AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఈ ఆలయ అభివృద్ధితోనే తెలంగాణ అభివృద్ధి ప్రారంభం.. ఇంద్రవెల్లి సభలో డిప్యూటీ సీఎం

ధరణి మూలంగా భూములు కోల్పోయిన గోండు గిరిజనులకు తిరిగి ఆ భూములను అప్పగిస్తామని ఇంద్రవెల్లి సభలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. పోరాట యోధులు, అమరుల ఆలోచనలను ఈ ప్రభుత్వం అమలు చేస్తుందని అందుకు గాను ఇటీవల రెండు కార్యక్రమాలు చేపట్టిందన్నారు. కళాకారులకు అందించే నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులను అందిస్తామని ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారని తెలిపారు.

Telangana: ఈ ఆలయ అభివృద్ధితోనే తెలంగాణ అభివృద్ధి ప్రారంభం.. ఇంద్రవెల్లి సభలో డిప్యూటీ సీఎం
Deputy Cm Batti Vikramarka
Sravan Kumar B
| Edited By: Srikar T|

Updated on: Feb 02, 2024 | 9:34 PM

Share

ధరణి మూలంగా భూములు కోల్పోయిన గోండు గిరిజనులకు తిరిగి ఆ భూములను అప్పగిస్తామని ఇంద్రవెల్లి సభలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. పోరాట యోధులు, అమరుల ఆలోచనలను ఈ ప్రభుత్వం అమలు చేస్తుందని అందుకు గాను ఇటీవల రెండు కార్యక్రమాలు చేపట్టిందన్నారు. కళాకారులకు అందించే నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులను అందిస్తామని ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తామని ఇంద్రవెల్లి అమరుల స్థూపంగా సాక్షిగా ప్రమాణం చేశాం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇదే అమరుల స్తూపం సాక్షిగా నాగోబా దేవాలయం అభివృద్ధి పనులు ప్రారంభించామని తెలిపారు. నేటి ఇంద్రవల్లి సభ సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు అని అన్నారు. కోరి తెచ్చుకున్న తెలంగాణ కొద్దిమంది చేతుల్లో బంది కాగా.. మేము అధికారంలోకి వస్తే మీ కష్టాలు తీరుస్తాం అని ఇదే ఆదిలాబాద్ జిల్లాలో ప్రకటించామన్నారు.

మీ అందరి ఆశీస్సులతో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందన్నారు. ఇచ్చిన మాట మరవకుండా వంశస్తుల నాగోబా దేవాలయం అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామన్నారు. అమరుల స్తూపం సాక్షిగా ఇచ్చిన మాట మేరకు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి పని చేస్తామన్నారు. గోండుల జీవితాల్లో మార్పు రావాలని గద్దర్ తన జీవితాన్ని అంకితం చేశారన్నారు. తాను పాదయాత్ర మొదలుపెట్టిన రోజు అమరుల స్తూపం వద్ద గద్దర్ ప్రమాణం చేయించారని గుర్తు చేసుకున్నారు. గోండుల జీవితాల్లో మార్పు కోసం తాను పీపుల్స్ మార్చ్ పేరిట పాదయాత్రను ఇంద్రవెల్లి నుంచే ప్రారంభించిన సంఘటనను బట్టి విక్రమార్క మరోసారి చేసుకున్నారు. ఐటీడీఏల పునరుద్ధరణ, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు ఆర్థిక సాయం పెంచడం, త్రివేణి సంగమం అభివృద్ధి, చిహ్మాన్ ప్రాజెక్టును పూర్తి చేయాలని నాడు గద్దర్ కోరారు. ఈ పనులన్నీటిని పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని చెప్పారు. ఇదే అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారని గుర్తు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..