AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: గాంధీభవన్ లో ఎంపీ అభ్యర్థుల అప్లికేషన్ల స్వీకరణ.. ఎవరెవరు ఎక్కడి నుంచి దరఖాస్తు పెట్టుకున్నారంటే?

అధికార పార్టీ కి దరఖాస్తుల తాకిడి పెరిగింది. పార్లమెంట్ సీటు ఆశిస్తున్నా వారి నుండి దరఖాస్తులు స్వీకరణకు శనివారం (ఫిబ్రవరి 03) ఆఖరి తేదీ కావడంతో ఆశావహులు గాంధీ భవన్ కి క్యూ కట్టారు. ఇప్పటి వరకు 140 మంది పైగా దరఖాస్తు చేసుకున్నారు.

Telangana: గాంధీభవన్ లో ఎంపీ అభ్యర్థుల అప్లికేషన్ల స్వీకరణ.. ఎవరెవరు ఎక్కడి నుంచి దరఖాస్తు పెట్టుకున్నారంటే?
Telangana Congress
Ashok Bheemanapalli
| Edited By: Basha Shek|

Updated on: Feb 03, 2024 | 6:56 AM

Share

అధికార పార్టీ కి దరఖాస్తుల తాకిడి పెరిగింది. పార్లమెంట్ సీటు ఆశిస్తున్నా వారి నుండి దరఖాస్తులు స్వీకరణకు శనివారం (ఫిబ్రవరి 03) ఆఖరి తేదీ కావడంతో ఆశావహులు గాంధీ భవన్ కి క్యూ కట్టారు. ఇప్పటి వరకు 140 మంది పైగా దరఖాస్తు చేసుకున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న నాయకుల నుంచి కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులను కోరింది. ఇప్పటివరకు 140కి పైగా దరఖాస్తు లు వచ్చాయి. రేపు సాయంత్రం ఐదు గంటలకు గడువు ముగియనుంది. దీంతో శుక్రవారం పార్టీకి చెందిన సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు.మహబూబాబాద్ పార్లమెంట్ నియోజక వర్గ కాంగ్రెస్ సీటు కోసం దరఖాస్తు చేసుకున్నారు తెలుగు యూనివర్సిటీ రిజిస్ట్రార్ రమేష్ భట్టు. ఇక మూడు నియోజక వర్గాలకు దరఖాస్తు చేశారు మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ. వరంగల్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి నియోజక వర్గాలకు అప్లికేషన్ ఇచ్చారాయన.

ఇక నల్గొండ పార్లమెంట్ సీటు కోసం జానారెడ్డి కుమారుడు రఘు వీర్ తరుపున దరఖాస్తు చేశారు ఎమ్మెల్యే జయవిర్. భువనగిరి పార్లమెంటు నియోజక టికెట్ కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బంధువు చెన్నూరిమురళీధర్ రెడ్డి దరఖాస్తు చేశారు. నల్గొండ ఎంపీ సీటు కోసం దరఖాస్తు చేసుకున్న పటేల్ రమేష్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ సీటు కోసం హరివర్దన్ రెడ్డి, బండ్ల గణేష్ దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత కోదండ రెడ్డి కూడా పోటీ చేయడానికి దరఖాస్తు పెట్టారు. సికింద్రాబాద్ సీటు కోసం కోదండరెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. బలరాం నాయక్.. మహబూబాబాద్ దరఖాస్తు పెట్టారు.

మాజీ డీహెచ్‌ శ్రీనివాస్ తన సన్నిహితుడు తో కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. సికింద్రాబాద్.. ఖమ్మం సీటు కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నన్ని రోజులు కేసీఆర్ ని పొగడ్తల్లో ముంచిన ఆయన.. ఇప్పుడు కాంగ్రెస్ సీటు కోసం దరఖాస్తు చేసుకోవడం ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..