Dalitha Bandhu: రూ.500 కోట్లు విడుదల చేస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు

హుజూరాబాద్‌లో దళిత బంధు నిధులపై జీవో వచ్చింది. ప్రస్తుతానికి 500 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు...

Dalitha Bandhu: రూ.500 కోట్లు విడుదల చేస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు
Dalitha Bandhu
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 09, 2021 | 1:36 PM

హుజూరాబాద్‌లో దళిత బంధు నిధులపై జీవో వచ్చింది. ప్రస్తుతానికి 500 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఆలేరు నియోజకవర్గం వాసాలమర్రిలో దళిత బంధును అమలు చేశారు. హుజూరాబాద్‌లో దాదాపు 15 వేల దళిత కుటుంబాలు ఉన్నాయి. మొదటి విడత కింద 500 కోట్లను విడుదల చేశారు. ఈ పథకం కింద ఒక్కో లబ్దిదారుడికి పది లక్షలు నేరుగా ఇస్తుంది ప్రభుత్వం. వాటి ద్వారా ఉపాధి అవకాశాలు చూపుతుంది.

 దళితబంధు  పథకం కాదు.. ఇది ఓ ఉద్యమం: సీఎం కేసీఆర్

దళితబంధు అనేది ఓ పథకం కాదు.. ఇది ఓ ఉద్యమం అంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌. ఉత్పాదక రంగానికి ఇంతకాలం దూరంగా ఉన్న వర్గాలను కూడా రాష్ట్ర ఆర్ధికాభివృద్ధిలో భాగస్వాములు చేసేలా పథకం అమలు చేస్తామంటున్నారు సీఎం. ఈ స్కీమ్ ప్రకటించిన రోజు నుంచే మద్దతు అనూహ్యంగా పెరుగుతోంది.  కాళ్లు, రెక్కలు మాత్రమే ఆస్తులుగా కలిగిన దళిత కుటుంబాలే మొదటి ప్రాధాన్యతగా దళిత బంధు పథకం రాష్ట్రవ్యాప్తంగా, అర్హులైన దళితులందరికీ అమలు చేస్తామని, దశలవారీగా అమలు చేసే ఈ పథకం కోసం రూ. 80 వేల కోట్ల నుంచి రూ. లక్ష కోట్ల వరకు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. దళితబంధు కేవలం తెలంగాణలో మాత్రమే కాకుండా యావత్ దేశానికి ఆదర్శంగా నిలవనుందన్నారు. దేశంలోని దళితులందరినీ ఆర్ధిక, సామాజిక వివక్షల నుంచి విముక్తులను చేసే పథకంగా మారాలని సీఎం ఆకాంక్షించారు.

Also Read: సెక్యూరిటీపై దాడి.. హైదరాబాద్‌ జువైనల్‌ హోమ్‌ నుంచి మైనర్లు ఎస్కేప్.. దొరకని ఆచూకి

 స్టెప్పులతో అదరగొట్టిన డిప్యూటీ సీఎం.. కోలాహలంగా ఆదివాసి సంబరం