Hyderabad: పరీక్ష రాసేందుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. ట్రాఫిక్ పోలీస్ ఏం చేశాడంటే..

రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులను అనుమతించడం లేదు సిబ్బంది. దీంతో సుదూర ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులు కాస్త ముందుగానే పరీక్ష కేంద్రాలకు తరలి వస్తున్నారు. అయితే పరీక్షలు రాసేందుకు వస్తున్న ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని రోడ్డు ప్రమాదానికి గురైంది.

Hyderabad: పరీక్ష రాసేందుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. ట్రాఫిక్ పోలీస్ ఏం చేశాడంటే..
Mahankali Market Traffic Po
Follow us

| Edited By: Srikar T

Updated on: Mar 01, 2024 | 6:44 PM

రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులను అనుమతించడం లేదు సిబ్బంది. దీంతో సుదూర ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులు కాస్త ముందుగానే పరీక్ష కేంద్రాలకు తరలి వస్తున్నారు. అయితే పరీక్షలు రాసేందుకు వస్తున్న ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని రోడ్డు ప్రమాదానికి గురైంది. దీంతో అక్కడే ఉన్న మహంకాళీ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఉపాశంకర్ మానవత్వం చాటుకున్నారు. ఆ విద్యార్థినికి ప్రథమ చికిత్స చేసి పరీక్షా కేంద్రానికి సరైన సమయంలో తీసుకెళ్లి మంచితనాన్ని చాటుకున్నారు .

రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు భద్రత నడుమ జరుగుతున్నాయి. దీంతో పరీక్షా కేంద్రాలకు సరైన సమయంలో వెళ్లేందుకు చాలామంది విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి హడావుడిగా పరీక్షా కేంద్రాలకు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షలు రాసేందుకు వస్తున్న ఓ విద్యార్థుని రోడ్డు ప్రమాదానికి గురైంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని తన తండ్రితో కలిసి బైక్‎పై వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‎కు చెందిన విద్యార్థిని తండ్రితో కలిసి వస్తుండగా సికింద్రాబాద్ ఎంజీ రోడ్డు మార్గంలో ఉన్న ఒక కళాశాల వద్ద బైక్ అదుపుతప్పడంతో తండ్రి కూతురు కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో విద్యార్థిని తలకు గాయాలు అయ్యాయి. రక్తం కారుతున్నా పరీక్ష రాసేందుకు వచ్చినా విద్యార్థిని గుర్తించారు పోలీసులు. గాయాల పాలైనప్పటికీ పరీక్ష రాయాలని వచ్చిన విద్యార్థినికి తోడుగా నిలిచి తమ ఫ్రెండ్లీ పోలీసింగ్‎ని చాటుకున్నారు సికింద్రాబాద్ మహంకాళి ట్రాఫిక్ పోలీసులు. ఎగ్జామినేషన్ సెంటర్ ప్రిన్సిపల్ అనుమతితో ఇన్స్పెక్టర్ తన పోలీసు వాహనం లో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన విద్యార్థినికి సుమారు 7 కుట్లు వేసి చికిత్స చేసారు అనంతరం ఆమెను సరైన సమయానికి తిరిగి ఎగ్జామినేషన్ సెంటర్‎కు పంపించారు. ట్రాఫిక్ పోలీసులు అందించిన సహాయంపై విద్యార్థిని ఆనందం వ్యక్తం చేయగా.. ఆమె తండ్రి మహంకాళి ఇన్స్పెక్టర్‎కు కృతజ్ఞతలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
పాము కాటుతో చనిపోయిన వ్యక్తిని గంగా నదిలో వేలాడదీసిన గ్రామస్తులు
పాము కాటుతో చనిపోయిన వ్యక్తిని గంగా నదిలో వేలాడదీసిన గ్రామస్తులు
మీరు ఆధార్‌ కార్డుతో మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలి?
మీరు ఆధార్‌ కార్డుతో మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలి?
భారత పర్యటనకు దక్షిణాఫ్రికా.. షెడ్యూల్ ఖరారు..డేట్స్, వేదికలు ఇవే
భారత పర్యటనకు దక్షిణాఫ్రికా.. షెడ్యూల్ ఖరారు..డేట్స్, వేదికలు ఇవే
రాముడి ఆశీర్వాదం కోసం అయోధ్యకు మోదీ.. షెడ్యూల్ ఇదే!
రాముడి ఆశీర్వాదం కోసం అయోధ్యకు మోదీ.. షెడ్యూల్ ఇదే!
టాప్ 4కి దడ పుట్టిస్తోన్న బెంగళూరు.. రసవత్తరంగా ప్లేఆఫ్ రేసు..
టాప్ 4కి దడ పుట్టిస్తోన్న బెంగళూరు.. రసవత్తరంగా ప్లేఆఫ్ రేసు..
ఎండలు బాబోయ్ ఎండలు.. కారును రక్షించుకోవడమే పెద్ద టాస్క్
ఎండలు బాబోయ్ ఎండలు.. కారును రక్షించుకోవడమే పెద్ద టాస్క్
ప్రభాస్ ఎవరు..? అని అడిగారు.. డార్లింగ్ పై రానా కామెంట్స్..
ప్రభాస్ ఎవరు..? అని అడిగారు.. డార్లింగ్ పై రానా కామెంట్స్..
ఏనుగు మంచి మనసు.. ఎండలో అలసిపోయిన యజమాని కోసం ఏం చేసిందంటే..
ఏనుగు మంచి మనసు.. ఎండలో అలసిపోయిన యజమాని కోసం ఏం చేసిందంటే..
ఆ నిర్మాత చాలా వేధించాడు.. బుల్లితెర నటి
ఆ నిర్మాత చాలా వేధించాడు.. బుల్లితెర నటి
సిబిల్‌ లేదని బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదా? ఇలా చేస్తే లోన్‌..
సిబిల్‌ లేదని బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదా? ఇలా చేస్తే లోన్‌..