Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Scariest Sound: ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన శబ్ధం.. వింటే వణికిపోవాల్సిందే..

Scariest Sound: దెయ్యాలకు సంబంధించిన సినిమాలను మనం చూస్తూనే ఉంటాం. భయానక పరిస్థితులను ప్రతిబింబించేలా సినిమా బ్యాక్‌డ్రాప్లో చిత్ర విచిత్రమైన, భయానకమైన శబ్దాలను ప్లే చేస్తుంటారు. ఇవి మనల్ని హడలెత్తిస్తుంటాయి. సినినమాలో కొన్నిసార్లు తలుపులు తెరుచుకునే భయంకరమైన శబ్దం, కొన్నిసార్లు ఎవరో అరుస్తున్న శబ్దం..

Scariest Sound: ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన శబ్ధం.. వింటే వణికిపోవాల్సిందే..
Sound
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 29, 2023 | 10:42 PM

Scariest Sound: దెయ్యాలకు సంబంధించిన సినిమాలను మనం చూస్తూనే ఉంటాం. భయానక పరిస్థితులను ప్రతిబింబించేలా సినిమా బ్యాక్‌డ్రాప్లో చిత్ర విచిత్రమైన, భయానకమైన శబ్దాలను ప్లే చేస్తుంటారు. ఇవి మనల్ని హడలెత్తిస్తుంటాయి. సినినమాలో కొన్నిసార్లు తలుపులు తెరుచుకునే భయంకరమైన శబ్దం, కొన్నిసార్లు ఎవరో అరుస్తున్న శబ్దం.. ఇలా దెయ్యం సినిమాలు చాలా భయానకంగా ఉంటాయి. అందుకే ఇలాంటి దెయ్యం సినిమాలను ప్రజలు ఎప్పుడూ ఒంటరిగా కూర్చు చూడలేరు. ఈ సంగతి సినిమాకు సంబంధించినది. దీనిని ఇలా వదిలేస్తే.. నిజ జీవితంలో, రియాలిటీకి వస్తే.. ప్రపంచంలోని అత్యంత భయంకరమైన శబ్దం ఏమిటో మీకు తెలుసా? వాస్తవానికి దీని చరిత్ర చాలా పాతది. 600 సంవత్సరాల కంటే పూర్వమైనది.

డైలీ మెయిల్ నివేదిక ప్రకారం.. ‘అజ్టెక్ డెత్ విజిల్’ అనేది ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ధ్వనిగా పరిగణించడం జరుగుతుంది. దీనిని ‘వెయ్యి శవాల అరుపు’ అని కూడా అంటారు. ఇప్పుడు శాస్త్రవేత్తలు 3D ప్రింటర్ సహాయంతో ఈ భయంకరమైన ధ్వనిని పునఃసృష్టించారు. పుర్రె ఆకారపు విజిల్ రూపకల్పన ఆధారంగా కొత్త విజిల్‌ను సృష్టించారు. దీని శబ్దం వింటే ప్రజల వెన్నులో వణుకు పుట్టాల్సిందే. పుర్రె ఆకారపు విజిల్‌ను అజ్టెక్‌లు గాలి దేవుడైన ఎహెకాట్ల్‌ను గౌరవించే వేడుకలలో ఉపయోగించారని ఒక ప్రచారం.

15 ఏళ్ల తర్వాత బయటపడ్డ షాకింగ్ నిజం..

నివేదికల ప్రకారం, ఈ ‘అజ్టెక్ డెత్ విజిల్’ మెక్సికో నగరంలో కనుగొనడం జరిగింది. వాస్తవానికి, 1999లో, మెక్సికో నగరంలో అజ్టెక్ దేవాలయాన్ని త్రవ్వినప్పుడు, తలలేని అస్థిపంజరం చేతిలో ఈ డెత్ విజిల్ కనుగొనడం జరిగింది. యాక్షన్ ల్యాబ్ జేమ్స్ J., శాస్త్రీయ ప్రయోగాలకు అంకితమైన YouTube ఛానెల్ దీనిని కనుగొంది. ఈ శబ్దం నిజమైన మానవ అరుపు కాదని, అయితే ఈ శబ్దం సహజంగానే ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తుందని ఓర్గిల్ చెప్పారు. పురావస్తు శాస్త్రవేత్తలు మొదట్లో ఇది ఏదో ఒక బొమ్మ అని భావించారు. అందుకే దీని గురించి పెద్దగా పట్టించుకోలేదని, అయితే 15 ఏళ్ల తర్వాత దీనికి సంబంధించిన నిజం బయటపడడంతో అందరూ షాక్‌కు గురయ్యారని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మనుషులు అరుస్తున్నట్లుగా ఉంటుంది..

