AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఆటోలో వచ్చిన ఇద్దరు మహిళలు.. నిర్మానుష్య ప్రాంతాల్లో ఏం చేశారంటే..

పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన మగ శిశువును విసిరి పారేసి ఆటోలో వెళ్లిపోయారు ఇద్దరు మహిళలు. గమనించిన స్థానికులు తీవ్ర గాయాలు పాలైన శిశువును నిలోఫర్ హాస్పిటల్‎కు తరలించారు. 9 మాసాలు మోసి.. కని.. చివరకు చేతికందిన ముక్కుపచ్చలారని పసిబిడ్డలను చెత్త కుండీల పాలు చేస్తున్నారు కొందరు తల్లులు. అప్పుడే పుట్టిన బిడ్డలపై కర్కశంగా ప్రవర్తిస్తున్నారు.

Hyderabad: ఆటోలో వచ్చిన ఇద్దరు మహిళలు.. నిర్మానుష్య ప్రాంతాల్లో ఏం చేశారంటే..
Baby In Garbage
Peddaprolu Jyothi
| Edited By: Srikar T|

Updated on: Mar 01, 2024 | 5:58 PM

Share

పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన మగ శిశువును విసిరి పారేసి ఆటోలో వెళ్లిపోయారు ఇద్దరు మహిళలు. గమనించిన స్థానికులు తీవ్ర గాయాలు పాలైన శిశువును నిలోఫర్ హాస్పిటల్‎కు తరలించారు. 9 మాసాలు మోసి.. కని.. చివరకు చేతికందిన ముక్కుపచ్చలారని పసిబిడ్డలను చెత్త కుండీల పాలు చేస్తున్నారు కొందరు తల్లులు. అప్పుడే పుట్టిన బిడ్డలపై కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. గర్భాంధకారం నుంచి బయటకు వచ్చిన పసికందు మెహం కూడా చూడకుండా చెత్త కుండలో పడేస్తున్నారు. పిల్లలను తల్లి నుండి దూరం చేసి కొందరు సొమ్ము చేసుకుంటే.. మరికొంత మంది చెత్త కుండీల పాలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. అప్పుడే పుట్టిన చిన్నారులను ప్రేమ, దయ లేకుండా చెత్త కుప్పలలో వదిలేసి వెళ్తున్నారు తల్లిదండ్రులు.

తాజాగా పాతబస్తీలోని మాదన్నపేట పొలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. చావుని షా కాలనీలోని ఓ శ్మశానవాటికలో అప్పుడే పుట్టిన మగశిశువును ఇద్దరు మహిళలు ఆటోలో వచ్చి విసిరి పారేశారు. అక్కడే ఉన్న కొంతమంది వ్యక్తులు శిశువును చూసి పోలీసులకు సమాచారం అందించారు. శిశువును విసిరి పారేయడంతో తీవ్ర గాయాలు పాలవ్వగా చికిత్స నిమిత్తం నిలోఫర్ హాస్పిటల్‎కు తరలించారు. అయితే ఆటోలో వచ్చిన ఆ ఇద్దరు మహిళలు ఎవరు అనే దానిపై పోలీసులు ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. పసికందును చూసినటువంటి స్థానికులు పారేసి వెళ్లిన మహిళలను కఠిన శిక్షించాలి అని కోరుతున్నారు.

ఇటీవల కాలంలో ముళ్ల పొదల్లో అప్పుడే పుట్టిన పుట్టిన ఆడశిశువును పడేసిన గుర్తు తెలియని వ్యక్తులు.. ఆ పసిబిడ్డను కుక్కలు పీక్కోని తినగా తల మొండెం వేరు అయ్యాయి. తల భాగం కాలనిలో పడేసిన కుక్కులు అది చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎవరు లేని సమయంలో నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో చిన్నారిని పడేయడమే కాకుండా గుట్టుచప్పుడు కాకుండా వెళ్లిపోయారు. చిన్నారి తల భాగం చూసిన స్థానికులు తల్లిదండ్రులపై తీవ్ర ఆగ్రహన్ని వ్యక్తం చేశారు. తరుచూ ఇలాంటి ఘటనలు ఎక్కడో ఒక చోట జరుగుతూ ఉంటడంతో కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను విజ్ఞప్తి చేస్తున్నారు స్థానికులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..