Supreme Court: కరోనా మరణానికి పరిహారం క్లెయిమ్‌లపై కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
కరోనా వైరస్‌తో మరణించినప్పుడు తప్పుడు క్లెయిమ్‌లు దాఖలు చేయడంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
Supreme Court on Corona Deaths: కరోనా వైరస్‌తో మరణించినప్పుడు తప్పుడు క్లెయిమ్‌లు దాఖలు చేయడంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మరణానికి పరిహారం పొందేందుకు తప్పుడు క్లెయిమ్‌లు దాఖలు చేశారన్న ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి అనుమతినిచ్చింది. దీని కింద ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, కేరళలో దాఖలైన క్లెయిమ్‌లలో ఐదు శాతం సమీక్షించాలని నిర్ణయించింది. కరోనా కారణంగా మరణానికి పరిహారం క్లెయిమ్ చేయడానికి కోర్టు మార్చి 28 వరకు 60 రోజులు నిర్ణయించింది. అదే సమయంలో, భవిష్యత్తులో మరణానికి పరిహారం పొందడానికి, 90 రోజులలోపు దావా వేయవలసి ఉంటుంది.
అంతకుముందు సోమవారం కూడా ఈ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా, కోవిడ్ 19 కారణంగా మరణిస్తే అధికారుల నుండి పరిహారం చెల్లించడానికి కేంద్రం ఇచ్చిన నాలుగు వారాల గడువు సరిపోదని సుప్రీంకోర్టు పేర్కొంది. మృతుల కుటుంబాలు వారి సమీప బంధువును కోల్పోయిన కారణంగా ఈ సమయం వరకు ఆందోళన చెందుతాయని కోర్టు పేర్కొంది. అటువంటి పరిస్థితిలో వారు దరఖాస్తు చేసుకోవడం కష్టం అవుతుంది. వాస్తవానికి, న్యాయమూర్తులు MR షా, BV నాగరత్నలతో కూడిన ధర్మాసనం నిర్ణీత తేదీలో పరిహారం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులైన వ్యక్తులందరికీ 60 రోజులు, భవిష్యత్తులో హక్కుదారులకు 60 రోజులు గడువు ఇవ్వాలని సూచించింది.
Supreme Court allows Centre to probe fake ex-gratia claims on the death of kin due to COVID-19; says Centre can verify 5% of claims in 4 states which had a wide difference between number of claims and recorded deaths. States are Andhra Pradesh, Maharashtra, Gujarat and Kerala
— ANI (@ANI) March 24, 2022
విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. “పరిహారం క్లైయిమ్ చేసుకునేందుకు నాలుగు వారాలు బహుశా సరైన సమయం కాదు, ఎందుకంటే సంబంధిత కుటుంబాలు వేదనలో ఉంటాయి.” మరణం సంభవిస్తే, ఆ కుటుంబం ఆ బాధ నుండి కోలుకోవడానికి సమయం పడుతుంది. ఆ తర్వాత మాత్రమే వారు దావా వేస్తారుని పేర్కొంది. విపత్తు నిర్వహణ చట్టం, 2005 ప్రకారం జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీకి అధికారాలు ఇచ్చినందున, కోవిడ్ 19 కారణంగా మరణానికి పరిహారం బూటకపు క్లెయిమ్‌లను కనుగొనాలని కూడా అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. నకిలీ క్లెయిమ్‌లను ధృవీకరించడానికి సర్వేల నమూనాను కోరుతూ కేంద్రం చేసిన విజ్ఞప్తికి సంబంధించి, మరణాలు, క్లెయిమ్‌ల నమోదులో వైవిధ్యం ఉన్న రెండు మూడు రాష్ట్రాలపై దృష్టి పెట్టవచ్చని ధర్మాసనం తెలిపింది.
వాస్తవానికి, కోవిడ్ 19 కారణంగా మరణించిన వారిపై పరిహారం చెల్లింపును క్లెయిమ్ చేయడానికి నాలుగు వారాల గడువును నిర్ణయించాలని అధికారులను అభ్యర్థిస్తూ కేంద్రం ఒక దరఖాస్తును దాఖలు చేసింది. దీనిపై ఈరోజే నిర్ణయం వెలువడింది. కోవిడ్ 19 కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు రూ. 50,000 పరిహారం కోసం తప్పుడు క్లెయిమ్‌లపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇది దుర్వినియోగం అవుతుందని తాను ఎప్పుడూ ఊహించలేదని, నైతికత స్థాయి ఇంత దిగజారదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
Read Also…. AP CM YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు నాంపల్లి కోర్ట్ సమన్లు.. ఈనెల 28న హాజరు కావాలని ఆదేశం