‘అజ్టెక్ డెత్ విజిల్’ కనిపెట్టిన 15 ఏళ్ల తర్వాత ఓ సైంటిస్ట్ క్యాజువల్ గా విజిల్ ఊదాలని అనుకున్నారని, అయితే దానిపై ఊదగానే భయంకరమైన శబ్ధం వచ్చిందని చెబుతున్నారు. ‘ఇది దిగ్భ్రాంతికరమైన ఆవిష్కరణ, ఎందుకంటే దాని స్వరం మనుషులు అరుస్తున్నట్లుగా ఉంది. ఆ శబ్ధం వింటుంటే ఎవరో విపరీతమైన బాధ, ఆక్రోశంతో ఉన్నట్లుగా అనిపిస్తుంది.’ అని జేమ్స్ జె. ఓర్గిల్ చెప్పుకొచ్చారు.

కారణం ఇప్పటికీ మిస్టరీనే..

అసలు ఈ ‘డెత్ విజిల్’ ఎందుకు అలా శబ్ధం చేస్తుంది అనేది ఇంకా తెలియనప్పటికీ, దీని వెనుక అనేక సిద్ధాంతాలు చెప్పడం జరుగుతుంది. కొంతమంది నిపుణులు అజ్టెక్‌లు బలి ఇచ్చినప్పుడు వారి ఆత్మలు మరణానంతర జీవితానికి ప్రయాణించడంలో సహాయపడటానికి ఈ ధ్వనిని ఉపయోగించారని చెబుతున్నారు. అదే సమయంలో, ఈ ‘డెత్ విజిల్’ యుద్ధం ప్రారంభంలో యోధులు ‘శత్రువుల హృదయాలలో భయాన్ని కలిగించడానికి’ కూడా ఉపయోగించారని ఓర్గిల్ పేర్కొన్నాడు.

మరిన్ని హ్యూమన్‌ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..

వాట్సప్‌లో మరో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. పూర్తి వివరాలు..
వాట్సప్‌లో మరో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. పూర్తి వివరాలు..
కేవలం 1429 రూపాయలకే విమాన ప్రయాణం..! అదిరిపోయే అవకాశం.. త్వరపడండి
కేవలం 1429 రూపాయలకే విమాన ప్రయాణం..! అదిరిపోయే అవకాశం.. త్వరపడండి
మాడు పగిలే ఎండల్లో మంచి వార్త.. ఏపీలో వచ్చే 3 రోజులు జోరున..
మాడు పగిలే ఎండల్లో మంచి వార్త.. ఏపీలో వచ్చే 3 రోజులు జోరున..
స్టార్‌'' లయన్‌ స్కార్‌ఫేస్‌కు కోట్లలో అభిమానులు .. ఎందుకంటే!
స్టార్‌'' లయన్‌ స్కార్‌ఫేస్‌కు కోట్లలో అభిమానులు .. ఎందుకంటే!
మీరూ నిలబడి నీళ్లు తాగుతున్నారా? ఎంత డేంజరో తెలుసా..
మీరూ నిలబడి నీళ్లు తాగుతున్నారా? ఎంత డేంజరో తెలుసా..
తెలివైనోళ్లు తోకముడిచారు.. ఈ ఫోటోలో పామును మీరు కనిపెట్టగలరా.?
తెలివైనోళ్లు తోకముడిచారు.. ఈ ఫోటోలో పామును మీరు కనిపెట్టగలరా.?
ఎరుపు లేదా నలుపు.. వేసవిలో ఎలాంటి కుండ వాడితే మంచిదో తెలుసా..?
ఎరుపు లేదా నలుపు.. వేసవిలో ఎలాంటి కుండ వాడితే మంచిదో తెలుసా..?
గ్రామీణ సాధికారత, ఆరోగ్య బారత్‌గా మార్చడమే లక్ష్యం!
గ్రామీణ సాధికారత, ఆరోగ్య బారత్‌గా మార్చడమే లక్ష్యం!
సలార్ బ్యూటీ శ్రియ రెడ్డి స్టన్నింగ్ ఫోటోలు..
సలార్ బ్యూటీ శ్రియ రెడ్డి స్టన్నింగ్ ఫోటోలు..
ప్రతి రోజూ దానిమ్మ జ్యూస్‌ తాగడం ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా.?
ప్రతి రోజూ దానిమ్మ జ్యూస్‌ తాగడం ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా.?