Hyderabad: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని కబళించిన ఆన్ లైన్ గేమ్స్.. అతడి సూసైడ్ నోట్ చదివితే కన్నీళ్లాగవు

ఆన్‌లైన్ గేమ్స్ ప్రాణాలు తీస్తున్నాయి.. అదృష్టం కలిసి వస్తోందన్న భ్రమలో.. వాటికి బానిసలై ఆర్థికంగా దివాలా తీస్తున్నారు. ఆపై.. చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

Hyderabad: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని కబళించిన ఆన్ లైన్ గేమ్స్.. అతడి సూసైడ్ నోట్ చదివితే కన్నీళ్లాగవు
Varadha Shiva (File Photo)
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 07, 2023 | 6:46 PM

హైదరాబాద్‌ కుషాయిగూడ పరిధిలో ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడి.. అప్పులపాలు కావడంతో వాటిని తీర్చలేక ఓ యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తున్న వరద శివ అనే యువకుడు.. ఆన్‌లైన్‌ గేమ్స్‌కు అలవాటు పడి బలవన్మరణానికి పాల్పడడం తీవ్ర విషాదాన్ని నింపింది. అణు ఇంధన సంస్థలో ఏడేళ్లుగా వర్క్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వరద శివ.. కుషాయిగూడ పరిధిలోని డీఏఈ కాలనీ నివాసం ఉంటున్నాడు. శివ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రొద్దుటూరు కాగా.. మూడేళ్ల క్రితం వివాహమైంది. అతనికి భార్య ప్రభాత, ఏడాదిన్నర వయసున్న కొడుకు వేదాంష్‌ ఉన్నారు. అయితే.. పంటి నొప్పితో బాధపడుతున్న భార్యను చికిత్స నిమిత్తం కొద్దిరోజుల క్రితం.. ఆమె సొంతూరైన జోగులాంబ జిల్లాలోని గద్వాలకు పంపించాడు.

ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడే అలవాటున్న శివకు అదే శాపంగా మారింది. లక్షల్లో డబ్బు పోగొట్టుకుని అప్పుల్లో కూరుకుపోయేలా చేసింది. దాంతో.. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో బుధవారం ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. రాత్రివేళ భర్తకు ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో ఆమె.. సెక్యూరిటీకి సమాచారం ఇచ్చింది. ఆయన తలుపులు పగలకొట్టి చూడగా అప్పటికే శివ మృతిచెంది ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. గదిలోని సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. వరద శివ ఆత్మహత్యకు పాల్పడిన గదిలో ఓ సూసైడ్‌ నోట్‌ లభ్యమైంది. చనిపోతూ కొడుకు గురించి రాసిన లేఖ పలువుర్ని కంటతడి పెట్టిస్తోంది. వేదాంష్‌.. నీకోసం ఏమీ చేయలేకపోతున్నా.. నా బ్రెయిన్‌ను కంట్రోల్‌ చేసుకోలేకపోతున్నా.. నా చావుకు నేనే కారణం.. స్నేహితులు, కుటుంబ సభ్యులు నన్ను క్షమించాలి.. నాకు వేరే దారి లేక ఈ నిర్ణయం తీసుకున్నాను.. క్షమించాలి.. అంటూ వరద శివ.. సూసైడ్‌ నోట్‌లో రాసిన మాటలే అతని చివరి మాటలు అయ్యాయి.

ఇక.. శివ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడుతూ 8 లక్షలు అప్పు చేస్తే తామే తీర్చామని, స్మార్ట్ ఫోన్‌ తీసుకుని చిన్న ఫోన్ ఇచ్చినా మార్పు రాలేదంటున్నారు శివ కుటుంబ సభ్యులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..