రేపే తెలంగాణలో ఎస్సై రాత పరీక్ష.. హైదరాబాద్‌ అభ్యర్థులకు అలర్ట్‌. పీఎం టూర్‌ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు.

తెలంగాణలో ఎస్సై ఉద్యోగాల నియామకాలకు సంబంధించి నిర్వహించే రాత పరీక్షకు సమయం అసన్నమైంది. ఏప్రిల్‌ 8,9వ తేదీల్లో పరీక్షను నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షను..

రేపే తెలంగాణలో ఎస్సై రాత పరీక్ష.. హైదరాబాద్‌ అభ్యర్థులకు అలర్ట్‌. పీఎం టూర్‌ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు.
Si Exam Telangana
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 07, 2023 | 5:01 PM

తెలంగాణలో ఎస్సై ఉద్యోగాల నియామకాలకు సంబంధించి నిర్వహించే రాత పరీక్షకు సమయం అసన్నమైంది. ఏప్రిల్‌ 8,9వ తేదీల్లో పరీక్షను నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే హాల్‌ టికెట్స్‌ డౌన్‌లోడ్ ప్రక్రియ పూర్తయింది. పరీక్షలకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశారు.

పరీక్షా నిర్వహణ కేంద్రాలుగా ఎంపిక చేసిన కళాశాలలు నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. అలాగే పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు అందుబాటులో ఉంచాలని అధికారులు సూచించారు. మహిళా అభ్యర్థులు ఎటువంటి ఇబ్బందులూ పడకుండా తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే అధికారులు సూచించారు. హాల్‌టికెట్లపై అభ్యర్థులు తప్పనిసరిగా ఫొటో అతికించాలని స్పష్టం చేశారు. హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌లో పరీక్షలు జరగనున్నాయి.

ట్రాఫిక్‌ ఆంక్షలున్నాయి జాగ్రత్త..

ఇదిలా ఉంటే శనివారం ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌ పర్యటన ఉన్న విషయం తెలిసిందే. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ అభివృద్ధి పనులకు శంకుస్థాపనతో పాటు మరికొన్ని ప్రాజెక్టులను ప్రారంభించేందుకు గాను మోదీ శనివారం నగరానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సికింద్రాబాద్ పరిధిలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించనున్నారు. శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు, మళ్లింపులు విధిస్తున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ తెలిపారు. ఎస్సై పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఈ విషయాలను పరిగణలోకి తీసుకోవడం ఉత్తమం. ట్రాఫిక్ ఆంక్షలు ప్రారంభమయ్యేకంటే ముందే పరీక్షా సెంటర్‌కు చేరుకునేలా ప్లాన్‌ చేసుకోండి.

ఇవి కూడా చదవండి

ప్రధాని పర్యటించే మోనప్ప జంక్షన్‌, సీటీఓ జంక్షన్‌, సెయింట్‌ జాన్స్‌ రోటరీ, సంగీత్‌ ఎక్స్‌ రోడ్స్‌, చిలకల గూడ జంక్షన్‌, ఎంజీ రోడ్‌, ఆర్పీ రోడ్‌,ర ఎస్పీ రోడ్‌ మార్గాల్లో ప్రయాణించేవారు ప్రత్యామ్నాయం చూసుకోవాలని సీపీ ఇప్పటికే సూచించారు. టివోలీ జంక్షన్‌ నుంచి ప్లాజా జంక్షన్‌, ఎస్బీహెచ్‌ ఎక్స్‌రోడ్స్‌ నుంచి స్వీకార్‌ ఉప్‌కార్‌ జంక్షన్‌ మధ్య మార్గాన్ని పూర్తిగా మూసి ఉంచుతారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..