Watch Video: హాస్పిటల్‌లో షాకింగ్ డెత్..! లిఫ్ట్ రాకముందే తెరుచుకున్న డోర్.. ఫోన్ మాట్లాడుతూ మహిళ..
తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రవేట్ ఆసుపత్రిలో మహిళ అనుహ్యరీతిలో ప్రమాదానికి గురై ప్రాణాలు విడిచింది.
Khammam Shocking Death: తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రవేట్ ఆసుపత్రిలో మహిళ అనుహ్యరీతిలో ప్రమాదానికి గురై ప్రాణాలు విడిచింది. ఆసుపత్రిలో ఉన్న లిఫ్టు రాకముందే.. ఆకస్మాత్తుగా తెరుచుకోవడంతో మహిళ మృతి చెందింది. లిఫ్ట్ రాకముందే డోర్ ఓపెన్ అయ్యింది. అదే సమయంలో ఫోన్ మాట్లాడుతూ గమనించని మహిళ.. లోపలికి అడుగు వేయడంతో లిఫ్ట్ గుంతలో పడి పోయింది. దీంతో పైనుంచి వచ్చిన లిఫ్ట్ ఆమెపై పడింది. తీవ్రగాయాలైన ఆమె అక్కడికక్కడే మరణించింది.
చనిపోయిన మహిళ ఖమ్మం జిల్లాలోని వైరా మండలం గొల్లెనపహాడ్‌కు చెందిన ప్రమీలగా గుర్తించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బంధువులను పరామర్శించేందుకు వెళ్లిన ఆమె.. తిరిగి వెళ్తుతూ లిఫ్ట్ గుంతలో పడి ప్రాణాలు కోల్పోయింది. లిఫ్ట్ రాకముందే డోర్ ఓపెన్ అయ్యిందంటే ఇది పూర్తిగా మెయింటినెన్స్ లోపంతో జరిగినట్టు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషాదంపై ఇప్పటివరకూ ఎలాంటి కేసు నమోదు కాలేదు.
ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. చాలా ఆసుపత్రుల్లో లిఫ్ట్ లు ఇలానే ఉన్నాయన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..