Hyderabad Police: బెంగళూరు పేలుడు ఎఫెక్ట్.. హైదరాబాద్ పోలీస్ హైఅలర్ట్

బెంగళూరులోని ప్రముఖ రెస్టారెంట్ రామేశ్వరం కేఫ్ లో పేలుడు సంభవించడంతో హైదరాబాద్ పోలీసులు సిటీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రజల్లో ధైర్యం నింపేందుకు పోలీసులు నగరంలోని రద్దీ ప్రాంతాల్లో వాహన తనిఖీలు, గస్తీ నిర్వహిస్తున్నారు. నగరంలోని రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, రద్దీ ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించాలని పోలీసు ఉన్నతాధికారులు తమ సిబ్బందిని ఆదేశించారు.

Hyderabad Police: బెంగళూరు పేలుడు ఎఫెక్ట్.. హైదరాబాద్ పోలీస్ హైఅలర్ట్
Hyderabad Police
Follow us

|

Updated on: Mar 01, 2024 | 10:03 PM

బెంగళూరులోని ప్రముఖ రెస్టారెంట్ రామేశ్వరం కేఫ్ లో పేలుడు సంభవించడంతో హైదరాబాద్ పోలీసులు సిటీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రజల్లో ధైర్యం నింపేందుకు పోలీసులు నగరంలోని రద్దీ ప్రాంతాల్లో వాహన తనిఖీలు, గస్తీ నిర్వహిస్తున్నారు. సిటీలోని  రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, రద్దీ ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించాలని పోలీసు ఉన్నతాధికారులు తమ సిబ్బందిని ఆదేశించారు. బాంబు డిటెక్షన్ స్క్వాడ్ లు స్నిఫర్ డాగ్స్ తో కలిసి నగరంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. నగరంలోని కీలక స్థావరాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

కాగా బెంగళూరు పేలుడు ఘటనతో అక్కడి పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఆర్జీఐ ఎయిర్ పోర్ట్.. రక్షణ స్థావరాలను కాపలా కాస్తున్న సీఐఎస్ఎఫ్ తన భద్రతా యంత్రాంగాన్ని కట్టుదిట్టం చేసింది. తక్కువ తీవ్రత కలిగిన ఇంప్రూవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ) పేలుడుకు కారణమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ధృవీకరించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నాం. అది పేలుడు ఎవరు చేశారో తెలియదు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. పరిస్థితిని సమీక్షించాలని హోంమంత్రిని కోరాను’ అని ఆయన మైసూరులో విలేకరులతో అన్నారు.

ఇది భారీ పేలుడు పదార్థం కాదని,  బాంబ్ బ్లాస్టేనని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ ఘటనను రాజకీయం చేయొద్దని, మంగళూరులో బీజేపీ ప్రభుత్వ హయాంలో కర్ణాటకలో జరిగిన చివరి పేలుడును సిద్ధరామయ్య గుర్తు చేశారు.