Hyderabad: సెక్యూరిటీపై దాడి.. హైదరాబాద్ జువైనల్ హోమ్ నుంచి మైనర్లు ఎస్కేప్.. దొరకని ఆచూకి
హైదరాబాద్‌లోని జువైనల్ హోమ్ నుంచి పరారైన మైనర్ల ఆచూకీ దొరకలేదు. సెక్యూరిటిపై ఎటాక్ చేసి చాకచాక్యంగా తప్పించుకుపోయిన..
హైదరాబాద్‌లోని జువైనల్ హోమ్ నుంచి పరారైన మైనర్ల ఆచూకీ దొరకలేదు. సెక్యూరిటిపై ఎటాక్ చేసి చాకచాక్యంగా తప్పించుకుపోయిన పిల్లలు ఎక్కడికి వెళ్లారు.. ఎందుకు ఎస్కేప్ అయ్యారన్నది మిస్టరీగా మారింది. వాళ్ల జాడ కోసం అటు సీడబ్ల్యూసీ.. ఇటు పోలీసులు సెర్చ్ చేస్తున్నారు. కానీ ఇప్పటిదాకా పిల్లలకు సంబంధించి ఎలాంటి క్లూ దొరకలేదు. బిహార్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన మైనర్లు ఆపరేషన్ ముస్కాన్‌లో పట్టుబడ్డారు. వారిని సైదాబాద్‌లోని జువైనల్‌హోమ్‌కి తరలించారు. ఆదివారం సిబ్బంది ఎక్కువగా ఉండరని గమనించిన పది మంది పిల్లలు హోమ్‌నుంచి పారిపోవాలని భావించారు. గేట్ తాళం తీసుకుని బయటకు వెళ్తుండగా సెక్యూరిటీ అడ్డుకున్నాడు. అతనిపై దాడి చేసి వెళ్లిపోయారు. మైనర్లు పరారీ కావడంతో జువైనల్ హోమ్ సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. పది మంది పిల్లల్లో నలుగురు మాత్రమే దొరికారు. మిగతా వాళ్ల జాడ తెలియకుండా పోయింది. జువైనల్ హోమ్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే పిల్లలు వెళ్లిపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు పోలీసులు వారి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా వారిని పట్టుకుంటామన్నారు.
టిప్పర్‌కు తగిలిన విద్యుత్ తీగలు… ముగ్గురు మృతి
కంకర తరలిస్తున్న టిప్పర్‌కు విద్యుత్ తీగలు తగిలి ముగ్గురు మృతి చెందిన ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లాలో జరిగింది. పాలసముద్రం మండలం కనికాపురంలో ఉదయం జరిగిన ప్రమాదంలో లారీ డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు యువకులు ప్రాణాలు విడిచారు. కనికాపురంలో ఇల్లు నిర్మించుకుంటున్న మునిస్వామి నాయుడు తన అవసరాల కోసం జీడీ నెల్లూరు మండలం వేల్పూరు పెద్ద కాలువ నుంచి టిప్పర్‌లో కంకరు తెప్పించారు. మునిస్వామి నాయుడు ఇంటి సమీపంలో కంకరను అన్‌లోడ్ చేసే సమయంలో కరెంట్ తీగలు గమనించని డ్రైవర్ మనోజ్.. టిప్పర్ వెనక భాగం పైకెత్తాడు. ఈ క్రమంలో టిప్పర్‌కు విద్యుత్ తీగలు తగిలి కరెంట్ ప్రవహించింది. దీంతో డ్రైవర్ కేకలు వేశాడు. అతడిని కాపాడే క్రమంలో యువకులు జ్యోతీశ్వర్, దొరబాబు కూడా కరెంట్ షాక్‌తో ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:స్టెప్పులతో అదరగొట్టిన డిప్యూటీ సీఎం.. కోలాహలంగా ఆదివాసి సంబరం