పోరు ఉధృతం.. ఆఫ్ఘనిస్తాన్ లో మరో రాష్ట్రాన్ని స్వాధీనం చేసుకున్న తాలిబన్లు

ఉత్తర ఆఫ్ఘనిస్తాన్ లోని కుందుజ్ ప్రావిన్స్ ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు నెలరోజులుగా ముట్టడించి చివరకు నిన్న దీన్ని తమ హస్తగతం చేసుకున్నారు. కుందుజ్ సిటీలోని ట్రాఫిక్ పోలీస్ బూత్ పై తమ జెండాను వీరు ఎగురవేశారు.

పోరు ఉధృతం.. ఆఫ్ఘనిస్తాన్ లో మరో రాష్ట్రాన్ని స్వాధీనం చేసుకున్న తాలిబన్లు
Talibans
Follow us

| Edited By: Phani CH

Updated on: Aug 09, 2021 | 12:23 PM

ఉత్తర ఆఫ్ఘనిస్తాన్ లోని కుందుజ్ ప్రావిన్స్ ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు నెలరోజులుగా ముట్టడించి చివరకు నిన్న దీన్ని తమ హస్తగతం చేసుకున్నారు. కుందుజ్ సిటీలోని ట్రాఫిక్ పోలీస్ బూత్ పై తమ జెండాను వీరు ఎగురవేశారు. తజికిస్తాన్ కి దగ్గరలోనే ఉన్న ఈ సిటీ సమీప గ్రామాల్లో పంటలు ఎక్కువగా పండిస్తున్నారని తెలుస్తోంది. ఈ సిటీలోని అతి పెద్ద జైలును కూడా తాలిబన్లు స్వాధీనం చేసుకుని అందులో ఖైదీలుగా ఉన్న దాదాపు 500 మంది తాలిబన్లను విడుదల చేశారు. గవర్నర్ కార్యాలయం, పోలీసు హెడ్ క్వార్ట్రర్స్ కూడా ఇప్పుడు తమ వశమయ్యాయని తాలిబన్లు ప్రకటించుకున్నారు. దాదాపు నాలుగు లక్షల జనాభా గల ఈ సిటీ వీరి వశం కావడం ఆఫ్ఘన్ దళాలకు పెద్ద దెబ్బ.రాజధాని కాబూల్ కి ఈ సిటీ సుమారు 200 మైళ్ళ దూరంలో ఉంది.

ఆఫ్ఘన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణకు రోజులు దగ్గరపడుతుండడంతో తాలిబన్లు తమ పోరును మరింత ఉధృతం చేస్తున్నారు. 2011 లో ఈ దేశంలో లక్ష మంది అమెరికా సైనికులు ఉండగా ప్రస్తుతం దాదాపు 650 మంది మాత్రమే ఉన్నారు. ఈ నెల 31 నాటికి అమెరికా బలగాల ఉపసంహరణ పూర్తి కానుంది.అయితే తాజా పరిణామాల నేపథ్యంలో బహుశా కొంతకాలం పొడిగించవచ్చునని వార్తలు కూడా వస్తున్నాయి. జెరంగ్, షెబర్గాన్ రాజధానులను తాలిబన్లు ఇదివరకే వశపరచుకున్నారు. కాగా కుందుజ్ ప్రావిన్స్ ని వీరు స్వాధీనం చేసుకున్నారన్న వార్తలను ఆఫ్ఘన్ ప్రభుత్వం ఖండించింది. ఇవి ఊహాగానాలని పేర్కొంది.

మరిన్ని ఇక్కడ చూడండి: Smart Phones: రూ. పది వేల లోపు స్మార్ట్‌ఫోన్‌ను కొనాలని ప్లాన్‌ చేస్తున్నారా.? అయితే బెస్ట్‌ ఫోన్‌లపై ఓ లుక్కేయండి..

ఈ 4 రకాల బియ్యాలలో ఏవి ఉత్తమం..! ఆరోగ్యానికి ఏ బియ్యం మంచివో.. తెలుసుకోండి..