Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kotha Prabhakar Reddy: దుబ్బాక ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతున్న రాజకీయం.. పార్టీలో ఉండేనా.? మారేనా..?

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చర్చ అంత ఆ ఎమ్మెల్యే గురించే..! గత కొద్ది రోజులుగా అతను ఏం చేసిన వార్తే అవుతుందట..! ఇక ఆయన సొంత జిల్లాలోని నేతలకు ఆ ఎమ్మెల్యే పై పలు అనుమానాలు మొదలు అవుతున్నాయట.. ఈ మధ్య ఆయన వ్యవహార శైలిలో కొంత మార్పు కన్పిస్తుండటంతో కార్యకర్తలే షాక్ అవుతున్నారట.

Kotha Prabhakar Reddy: దుబ్బాక ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతున్న రాజకీయం.. పార్టీలో ఉండేనా.? మారేనా..?
Dubbaka Mla Kotha Prabhakar Reddy
Follow us
P Shivteja

| Edited By: Balaraju Goud

Updated on: Feb 02, 2024 | 4:51 PM

తెలంగాన రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చర్చ అంత ఆ ఎమ్మెల్యే గురించే..! గత కొద్ది రోజులుగా అతను ఏం చేసిన వార్తే అవుతుందట..! ఇక ఆయన సొంత జిల్లాలోని నేతలకు ఆ ఎమ్మెల్యే పై పలు అనుమానాలు మొదలు అవుతున్నాయట.. ఈ మధ్య ఆయన వ్యవహార శైలిలో కొంత మార్పు కన్పిస్తుండటంతో కార్యకర్తలే షాక్ అవుతున్నారట. ఆ మార్పు దేనికో అర్ధంకాక ఆ జిల్లాలోని ఆయనను నమ్ముకొని ఉన్న నేతలు గందరగోళానికి గురి అవుతున్నారు. ఇంతంకీ ఎవరా ఎమ్మెల్యే..?

గత కొద్ది రోజులుగా నిత్యం వార్తల్లో ఉంటున్నరు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.. ఆయన ఏం చేసినా, చేయకపోయినా ఇటీవలి కాలంలో నిత్యం వార్తల్లో ఉంటున్నాడు. మొన్నటికి మొన్న ఉమ్మడి మెదక్ జిల్లా నుండి ముగ్గురు ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినప్పటి నుండి ఈయన పైన పెద్ద చర్చే నడుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మాజీ మంత్రి హరీష్ రావుకు అత్యంతసన్నిహితంగా ఉండే కొత్త ప్రభాకర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని మరో ముగ్గురు ఎమ్మెల్యేలతో కలిసి కలవడం పెద్ద సెన్సేషనల్ అయ్యింది.

ఇప్పుడు ఇప్పుడే ఆ విషయం మరిచిపోతున్న తరుణంలో, కొత్త ప్రభాకర్ రెడ్డి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాకపోవడంతో మళ్ళీ ఆయన పై ఇటు బీఆర్ఎస్ పార్టీతో పాటు బయట కూడా మళ్ళీ చర్చ మొదలైంది. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కానీ అందులో ఒక్క కొత్త ప్రభాకర్ రెడ్డి మాత్రమే కేసీఆర్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరు కాలేదు. తన నియోజకవర్గ పరిధిలో ఏమైనా ముఖ్యమైన కార్యక్రమాలు ఉండి ఈ కార్యక్రమానికి హాజరు కాలేదా అంటే.. అదేం లేదంటున్నారు పార్టీ నేతలు. ఫిబ్రవరి 1వ తేదీన మొత్తం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్ లోనే ఉన్నాడట.

హైదరాబాద్ లో ఉండి కూడా కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకరణ కార్యక్రమానికి ఎందుకు హాజరు కాలేదు అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ మారుతాడని, కాంగ్రెస్ పార్టీలో చేరుతారని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారట..అందుకే ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశాడని, తనతో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలను తీసుకెళ్లాడని ప్రచారం చేస్తున్నారట. సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి కొత్త ప్రభాకర్ రెడ్డే అపాయింట్మెంట్ తీసుకున్నాడని, ఆ విషయం బీఆర్ఎస్ పార్టీ పెద్దలకు కూడా తెలియదు అని, కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యతిరేక వర్గం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జోరుగా ప్రచారం చేస్తున్నారట.

త్వరలోనే కారు పార్టీ నుండి, హస్తం పార్టీలోకి మారుతాడనే ఒక ప్రచారం జోరుగా జరుగుతున్న సమయంలో, కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమానిక కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరు కాకపోవడం అనేది ఇప్పుడు అందరిని ఆలోచనలో పడేసిందట. కొత్త ప్రభాకర్ రెడ్డికి ఎమ్మెల్యే కావలనేది చాలా రోజుల కల. అతను మెదక్ ఎంపీగా బీఆర్ఎస్ పార్టీ నుండి రెండు సార్లు గెలిచాడు. ఎంపీగా ఉన్నప్పటి నుండి ఎమ్మెల్యే కావలనేది ఆయన కల. అందుకే మొన్న జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ దుబ్బాక ఎమ్మెల్యే టికెట్‌ను కొత్త ప్రభాకర్ రెడ్డి ఇచ్చారు. మాజీ మంత్రి హరీష్ రావుకు అత్యంత నమ్మకస్థుడుగా పేరు ఉంది. ఎన్నికల ప్రచారంలో కూడా ప్రభాకర్ రెడ్డిపై కత్తి దాడి జరిగినప్పుడు ఆయనను ఆసుపత్రిలో చేర్పించి, ప్రచార బాధ్యతను మొత్తం చూసుకుంది కూడా హరీష్ రావునట.

బీఆర్ఎస్ పార్టీలో కూడా కొత్త ప్రభాకర్ రెడ్డికి మంచి పేరే ఉందని, ప్రభాకర్ రెడ్డి పార్టీ మారుతాడనే జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని బీఆర్ఎస్ పార్టీ కొట్టి పారేస్తుందట. హరీష్ రావుని కాదని కొత్త ప్రభాకర్ రెడ్డి అలాంటి నిర్ణయం తీసుకోరని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గట్టి నమ్మకంతో ఉన్నారట. దుబ్బాకలో కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడం, పార్టీ అధికారం కోల్పోవడం ఎమ్మెల్యేకు సరైన ప్రోటోకాల్ ఇవ్వడం లేదని ముఖ్యమంత్రి కలిశాడని చెబుతున్నా.. ఇటీవలి కాలంలో కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యవహార శైలి మాత్రం కొంత ఎవరికి అంతు చిక్కడం లేదని, కేసీఆర్ ప్రమాణ స్వీకరణ కార్యక్రమానికి ఎందుకు హాజరుకాలేదు..? పార్టీకి చెప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడంపై కేసీఆర్ ఏమైనా మందలించి ఉంటాడా..? లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత కేసీఆర్‌ను కలిసే ధైర్యం చేయలేక పోతున్నాడా? ఇలా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…