- Telugu News Photo Gallery Technology photos Ambrane Launches new smart watch Ambrane Fitshot Surge smart watch price and features
Ambrane Fitshot Surge: మార్కెట్లోకి మరో బడ్జెట్ స్మార్ట్ వాచ్.. రూ. 2వేల లోపు ఆకట్టుకునే ఫీచర్లు..
Ambrane Fitshot Surge: భారత మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్ వాచ్ వచ్చేసింది. ఆంబ్రేస్ కంపెనీ 'ఫిట్‌షాట్ సర్జ్' పేరుతో కొత్త వాచ్‌ను విడుదల చేసింది. తక్కువ బడ్జెట్‌లో అధునాతన ఫీచర్లు ఈ వాచ్ సొంతం..
Updated on: Mar 24, 2022 | 10:30 AM

మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్ వాచ్ వచ్చేసింది. ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం ఆంబ్రేస్ 'ఫిట్‌షాట్ సర్జ్' పేరుతో కొత్త స్మార్ట్ వాచ్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వాచ్ ఫ్లిప్ కార్ట్‌లో లభిస్తోంది.

రూ. 1,999కి అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ వాచ్‌ను రస్ట్ ప్రూఫ్ జింక్ అల్లాయ్ బాడీ, తేలికపాటి డిజైన్‌తో రూపొందించారు. ఇందులో ఐపీ68 రేటెడ్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌ను అందించారు.

ఇక ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 1.28 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. 24×7 రియల్ టైమ్ హెల్త్ ట్రాకింగ్‌కు సపోర్ట్ చేయడం దీని ప్రత్యేకత. ఈ స్మార్ట్‌వాచ్ సహాయంతో Spo2, రక్తపోటు, స్లీప్, పెడోమీటర్, బ్రీత్ ట్రైనింగ్, స్ట్రెస్ మానిటరింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

స్మార్ట్ నోటిఫికేషన్‌లు, అలారం, స్టాప్‌వాచ్, వెదర్ అప్‌డేట్, ఎన్ని క్యాలరీలు ఖర్చయ్యాయి వంటి ఫీచర్లతో పాటు ఫిజికల్ యాక్టివిటీ హిస్టరీని సైతం రికార్డు చేసుకోవచ్చు.

ఇక ఈ స్మార్ట్ వాచ్‌లో ప్రత్యేకంగా వాయిస్ అసిస్టెంట్ ఫీచర్‌ను అందిస్తున్నారు. బ్లూటూత్ ద్వారా ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 7 రోజుల బ్యాటరీ వస్తుంది.




