్కడ అధికార పార్టీకి లాభం చేకురుతొందట.. ఇలా అయితే కుదరదు అని పార్టీ అధిష్టానమే రంగంలోకి దిగిందట.. వీళ్ళ ఇద్దరి మధ్య రాజీ కూదిర్చే ప్రయత్నం చేస్తోందట..
Narayankhed, September 30: వాళ్ళు ఇద్దరు సీనియర్ లీడర్లే.. ఉండేది ఓకే పార్టీలో కానీ కలిసి ఉండడం అనేది వాళ్లకు అలవాటు లేదట.. హస్తం పార్టీలో ఉన్న ఇద్దరు నేతలు ఎప్పుడు చూసిన ఉప్పు, నిప్పులా ఉండడంతో, వీరి గొడవలు అక్కడ అధికార పార్టీకి లాభం చేకురుతొందట.. ఇలా అయితే కుదరదు అని పార్టీ అధిష్టానమే రంగంలోకి దిగిందట.. వీళ్ళ ఇద్దరి మధ్య రాజీ కూదిర్చే ప్రయత్నం చేస్తోందట.. ఇంతకీ ఇది ఏ నియోజకవర్గంలో..? ఆ ఇద్దరు నేతలు ఎవరు.. నారాయణఖేడ్ నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట.. వరస విజయాలతో విజయ దుందుంబి మోగించింది కాంగ్రెస్ పార్టీ. 2016లో దివంగత నేత కిష్టారెడ్డి హఠాన్మరణంతో అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ విజయం సాధించింది.
వాస్తవానికి నారాయణఖేడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగానే ఉంది. ఆ పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉన్నారు. ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు భారీగా పడుతున్నాయి. కానీ ఇక్కడ ఉన్న ఆ ఇద్దరు నేతలు కలిస్తే.. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయం పక్కా అని ఆ పార్టీ సీనియర్ లీడర్లు విశ్వసిస్తున్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్స్ అయిన సంజీవరెడ్డి, సురేష్ షెట్కార్.. ఇద్దరి నేతల మధ్య గత కొద్ది సంవత్సరాలుగా వైరం కొనసాగుతోంది. ఆ ఇద్దరి మధ్య ఉన్న వైరమే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలకు అడ్డంకిగా మారిందని టాక్. ఇదే విషయాన్ని చాలా లేటుగా గ్రహించారు ఆ ఇద్దరు నేతలు. ఈ నేపథ్యంలోనే ఇటీవలి కాలంలో కొంత కలిసి పని చేయాలని ఆలోచనలో పడ్డారట సంజీవరెడ్డి, సురేష్ షేట్కార్. ఎంతసేపూ మనలో మనం కొట్టుకుంటుంటే అధికార పార్టీకి లాభం అవుతుందని భావించి.. ఇక లాభం లేదని ఇద్దరూ ఒక్కటయ్యే ప్రయత్నం చేస్తున్నారట. అందుకే ఇటీవలి కాలంలో ఒకటి, రెండు ప్రోగ్రామ్స్ సంజీవరెడ్డి, సురేష్ షెట్కార్ కలిసి చేయడంతో అవి గ్రాండ్ సక్సెస్ అవడమే కాకుండా, పార్టీ క్యాడర్ లో కూడా ఫుల్ జోష్ వచ్చింది.
ఈ విషయాన్ని గమనించిన కాంగ్రెస్ అధిష్టానం, ఇది ఇలాగే కొనసాగడానికి నారాయణఖేడ్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించిందట. సంజీవరెడ్డి, సురేష్ షెట్కార్ ఇక్కడ కలిసి పని చేస్తే నారాయణ ఖేడ్‌లో కాంగ్రెస్ పార్టీ విజయం పక్కా అని, ఇక్కడ ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిని ఓడించొచ్చని భావిస్తోంది పార్టీ అధినాయకత్వం. అందుకు తగ్గట్టుగానే కార్యాచరణ కూడా మొదలు పెట్టింది. సంజీవరెడ్డి, సురేష్ షేట్కార్ మధ్య రాజీ కుదిరిచ్చే ప్రయత్నం చేస్తున్నారు పార్టీ పెద్దలు. మొదటి నుండి సంజీవరెడ్డి, సురేష్ షేట్కార్ మధ్య టికెట్ గురించే గొడవ జరుగుతోందని, ఈసారి ఆ గొడవకు ఎండ్ కార్డు వెయ్యాలని ప్రయత్నాలు చేస్తోంద కాంగ్రెస్ అధిష్టానం. అందుకు తగ్గట్టుగానే సంజీవరెడ్డికి ఎమ్మెల్యే టికెట్, సురేష్ షెట్కార్ కి ఎంపీ టికెట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యిందట అధిష్టానం.
సంజీవరెడ్డి(చిట్టపు రెడ్డిలు) ఇతను బీసీ వర్గానికి చెందిన నేత, ఇతని తండ్రి దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున నాలుగు సార్లు నారాయణఖేడ్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన కొడుకు సంజీవరెడ్డికి కూడా నియోజకవర్గంలో మంచి పేరు ఉంది. అందుకే ఈసారి ఆయనకే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ఆలోచన చేస్తోందట పార్టీ అధిష్టానం. ఇక మరొక నేత సురేష్ షెట్కార్ కూడా గతంలో ఎంపీగా చేసిన అనుభవం ఉంది. గతంలో జహీరాబాద్ ఎంపీగా పనిచేశారు. ఆయనకు ఈసారి జహీరాబాద్ ఎంపీ టికెట్ ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారట.
ఇలా ఇద్దరి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారట. నారాయణఖేడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మంచి ఓటు బ్యాంకు ఉంది. కానీ ఇక్కడ ఉన్న ఈ ఇద్దరి నేతల వర్గపోరు వల్ల పార్టీ అధికారంలో రావడం లేదని.. ఈసారి ఎలాగైనా వీరిద్దరిని ఓకే తాటి పైకి తెచ్చి నారాయణఖేడ్ నియోజకవర్గంపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలనే ఆలోచనలో ఉంది కాంగ్రెస్ అగ్రనాయకత్వం. ఈ సారి నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే సీట్ కాంగ్రెస్ గెలిస్తే.. ఆ ఎఫెక్ట్ ఎంపీ ఎన్నికలపై కూడా ఉంటుందని, వీరిద్దరూ కలిసి పనిచేస్తే జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని జహీరాబాద్, అందోల్, నారాయణఖేడ్ జుక్కల్ నియోజకవర్గాలపై కూడా ప్రభావం ఉంటుందని భావిస్తోంది కాంగ్రెస్ అధిష్టానం.
మరో వైపు ఇన్నాళ్లకు తమ నేతలను కలపాలని పార్టీ అధిష్టానానికి ఆలోచన రావడం తమ అదృష్టంగా భావిస్తున్నారట నారాయణఖేడ్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు. ఇద్దరు నేతలను ఒకే ఫ్రెమ్ లో చూడటం సంతోషంగా ఉందని ఆనందపడిపోతున్నారట. మరి పార్టీ అధిష్టానం చేస్తున్న రాజీ ప్రయత్నానికి ఈ ఇద్దరు నేతలు ఒప్పుకుంటారా..లేక అధిష్టానం చెప్తే తామెందుకు వినాలని, ఎవరి దారి వారు చూసుకుంటారా? అనేది తేలాలంటే కాలం వైపు చూస్తూ ఉండాల్సిందే.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..