Hyderabad: గుడ్ న్యూస్ అంటే ఇది కదా.. మరో 13 ప్రాంతాలకు ఎంఎంటీఎస్. శనివారం నుంచే అందుబాటులోకి
హైదరాబాదీలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చేసింది. ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించనున్నారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఎంఎంటీఎస్ రెండో దశ మొదలు కానుంది. నగర నలుమూలల నుంచి తక్కువ ఖర్చుతో ప్రయణించే అవకాశం...
హైదరాబాదీలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చేసింది. ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించనున్నారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఎంఎంటీఎస్ రెండో దశ మొదలు కానుంది. నగర నలుమూలల నుంచి తక్కువ ఖర్చుతో ప్రయణించే అవకాశం దక్కనుంది. రెండో దశ ఎంఎంటీఎస్‌తో కొత్తగా 13 ప్రాంతాల ప్రజలకు మేలు జరగనుంది.
ప్రధాని రెండోదశ ఎంఎంటీఎస్‌ను లాంఛనంగా ప్రారంభించి మేడ్చల్-సికింద్రాబాద్-ఉందానగర్, మేడ్చల్-సికింద్రాబాద్-తెల్లాపూర్ ఎంఎంటీఎస్ రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. మేడ్చల్ నుంచి లింగంపల్లి వెళ్లాలంటే తక్కువలో తక్కువ మూడు గంటలైనా పట్టేది కానీ ఎంఎంటీఎస్ అందుబాటులోకి వస్తే గంటన్నరలోపే గమ్యాన్ని చేరుకోవచ్చు. మేడ్చల్-తెల్లాపూర్ వయా సికింద్రాబాద్, మేడ్చల్-ఉందానగర్ వయా సికింద్రాబాద్ ఐలు అందుబాటులోకి రానుంది. సికింద్రాబాద్-మేడ్చల్ మార్గంలో లాలాగూడ గేట్, మల్కాజ్ గిరి, దయానందనగర్, సఫిల్ గూడ, ఆర్కేపురం, అమ్ముగూడ, కావర్లీ బ్యారెక్స్, అల్వాల్, బొల్లారం బజార్, గుండ్ల పోచంపల్లి, గౌడవల్లి స్టేషన్లకు ఎంఎంటీస్ రానుంది.
ఇదిలా ఉంటే కొత్త ఎంఎంటీఎస్‌లో అధునాతన సదుపాయాలు కల్పించనున్నారు అధికారులు. ప్రతీ కోచ్‌లో సీసీ కెమెరాలు, పిల్లలకు, మహిళలలకు ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు చేయనున్నారు. 1150 మంది కూర్చుని.. 4 వేల మంది నిల్చుని ప్రయాణించే వీలు ఉంటుంది. అంతేకాకుండా ఎల్ఈడీ బోర్డులు, మైక్‌లో రాబోయే స్టేషన్ల వివరాలను కూడా వెల్లడించే ఏర్పాటు చేశారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..