AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: జైలు నుంచి బయటకు వచ్చి తిరిగి అదే పని చేస్తూ దొరికిపోయిన వృద్దుడు..

మేడ్చల్ జిల్లా దుండిగల్ పి.యస్ పరిధిలో పెద్దమొత్తంలో గంజాయి పట్టివేత. గండిమైసమ్మ చౌరస్తాలో దుండిగల్ పోలీసులు మేడ్చల్ SOT పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఓ స్వీట్ బాక్స్‎లో అక్రమ రవాణా చేస్తున్న సుమారు లక్ష రూపాయల విలువ గల ఒక లీటరు హాషిష్ ఆయిల్ (గంజాయి ఆయిల్ )ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 71 సంవత్సరాల వృద్దుడు రవాణా చేస్తున్నట్లు తెలిపారు. ఇతనిపై గతంలో కూడా కేసులు ఉన్నట్లు తెలిపారు.

Crime News: జైలు నుంచి బయటకు వచ్చి తిరిగి అదే పని చేస్తూ దొరికిపోయిన వృద్దుడు..
Ganja oil
Noor Mohammed Shaik
| Edited By: Srikar T|

Updated on: Mar 01, 2024 | 5:58 PM

Share

మేడ్చల్ జిల్లా దుండిగల్ పి.యస్ పరిధిలో పెద్దమొత్తంలో గంజాయి పట్టివేత. గండిమైసమ్మ చౌరస్తాలో దుండిగల్ పోలీసులు మేడ్చల్ SOT పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఓ స్వీట్ బాక్స్‎లో అక్రమ రవాణా చేస్తున్న సుమారు లక్ష రూపాయల విలువ గల ఒక లీటరు హాషిష్ ఆయిల్ (గంజాయి ఆయిల్ )ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 71 సంవత్సరాల వృద్దుడు రవాణా చేస్తున్నట్లు తెలిపారు. ఇతనిపై గతంలో కూడా కేసులు ఉన్నట్లు తెలిపారు. గంజాయి నూనె తరలిస్తున్న పాత నేరస్థుడిని అరెస్టు చేసి రిమాండ్‎కు తరలించారు. పోలీసుల విచారణలో నిందితుడు కుర్రు శంకర్ రావు గా గుర్తించారు. నిందితుడు అనకాపల్లికి చెందిన వాడిగా తెలిపారు.

దుండిగల్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని గండిమైసమ్మ ఆలయం వద్ద అనుమానంగా తిరుగుతుండగా మేడ్చల్ SOT టీమ్ అతనిని పట్టుకుని విచారించింది. ఎవరికీ అనుమానం రాకుండా కొత్త తరహలో నేరానికి పాల్పడినట్లు వెల్లడించారు పోలీసులు. స్వీట్ బాక్స్‎లో దాచిన రూ 1,00,000 విలువగల ఒక లీటర్ హశీష్ ఆయిల్ పట్టుకోవడం జరిగిందని వివరించారు. 2019లో నిందితుడు 744.2 కిలోల గంజాయితో రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర NCB అధికారులకు పట్టుబడినట్లు, అతనిని అరెస్ట్ చేసినట్లు రికార్డుల్లో ఉందని పేర్కొన్నారు. 4 సంవత్సరాల 7 నెలలు జైలు జీవితం గడిపి గత అక్టోబర్‎లో విడుదలై మళ్లీ ఈ రోజు హాషీష్ ఆయిల్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడినట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..