Shocking: కొంప ముంచిన చట్నీ.. జీవితాంతం వీల్‌చైర్‌కే పరిమితం చేసింది..
కొందరు భోజన ప్రియులు ఉంటారు. కడుపు నిండా సంతృప్తిగా ఆహారం లాగించేస్తుంటారు. తినే భోజనంలో రైస్, పప్పు, కూర, ఏదైనా ఫ్రై, రోటీ, దానికి తోడుగా చట్నీ, సాంబార్, పాపడం, చివరలో కాసింత పెరుగుతో తింటే.. నాసామి రంగ భోజనం సంపూర్ణం అయిపోతుంది అని అంటుంటారు. నిజమే.. భోజన ప్రియులు ప్రతీది ఆస్వాదిస్తారు.
కొందరు భోజన ప్రియులు ఉంటారు. కడుపు నిండా సంతృప్తిగా ఆహారం లాగించేస్తుంటారు. తినే భోజనంలో రైస్, పప్పు, కూర, ఏదైనా ఫ్రై, రోటీ, దానికి తోడుగా చట్నీ, సాంబార్, పాపడం, చివరలో కాసింత పెరుగుతో తింటే.. నాసామి రంగ భోజనం సంపూర్ణం అయిపోతుంది అని అంటుంటారు. నిజమే.. భోజన ప్రియులు ప్రతీది ఆస్వాదిస్తారు. ముఖ్యంగా అన్నంలో చట్నీని ఇష్టపడే వారు చాలా మంది ఉంటారు. చట్నీ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఆహార రుచిని పెంచడానికి చట్నీ వేసుకుని తింటారు జనాలు. చట్నీకి క్రేజ్ ఒక్క మన దేశంలోనే కాదు.. ప్రపంచ దేశాలన్నింటిలోనూ ఉంది. అయితే, ఎంతో ఇష్టంగా తినే చట్నీ ఓ మహిళను జీవితాంతం వీల్ చైర్‌కే పరిమితం చేసింది. ఆమె శరీరం కదలనీయకుండా చేఉసింది. చట్నీ ఏంటి? మహిళను అచేతనంగా చేయడం ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారా? అవును ఇది నిజంగా నిజం. చిట్నీ తిని ఓ మహిళ అచేతన స్థితికి చేరింది. ఈ ఘటన బ్రెజిల్‌లో వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
బ్రెజిల్‌లో కార్నీరో సోబ్రెరా అనే మహిళ చట్నీ తిని తీవ్ర అస్వస్థతకు గురైంది. చట్నీ ఆమె ప్రాణాలకు ముప్పు తెచ్చిపెట్టింది. వారాలా తరబడి ఆస్పత్రిపాల్జేసింది. న్యూయ్యార్క్ పోస్ట్ కథనం ప్రకారం.. బ్రెజిల్ నివాసి అయిన కార్నీరో సోబ్రెరా గోజ్ మార్కెట్ నుంచి పెస్టో సాస్‌ను కొనుగోలు చేసింది. పచ్చగా ఉండే ఈ చట్నీ చాలా రుచికరంగానూ ఉంటుంది. అందుకే ఈ చట్నీ ఆమెకు బాగా నచ్చింది. తినేటప్పుడు ఈ చట్నీ బాగానే ఉన్నప్పటికీ.. తిన్న తరువాత సమస్య మొదలైంది. మహిళ పరిస్థితి విషమించింది.
చట్నీ తిన్న తరువాత పరిస్థితి విషమం..
మహిళ చట్నీ తిన్న కాసేపటి తరువాత ఆమె ఆరోగ్యం మెల్ల మెల్లగా క్షీణించింది. పదే పదే వాంతులు చేసుకుంది. చివరకు ఆమె పరిస్థితి మరింత క్షీణించింది. చేతులు, కాళ్లు కూడా కదపలేని పరిస్థితికి చేరింది. నాలుక కూడా వణికిపోయింది. ఎలాగోలా ఆమె ఆస్పత్రికి చేరింది. ఆమె పరిస్థితిని గమనించిన వైద్యులు.. వెంటనే సిటీ స్కాన్ చేశారు. కాసేపటి తరువాత ఆమె శరీర భాగాలన్నీ పూర్తిగా పని చేయడం ఆగిపోయింది. సదరు మహిళ బోటులిజం అనే అరుదైన వ్యాధి కారణంగా ఆమె ఈ సమస్యను ఎదుర్కొందని వైద్యులు నిర్ధారించారు. ఆమెకు స్పృహ వచ్చినప్పుడు అసలేమైందని ప్రశ్నించగా.. అసలు విషయం చెప్పింది. గడువు తీరిన చట్నీ తినడం వల్లే ఇప్పడు ఆమెకు ఈ పరిస్థితి ఎదురైనట్లు తెలుస్తోంది. చట్నీ తినే ముందు దాని గడువు తేదీ ఉందో లేదో చూసుకోలేదని, అది తిన్న తరువాతే నా పరిస్థితి ఇలా అయ్యిందంటూ కార్నీరో వైద్యులకు వివరించింది.
మొత్తానికి చట్నీ.. ఇలా ఓ మహిళను జీవితాంతం వీల్ చైర్‌కే పరిమితం చేసింది. అందుకే ఏదైనా కొని, తినే ముందు.. దాని గడువు తేదీని తప్పనిసరిగా తనిఖీ చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే.. ఈ మహిళ మాదిరిగానే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
మరిన్ని హ్యూమన్‌ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..