హై అలెర్ట్.. పాకిస్తాన్ భారీ కుట్ర.. తిప్పికొట్టిన పంజాబ్ పోలీసులు.. పిల్లల టిఫిన్ బాక్సుల్లో
IED found inside tiffin box: స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో పాకిస్తాన్ ఉగ్ర కుట్రకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ తరుణంలో పాక్ భారీ ఉగ్ర కుట్రను
IED found inside tiffin box: స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో పాకిస్తాన్ ఉగ్ర కుట్రకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ తరుణంలో పాక్ భారీ ఉగ్ర కుట్రను పంజాబ్ పోలీసులు భగ్నం చేశారు. పంజాబ్-పాకిస్తాన్ సరిహద్దుల్లోని అమృత్‌సర్ ప్రాంతంలోని దాలేకే గ్రామంలో పోలీసులు ఐఈడీ, హ్యాండ్ గ్రెనేడ్ బాంబులను గుర్తించారు. డ్రోన్స్ ద్వారా పిల్లల టిఫిన్ బాక్సుల్లో బాంబులను అమర్చి ఉగ్ర కుట్రకోసం.. ముష్కరమూకలు తరలిస్తున్నారని పంజాబ్ డీజీపీ దినకర్ గుప్తా వెల్లడించారు. ఆ పేలుడు ఐఈడీ పరికరాలను ఆదివారం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పాకిస్తాన్ నుంచి డ్రోన్ ద్వారా వీటిని సరఫరా చేసినట్లు అనుమానిస్తున్నామని డీజీపీ తెలిపారు. టిఫిన్ బాక్స్ ఉన్న బ్యాగ్‌లో ఐదు హ్యాండ్ గ్రెనేడ్‌లను గుర్తించినట్లు తెలిపారు. 20 ఐఈడీ బాంబులు, మూడు డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ తెలిపారు.
కాశ్మీర్‌తోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో ఉగ్ర కుట్రల కోసం.. పేలుడు పదార్థాలను సరఫరా చేయడానికి ఉగ్రవాదులు డ్రోన్‌లను ఉపయోగిస్తున్నట్లు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల సరిహద్దుల్లో కాశ్మీర్ పోలీసులు 5కేజీ ఐఈడీ బాంబును తీసుకెళ్తున్న ఒక డ్రోన్‌ను పేల్చివేశారు. డ్రోన్ల కలకలం నాటినుంచి సరిహద్దుల్లో భద్రతను పెంచారు. ఇదిలాఉంటే.. పంద్రాగస్టు నేపథ్యంలో దేశంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం.. పంజాబ్, ఢిల్లీ, జమ్మూకాశ్మీర్ సహా పలు ప్రాంతాల్లో హై అలెర్ట్‌ను ప్రకటించింది.
Also Read: