AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అల్లుడు అడిగింది ఇవ్వనందుకు అత్తమామలపై కాల్పులు..

మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలంలోని సాలిగాం గ్రామంలో ఫిబ్రవరి 27 న పిస్టల్‎తో గోమాస నరేందర్ అనే వ్యక్తి అత్తమామలపై కాల్పులు జరిపిన సంఘటనను పోలీసులు చేదించారు. బుధవారం కాల్పులకు పాల్పడిన నరేందర్ ను పోలీసులు ఎట్టకేలకు పట్టుకొని అతని వద్ద నుండి పిస్టల్, ఆరు బుల్లెట్లు, రెండు వాడిన ఖాళీ తూటాలతో పాటు సెల్ ఫోన్, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

అల్లుడు అడిగింది ఇవ్వనందుకు అత్తమామలపై కాల్పులు..
Son In Law Shout At Aunt And Uncle
Naresh Gollana
| Edited By: Srikar T|

Updated on: Mar 01, 2024 | 10:02 PM

Share

మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలంలోని సాలిగాం గ్రామంలో ఫిబ్రవరి 27 న పిస్టల్‎తో గోమాస నరేందర్ అనే వ్యక్తి అత్తమామలపై కాల్పులు జరిపిన సంఘటనను పోలీసులు చేదించారు. బుధవారం కాల్పులకు పాల్పడిన నరేందర్ ను పోలీసులు ఎట్టకేలకు పట్టుకొని అతని వద్ద నుండి పిస్టల్, ఆరు బుల్లెట్లు, రెండు వాడిన ఖాళీ తూటాలతో పాటు సెల్ ఫోన్, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను బెల్లంపల్లి ఏసీపి రవికుమార్ వెల్లడించారు.

కట్నం విషయంలో తలెత్తిన విభేదాల వల్ల అత్తమామలపై కోపం పెంచుకుని నరేందర్ ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలిపారు. అత్తమామలను చంపేందుకు బీహార్‎లో పిస్టల్ కొనుగోలు చేసినట్లు తెలిపారు. బెల్లంపల్లి మండలం మాల గురిజాలకు చెందిన నరేందర్, అదే గ్రామానికి చెందిన మహేష్‎తో కలిసి సాలిగాం గ్రామంలో కాల్పులకు పాల్పడినట్లు చెప్పారు. ఆ తర్వాత నిందితుడు నరేందర్ మాల గురజాల గ్రామంలో తన ఇంటికి వచ్చి అక్కడే ఉన్నాడని తెలిపారు. శుక్రవారం మాల గురజాల నుండి కరీంనగర్ వెళ్తుండగా బెల్లంపల్లిలో చాకచక్యంగా పట్టుకున్నట్టు వివరించారు. కాగా మరో వ్యక్తి మహేష్ పరారీలో ఉన్నట్లు ఏసిపి రవికుమార్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..