AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గురువు ఎన్టీఆర్ చేయలేని పని శిష్యుడు కేసీఆర్ చేస్తారు.. మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Telangana Minister KTR Praises NTR: ఖమ్మం జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటనలో కొణిజర్ల మండలం అంజనాపురం వద్ద ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీకి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఖమ్మం జిల్లా నగరంలోని లకారం ట్యాంక్ బండ్ వద్ద రూ.1.37 కోట్లతో నిర్మించిన ఎన్టీఆర్ పార్క్‌, విగ్రహాన్ని మంత్రి అజయ్ కుమార్‌తో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్టీ రామారావుపై కేటీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు.

గురువు ఎన్టీఆర్ చేయలేని పని శిష్యుడు కేసీఆర్ చేస్తారు.. మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Telangana Minister KTR On NTR
Janardhan Veluru
|

Updated on: Sep 30, 2023 | 1:57 PM

Share

టీడీపీ వ్యవస్థాపకుడు ధివంగత నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) శిష్యుడు కేసీఆర్ సీఎంగా హ్యాట్రిక్ కొడతారంటూ తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ధీమా వ్యక్తంచేశారు. ఖమ్మం జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటనలో కొణిజర్ల మండలం అంజనాపురం వద్ద ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీకి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఖమ్మం జిల్లా నగరంలోని లకారం ట్యాంక్ బండ్ వద్ద రూ.1.37 కోట్లతో నిర్మించిన ఎన్టీఆర్ పార్క్‌, విగ్రహాన్ని మంత్రి అజయ్ కుమార్‌తో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్టీ రామారావుపై కేటీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ఎన్టీఆర్‌ ఆదర్శమన్నారు. రాముడు, కృష్ణుడు ఎలా ఉంటారో మనకు తెలియదు.. కానీ, బహుశా NTR లాగే ఉంటారనుకునేవాళ్లమన్నారు. భారత దేశంలో తెలుగు వారంటూ ఉన్నారంటూ గుర్తించేలా చేసింది ఎన్టీఆరే అన్నారు. చరిత్రలో ఆయన పేరు చిరస్మరణీయంగా ఉంటుందన్నారు.

తనకు ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం రావడం తన అదృష్టమని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదములు తెలిపారు. ఎందరు వచ్చినా ఎన్టీఆర్‌కు సాటిలేరని వ్యాఖ్యానించారు. తారకరామారావు అనే పేరులోనే ఏదో శక్తి ఉందన్నారు. ఎన్టీఆర్ శిష్యుడు కేసీఆర్ తెలంగాన అస్తిత్వాన్ని యావత్ దేశానికి చాటి చెప్పారని వ్యాఖ్యానించారు.  దక్షిణ భారతావనిలో ఎన్టీఆర్ సహా ఎవరూ సీఎంగా హ్యాట్రిక్ కొట్టలేకపోయారని గుర్తుచేశారు. అయితే ఆయన శిష్యుడు సీఎం కేసీఆర్‌ వచ్చే ఎన్నికల్లో గెలిచి.. సీఎంగా హ్యాట్రిక్ కొడతారని ధీమా వ్యక్తంచేశారు. తద్వారా గురువు చేయలేని పనిని శిష్యుడు కేసీఆర్ సాధ్యం చేయబోతున్నారని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.

ఎన్టీఆర్‌పై మంత్రి కేటీఆర్ ప్రశంసలు.. వీడియో చూడండి..

ఖమ్మం జిల్లాలో పార్టీల మధ్య హోరాహోరీ

రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ నెలకొననుంది. బీఆర్ఎస్ మాజీ నేతలు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఖమ్మం జిల్లాలో వచ్చే ఎన్నికల్లో తన సత్తా చాటాలని బీఆర్ఎస్ పెద్దలు పట్టుదలగా ఉన్నారు. ఆ దిశగా తమ రాజకీయ వ్యూహాలకు పదునుపెడుతున్నారు. కాంగ్రెస్‌పై పై చేయి సాధించేందుకు బీఆర్ఎస్ పెద్దలు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఖమ్మం నగరంలో ఏర్పాటు చేయడం.. దీన్ని ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొని ఎన్టీఆర్‌పై ప్రశంసల జల్లు కురిపించడం ఇటు తెలంగాణతో పాటు అటు ఏపీ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి