AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: క్యాన్సర్ బారిన పడిన చిన్నారి.. మానవత్వం చాటుకున్న జిల్లా కలెక్టర్ సందీప్

చిన్నారికి మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని జిల్లా కలెక్టర్ కుటుంబసభ్యులకు భరోసా కల్పించారు. వీర్నపల్లి మండల తహసిల్దార్, చిన్నారి తల్లి పేరు మీద జాయింట్ బ్యాంకు ఖాతా ప్రారంభించి అందులో వైద్య ఖర్చుల నిమిత్తం 10 లక్షల రూపాయలు జమ చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

Telangana: క్యాన్సర్ బారిన పడిన చిన్నారి.. మానవత్వం చాటుకున్న జిల్లా కలెక్టర్ సందీప్
District Collector Sandeep
G Sampath Kumar
| Edited By: Surya Kala|

Updated on: Aug 05, 2024 | 12:16 PM

Share

రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లి గ్రామానికి చెందిన గజ్జెల దిలీప్ శ్యామల దంపతుల చిన్న కూతురైన చిన్నారి నయనశ్రీ క్యాన్సర్ తో బాధ పడుతోంది. ఈ విషయం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝు దృష్టికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆ చిన్నారి వైద్య చికిత్సకు సంపూర్ణ మద్దతు అందించేందుకు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ముందుకు వచ్చారు. ఆ కుటుంబానికి అండగా నిలిచారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ వీర్నపల్లి మండలం గర్జనపల్లి గ్రామంలోని చిన్నారి ఇంటిని సందర్శించారు. చిన్నారికి వచ్చిన క్యాన్సర్ వ్యాధి చికిత్స నిమిత్తం ఇప్పటికే తల్లిదండ్రులు 3 లక్షల రూపాయలను అప్పుచేసి ఖర్చు చేశారని కలెక్టర్ తెలుసుకున్నారు.

చిన్నారికి మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని జిల్లా కలెక్టర్ కుటుంబసభ్యులకు భరోసా కల్పించారు. వీర్నపల్లి మండల తహసిల్దార్, చిన్నారి తల్లి పేరు మీద జాయింట్ బ్యాంకు ఖాతా ప్రారంభించి అందులో వైద్య ఖర్చుల నిమిత్తం 10 లక్షల రూపాయలు జమ చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

చిన్నారికి ఉన్న క్యాన్సర్ వ్యాధిని పూర్తిస్థాయిలో నయం చేసేందుకు మెరుగైన వైద్యం ఎక్కడ అందించాలనే అంశాన్ని పరిశీలించి నివేదిక సమర్పించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు. డీఎంహెచ్ఓ రిపోర్ట్ ప్రకారం చిన్నారి చికిత్స ప్రారంభించాలని, బ్యాంకులో జమ చేసిన నిధులు చికిత్స కోసం వినియోగించాలని కలెక్టర్ పేర్కొన్నారు. చిన్నారి చికిత్స కోసం అవసరమైతే మరిన్ని నిధులను కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నామని, చిన్నారి వైద్య చికిత్స నిమిత్తం ఏ సమయంలో నైనా, ఎలాంటి సహాయం అవసరం ఉన్నా నేరుగా తనకు ఫోన్ చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..