AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ 4 రకాల బియ్యాలలో ఏవి ఉత్తమం..! ఆరోగ్యానికి ఏ బియ్యం మంచివో.. తెలుసుకోండి..

Rice Benefits : కరోనా వల్ల ప్రజలు ఆరోగ్యం గురించి చాలా ఆలోచిస్తున్నారు. ప్రతిరోజు ఇంట్లో మనం అన్నం తింటున్నాం కానీ అందుకోంస ఏ రైస్ వాడితే మంచిదో చాలా మందికి తెలియదు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే

ఈ 4 రకాల బియ్యాలలో ఏవి ఉత్తమం..! ఆరోగ్యానికి ఏ బియ్యం మంచివో.. తెలుసుకోండి..
Red Rice
uppula Raju
|

Updated on: Aug 09, 2021 | 11:55 AM

Share

Rice Benefits : కరోనా వల్ల ప్రజలు ఆరోగ్యం గురించి చాలా ఆలోచిస్తున్నారు. ప్రతిరోజు ఇంట్లో మనం అన్నం తింటున్నాం కానీ అందుకోంస ఏ రైస్ వాడితే మంచిదో చాలా మందికి తెలియదు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు, డయాబెటిక్ రోగులు దీని గురించి కచ్చితంగా ఆలోచించాలి. ఇటీవల కాలంలో కొంతమంది తెల్లగా కాకుండా గోధుమ, ఇతర రకాల బియ్యం తినడం ప్రారంభించారు. ఎరుపు, గోధుమ, తెలుపు, నలుపు బియ్యం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటి రంగు పోషకాలపై ఆధారపడి ఉంటుంది. అసలు ఎన్ని రకాల బియ్యం ఉన్నాయి వాటి ప్రయోజనాలు ఏంటో ఒక్కసారి తెలుసుకుందాం.

1. తెల్ల బియ్యం తెల్ల బియ్యాన్ని చాలామంది వాడుతారు. మార్కెట్లో అందుబాటులో ఉన్న అన్ని రకాల బియ్యాలలో తెల్ల బియ్యం ఎక్కువగా ప్రాసెస్ చేస్తారు. దీనిలో ఊక, పొట్టు, జెర్మ్స్ తొలగిస్తారు. దానివల్ల అవి త్వరగా పాడవవు. కానీ అధిక ప్రాసెసింగ్ కారణంగా పోషక అంశాలు తగ్గుతాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు, థయామిన్, విటమిన్లు ఉంటాయి. ఇది కాకుండా తెల్ల బియ్యంలో ఫైబర్ మొత్తం తక్కువగా ఉంటుంది. ఇందులో మంచి మొత్తంలో కాల్షియం, ఫోలేట్ ఉంటాయి.

2. బ్రౌన్ రైస్ బ్రౌన్ రైస్‌లో ఊక, మొలకలు ఉంటాయి, దీని నుంచి పొట్టు మాత్రమే తొలగిస్తారు. ఇవి తెల్ల బియ్యం కంటే ఎక్కువ పోషకమైనవి. ఇందులో ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. బ్రౌన్ రైస్‌లో తెల్ల బియ్యంతో సమానంగా కేలరీలు, పిండి పదార్థాలు ఉంటాయి. అయితే ఇందులో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ రకం బియ్యం షుగర్‌ని కంట్రోల్ చేస్తుంది.

3. ఎర్ర బియ్యం ఈ బియ్యంలో ఆంథోసైనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది బియ్యానికి ఎరుపు రంగును ఇస్తుంది. ఇందులో పెద్ద మొత్తంలో ఐరన్ ఉంటుంది. ఇది వాపు, రక్తపోటును అదుపులో ఉంచుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఈ బియ్యం ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది జీర్ణం కావడానికి సమయం పడుతుంది. దీనిని తినడం వల్ల ఆకలి త్వరగా రాదు పొట్ట కూడా చాలా సేపు నిండి ఉంటుంది. ఇందులో ఫైబర్, ప్రోటీన్ సహా అనేక పోషక అంశాలు ఉంటాయి. ఇది మీ శరీరంలోని క్యాన్సర్ కణాలను నివారించడంలో సహాయపడుతుంది. ఇది కాకుండా గుండె, మధుమేహం రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది.

