స్వచ్ఛ సర్వేక్షణ్‌ పురస్కారాల్లో తెలుగు రాష్ట్రాల హవా.. 16 అవార్డులతో రెండో స్థానంలో తెలంగాణ.. ఏపీకి ఎన్నంటే?

ఢిల్లీ తాల్ కటొరా స్టేడియంలో జరిగిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల ప్రధానోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. స్వచ్ఛత, పరిశుభ్రత అంశాల్లో ఉన్నతంగా నిలిచిన మున్సిపాలిటీలు, నగరాల ప్రతినిధులకు అవార్డులు అందజేశారు రాష్ట్రపతి.

స్వచ్ఛ సర్వేక్షణ్‌ పురస్కారాల్లో తెలుగు రాష్ట్రాల హవా.. 16 అవార్డులతో రెండో స్థానంలో తెలంగాణ.. ఏపీకి ఎన్నంటే?
Minister Ktr
Follow us

|

Updated on: Oct 02, 2022 | 8:36 AM

స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుల్లో తెలుగురాష్ట్రాలు మరోసారి సత్తా చాటాయి. తెలంగాణ ఏకంగా 16 అవార్డులు సాధించి రెండో స్థానంలో నిలిచింది. ఇక ఏపీలో కూడా 11 స్థానిక సంస్థలకు అవార్డులు వచ్చాయి. జాతీయస్థాయిలో అవార్డుల పంట పండటంతో అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుల పంట పండింది. ఢిల్లీ తాల్ కటొరా స్టేడియంలో జరిగిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల ప్రధానోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. స్వచ్ఛత, పరిశుభ్రత అంశాల్లో ఉన్నతంగా నిలిచిన మున్సిపాలిటీలు, నగరాల ప్రతినిధులకు అవార్డులు అందజేశారు రాష్ట్రపతి. దేశంలోనే అత్యంత పరిశుభ్ర నగరాల జాబితాలో ఇండోర్‌ తొలి స్థానంలో నిలిచింది. ఈ ఏడాదికి గానూ ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుల్లో వరుసగా ఆరోసారా అగ్రస్థానం కైవసం చేసుకుంది. ఈ లిస్టులో సూరత్‌, నవీ ముంబయి రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.

స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డుల్లో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ చేతుల మీదుగా మంత్రి కేటీఆర్‌ అవార్డు అందుకున్నారు. ఇక తెలంగాణలోని 16 ప‌ట్టణ, స్థానిక సంస్థల‌కు స్వచ్ఛ స‌ర్వేక్షణ్-2022 అవార్డులు దక్కాయి. కార్పొరేటర్లు అవార్డులను అందుకున్నారు. తెలంగాణకి అవార్డులు దక్కడంపై మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

రెండో స్థానంలో తెలంగాణ..

అటు స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌కి కూడా 11 అవార్డులు దక్కాయి. రాష్ట్రపతి చేతుల మీదుగా మంత్రి ఆదిమూలపు సురేష్, పట్టణ, స్థానిక సంస్థల ప్రతినిధులు స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు అందుకున్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా రాష్ట్రానికి అవార్డులు రావడంపై హర్షం వ్యక్తం చేశారు మంత్రి ఆదిమూలపు సురేష్‌. ఇక తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌కు సఫాయిమిత్ర కింద మొదటి ర్యాంక్‌ వచ్చిందన్నారు. క్లీన్‌ మున్సిపాల్టీగా విజయవాడ, క్లీన్‌బిగ్‌ సిటీగా విశాఖకు అవార్డుల దక్కాయి. పులివెందులకు బెస్ట్‌ ఇన్నోవేషన్‌, పుంగనూరుకు బెస్ట్‌ సిటిజన్‌ ఫీడ్‌ బ్యాక్‌ అవార్డులు వచ్చాయి. గార్బేజ్‌ ఫ్రీ సిటీగా విశాఖ,తిరుపతి,విజయవాడకు ఫైవ్‌స్టార్‌ సిటీ అవార్డులు వచ్చాయి. టాప్‌-100లో ఏడు సిటీలు ఉన్నాయి. క్లీన్‌ ఏపీలో భాగంగా గత 3 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఆధారంగా కేంద్రం అవార్డులు ఇచ్చింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి