Crime news: లిఫ్ట్ ఇస్తానని కారు ఎక్కించుకున్నాడు.. చంపుతానని బెదిరించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు
సమాజంలో మహిళలపై రోజురోజుకు నేరాలు(crime) పెరుగుతూనే ఉన్నాయి. నిత్యం ఎక్కడో చోట అత్యాచార ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నవారు సైతం దురాగతాలకు పాల్పడటం...
సమాజంలో మహిళలపై రోజురోజుకు నేరాలు(crime) పెరుగుతూనే ఉన్నాయి. నిత్యం ఎక్కడో చోట అత్యాచార ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నవారు సైతం దురాగతాలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి, వారు సన్మార్గంలో పయనించేలా చూడాల్సిన గురువులే గాడి తప్పుతున్నారు. విచక్షణ కోల్పోయి లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. విద్యార్థులు, తోటి ఉపాధ్యాయులు అనే తేడా చూడకుండా అమానుష చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా మహబూబాబాద్(Mahabubabad) జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. చంపుతానని బెదిరించి ఓ మహిళా టీచర్(Teacher) పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు తోటి ఉపాధ్యాయుడు. అతను ఓ సంఘం మండల అధ్యక్షుడిగా ఉండడం గమనార్హం. చంపుతానని బెదిరించి, సెల్ ఫోన్ లాక్కొని పరారయ్యాడు. తెలంగాణలోని ఖమ్మంలో నివసించే బాణోత్ కిశోర్ మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం అంకన్నగూడెం పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. అతని భార్య కూడా ఉపాధ్యాయురాలే కావడంతో వారిద్దరూ కారులో పాఠశాలకు వెళ్లేవారు. అదే మండలంలో పనిచేస్తూ ఖమ్మంలో నివసించే ఓ ఉపాధ్యాయురాలు డోర్నకల్ వరకు ప్యాసింజర్ రైలులో వెళ్లి, అక్కడి నుంచి స్కూటీపై స్కూల్ కు వెళ్లేది.
ఈనెల 16 నుంచి ఒంటిపూట పాఠశాలలు నడుస్తున్నాయి. 17న పాఠశాలకు వెళ్లిన ఉపాధ్యాయురాలు ఇంటికి వచ్చేందుకు డోర్నకల్ రైల్వేస్టేషనులో ట్రైన్ కోసం వేచి చూస్తున్నారు. ఇదే సమయంలో కిశోర్ కుమార్ ఆమె వద్దకు వెళ్లి, కారులో వెళ్దామని, తన భార్య కూడా వస్తోందని చెప్పి ఆ టీచర్ ను కారు ఎక్కించుకున్నాడు. మార్గమధ్యంలో ఆమెపై దాడి చేసి, చంపుతానని బెదిరించి సెల్‌ఫోన్ లాక్కున్నాడు. పాండురంగాపురంలోని ఓ ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే భర్తను, పిల్లలను చంపుతానని బెదిరించాడు. దీంతో బాధితురాలు ఆ విషయం ఎవరికీ చెప్పలేదు. అయితే తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె.. ఈ విషయాన్ని తన భర్తకు తెలిపారు. అనంతరం భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న కిశోర్ కోసం గాలిస్తున్నారు.
Also Read
Supreme Court: కరోనా మరణానికి పరిహారం క్లెయిమ్‌లపై కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Viral Video:సాయం చేయడానికి సైజ్‌తో పనిలేదు.. పిల్ల తాబేలు చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు..
Ambrane Fitshot Surge: మార్కెట్లోకి మరో బడ్జెట్ స్మార్ట్ వాచ్.. రూ. 2వేల లోపు ఆకట్టుకునే ఫీచర్లు..