4. నల్ల బియ్యం బ్లాక్ రైస్‌ను పర్పుల్ రైస్ అంటారు. దీని ఊకలో ఉండే ఫైటోకెమికల్స్ కారణంగా రంగు నల్లగా ఉంటుంది. ఈ రకం వరిలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. బ్లాక్ రైస్‌లో అన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దాని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉందని పరిశోధనలో తేలింది. యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నష్టాన్ని తగ్గిస్తాయి. దీని కారణంగా తీవ్రమైన వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. నల్ల బియ్యం బరువు తగ్గించడంలో, చక్కెర స్థాయిని అదుపులో ఉంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.

5. ఏది ఎక్కువ ప్రయోజనకరం.. వీటన్నింటిలో, ఎరుపు, గోధుమ, నల్ల బియ్యం ఆరోగ్యకరమైన ఎంపిక. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. వైట్ రైస్ ఎక్కువగా ప్రాసెస్ చేస్తారు. దీని కారణంగా పోషక కంటెంట్ తక్కువగా ఉంటుంది. బియ్యంలో కేలరీల పరిమాణం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అధిక పరిమాణంలో తినడం ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు.

Amazon Great Freedom: నేటితో ముగియనున్న అమేజాన్‌ గ్రేట్‌ ఫ్రీడమ్‌ సేల్‌.. బెస్ట్‌ ఆఫర్లపై ఓ లుక్కేయండి.

పాము కరవడంతో.. కోపంతో కొరికి చంపాడు..! చెట్టుకు వేలాడదీశాడు కానీ చివరకు ఇలా..

AP Crime: టిప్పర్‌కు విద్యుత్‌ తీగలు తగిలి ముగ్గురు దుర్మరణం.. కంకర లోడ్‌తో వెళుతుండగా..

ఆ ఒక్క రీజన్‌తో 50 దాటినా పెళ్లి చేసుకోని ధురంధర్ మూవీ విలన్
ఆ ఒక్క రీజన్‌తో 50 దాటినా పెళ్లి చేసుకోని ధురంధర్ మూవీ విలన్
వచ్చే రెండు రోజులు చాలా జాగ్రత్త.! బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ..
వచ్చే రెండు రోజులు చాలా జాగ్రత్త.! బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ..
అంబానీ మావ మాస్టర్ స్ట్రోక్ చూస్తే మైండ్ పోతుంది
అంబానీ మావ మాస్టర్ స్ట్రోక్ చూస్తే మైండ్ పోతుంది
తగ్గని బంగారం జోరు.. మళ్లీ పెరిగిన ధరలు.. తులం ఎంటంటే?
తగ్గని బంగారం జోరు.. మళ్లీ పెరిగిన ధరలు.. తులం ఎంటంటే?
ఓవర్ నైట్‌లో స్వ్కాడ్ మార్చిన గంభీర్.. డేంజరస్ ఆల్‌రౌండర్ ఎంట్రీ
ఓవర్ నైట్‌లో స్వ్కాడ్ మార్చిన గంభీర్.. డేంజరస్ ఆల్‌రౌండర్ ఎంట్రీ
క్లాట్‌ 2026 ఫలితాలు విడుదల.. కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ చూశారా?
క్లాట్‌ 2026 ఫలితాలు విడుదల.. కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ చూశారా?
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో మరో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో మరో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్
OTTలోకి వచ్చేసిన రియల్ లవ్ స్టోరీ..కన్నీళ్లు తెప్పించే క్లైమాక్స్
OTTలోకి వచ్చేసిన రియల్ లవ్ స్టోరీ..కన్నీళ్లు తెప్పించే క్లైమాక్స్
నెలకు రూ.లక్షన్నర జీతంతో.. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు
నెలకు రూ.లక్షన్నర జీతంతో.. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు
Horoscope Today: వారి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా..
Horoscope Today: వారి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా..