Telangana: ఆ నేతకు వింత చిక్కులు.. పార్టీలో నెంబర్ 2 అయినా తప్పని తిప్పలు.. కన్‌ఫ్యూజన్‌లో కేడర్..
Nizamabad, September 30: నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్‌లో ఇప్పుడు టికేట్ వార్ నడుస్తుంది. బీసి కార్డ్‌తో వెళ్లి జెండా ఎగురవేయాలని చూస్తున్న ఆ పార్టీకి అక్కడున్న లీడర్లలలో సమన్వయ లోపం పెద్ద డిస్వాంటేజ్ గా మారుతుంది. ఉన్న ముగ్గురు బీసీ లీడర్లలో ఒకరికి ఒకరంటే పడకపోవడంతో ఇప్పుడు ఏవరితో వేళ్లాలి అనే కన్‌ఫ్యూజన్ కూడా క్యాడర్‌లో బలంగా ఉంది.
Nizamabad, September 30: నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్‌లో ఇప్పుడు టికేట్ వార్ నడుస్తుంది. బీసి కార్డ్‌తో వెళ్లి జెండా ఎగురవేయాలని చూస్తున్న ఆ పార్టీకి అక్కడున్న లీడర్లలలో సమన్వయ లోపం పెద్ద డిస్వాంటేజ్ గా మారుతుంది. ఉన్న ముగ్గురు బీసీ లీడర్లలో ఒకరికి ఒకరంటే పడకపోవడంతో ఇప్పుడు ఏవరితో వేళ్లాలి అనే కన్‌ఫ్యూజన్ కూడా క్యాడర్‌లో బలంగా ఉంది. ఈ ముగ్గురు ఒకటి అవ్వరు.. క్యాడర్ కన్‌ఫ్యూజ్‌ను దూరం చేయరు అని ఓపేన్‌గానే మాట్లాడుకుంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. పిసిసిలో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నా ఆ నేత దోరణితో కూడ క్యాడర్ చికాకు పడుతుందనే టాక్ బలంగా వినిపిస్తుంది. ఒకప్పుడు డీఎస్ లాంటి నేతలు ఏక చత్రాధిపత్యం వహించి.. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలా ఉండేది నిజామాబాద్. అయితే ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కానీ ఇప్పుడు సయన్వయ లోపం ఆ ముగ్గురు లీడర్లను దూరం చేస్తుందట. నిజామాబాద్ అర్బన్‌లో కాంగ్రెస్ స్ట్రాంగ్ గా ఉన్న నియోజకవర్గంలో ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఇప్పుడు పార్టీకి పెద్ద తలనోప్పిగా మారుతున్నాయట.
అర్బన్‌లో పట్టున్నా సమన్వయ లోపం..
నిజామాబాద్ అర్బన్‌లో కాంగ్రెస్ కు మంచి పట్టుంది. అటు మైనారీటిలలో ఇటు బీసిలలో పార్టీ క్యాడర్ చాల బలంగా ఉంది. దీంతో అదిష్టానం మంచి పట్టున్న బీసి నేతకు టికేట్ ఇవ్వాలనే ఆలోచనలో ఉందట. ఆ విషయం తెలిసిన ముగ్గురు బీసి లీడర్లు ఇప్పుడు ఒకరికంటే ఒకరు ఏవరి గ్రూప్ వాళ్లు చేసుకోని రాజకీయం చేస్తున్నారట. దీంతో పార్టీకి ఇది నష్టం అని క్యాడర్ నేత్తి నోరు కోట్టుకుంటున్నా ఏవరు వినే పరిస్థితి లేదని వాపోతున్నారట. ఇక నిజామాబాద్ అర్బన్‌లో పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మాజి మేయర్ సంజయ్ బీసీ సామజిక వర్గం నుండి ప్రాతినిద్యం వహిస్తున్నారు. వీరికి తోడు ఇప్పుడు బాల్కోండ మాజి ఎమ్మెల్యే అనిల్ కూడ నిజామాబాద్ అర్బన్ నుండి అప్లై చేసుకున్నారు. ఇప్పుడు ఈ ముగ్గురి మధ్య కూర్చి కోసం వార్ నడుస్తుందట. టికేట్ తమకు అంటే తమకు కావాలని ఏవరి పైరవి వాళ్లు చేస్తున్నారట. వీరిలో మహేష్ కుమార్ గౌడ్ గతంలో ఇక్కడి నుండి పోటి చేసిన కారణంగా ఇప్పుడు అటు ఇటో ఇక్కడి నుండే తేల్చుకోవాలని డిసైడ్ అయ్యారట. కానీ మాజి మేయర్ సంజయ్ అనుహ్యంగా పార్టీలో జాయిన్ అవడం ఇప్పుడు డిఎస్ కు కాంగ్రెస్ లో పరిచయాల కారణంగా అర్బన్ సీటు తనకే కావాలని పట్టుపడుతున్నారట. మహేష్ కు, సంజయ్ కు మద్య సీటు వార్ ఇంకా హీట్ పెంచుతుంది. సంజయ్ సైలంట్ గా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ఇటు వర్కింగ్ ప్రెసిడెండ్ గా ఉన్నా కూడా మహేష్ కుమార్ తన సీటు తానే సాధించుకోవడం పార్టీలో కష్టంగా మారిందట. తనకు హమీ లభించకపోవడంతో కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారట మహేష్ కుమార్ గౌడ్. ఇక ఈ ఇద్దరు చాలదు అన్నట్లు మాజి విప్ అనిల్ బాల్కోండ ను వదిలి ఇప్పుడు అర్బన్ నుండి అప్లై చేసుకోవడంతో ఇంకా టఫ్‌గా మారిందట పరిస్థితి.
క్యాడర్ ను వీక్ చేస్తున్న కన్‌ఫ్యూజన్..
ఇక మహేష్ కుమార్ గౌడ్ కన్‌ఫ్యూజ్ క్యాడర్ ను ఇంకా వీక్ చేస్తుందట. ఎక్కడి నుండి పోటి చేయాలి, ఏప్పుడు చేయాలి అనే క్లారిటి లేకపోవడం, అటు సంజయ్, అనిల్ కు టికెట్ ఇవ్వకుండా అడ్డుకోవడంతో పార్టీలో కన్‌ఫ్యూజన్ క్రియేట్ అయిందట. కోద్ది రోజులు ఆర్మూరు అని, కోద్ది రోజులు బాల్కోండ అని, రకరకాల కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేయడంతో ఇప్పుడు క్యాడర్ అంతా ఆయోమయంలో పడిందట. అన్నా ఏదో ఒక్క క్లారటి ఇవ్వండి, ఉంటున్నారా, పోతున్నారా అని అడుగుతుందట క్యాడర్. మొత్తానికి క్యాడర్ లో కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్న ఈ సమస్య తోందరగా సమసి పోవాలని కోరుకుంటున్నారట. ముగ్గురు కలిసి వెదిక పంచుకుంటే చూడాలని ముచ్చట పడుతున్నారట కాంగ్రెస్ కార్యకర్తలు. వివాదాలు లేని నాయకునికి పట్టం కట్టాలని కోరుతున్నారట.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..