TSPSC: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజ్‌లో ఎన్ని సిత్రాలో.. ప్రియురాలి కోసం డీఏవో పేపర్‌ కొనుగోలు చేసిన ప్రియుడు.

టీఎస్‌పీఎస్సీ కేసులో రోజుకో సిత్రం బయటపడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ప్రశ్న ప్రతాల లీకేజ్‌ వ్యవహారంలో సిట్ దూకుడుగా విచారణ చేస్తోంది. దీంతో లీకేజ్‌ కేసులో అరెస్టుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. కేసులో భాగంగా ఇప్పటికే 17 మందిని అరెస్ట్‌ చేయగా, తాజాగా మరో...

TSPSC: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజ్‌లో ఎన్ని సిత్రాలో.. ప్రియురాలి కోసం డీఏవో పేపర్‌ కొనుగోలు చేసిన ప్రియుడు.
Tspsc Paper Leak
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 07, 2023 | 6:57 PM

టీఎస్‌పీఎస్సీ కేసులో రోజుకో సిత్రం బయటపడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ప్రశ్న ప్రతాల లీకేజ్‌ వ్యవహారంలో సిట్ దూకుడుగా విచారణ చేస్తోంది. దీంతో లీకేజ్‌ కేసులో అరెస్టుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. కేసులో భాగంగా ఇప్పటికే 17 మందిని అరెస్ట్‌ చేయగా, తాజాగా మరో ఇద్దరిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. లౌలిక్‌, సుస్మిత అనే ఇద్దరిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.

లౌకిక్‌ అనే వ్యక్తి తన ప్రేయసి సుస్మిత కోసం ప్రశ్నా పత్రాన్ని కొనుగోలు చేశారు. ఇందులో భాగంగా ప్రవీణ్‌ నుంచి లౌకిక్‌ డీఏవో ఎగ్జామ్‌ పేపర్‌ను కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. కస్టడీలో ఉన్న నిందుతులిచ్చిన సమాచారం ఆధారంగా అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. ప్రియురాలు సుష్మిత కోసం డీఏఓ పేపర్‌ను రూ. 6 లక్షలకు కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. ప్రవీణ్ బ్యాంక్ స్టేట్మెంట్స్ ను పరిశీలించడంతో బయటపడ్డ ఇద్దరి బాగోతం. రూ. 6 లక్షలు అనుమస్పద లావాదేవీలు గుర్తించి కూపిలాగిన సిట్. సిట్ దర్యాప్తు లో లౌకిక్, సుష్మిత వ్యవహారం బయటపడింది.

డీఏఓ పరీక్షను ఫిబ్రవరి 26వ తేదీన నిర్వహించారు. అయితే పేపర్‌ లీకేజ్‌ జరిగిన నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ ఈ పరీక్షను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మరి విచారణ పూర్తయ్యేలోపు ఇంకా ఎంత మంది పేర్లు బయటకు వస్తాయో చూడాలి. ఇదిలా ఉంటే టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ కేసులో ఎఫ్ఎస్ఎల్ నివేదిక పోలీసులకు చేరిన విషయం తెలిసిందే. ప్రవీణ్, రాజశేఖర్, రేణుక నుంచి సీజ్ చేసిన సెల్‌ఫోన్లను ఎఫ్‌ఎస్‌ఎల్‌కు అధికారులు పంపించారు. ప్రవీణ్, రాజశేఖర్ లాప్టాప్, సిస్టమ్స్‌ను కూడా అధికారులు పంపించారు. ఈ నెల 11న కోర్టులో కేసు నివేదికను సిట్ సమర్పించనుంది. ఎన్నారై ప్రశాంత్‌కు మరోసారి సిట్ నోటీసులు జారీ చేయనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